Take a fresh look at your lifestyle.

విద్యా సంవత్సరంపై కొరోనా పడగ

దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్రంలో కూడా కొరోనా రోజువారీ మరణాలతో సెకండ్‌ ‌వేవ్‌ ‌వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో మే 11 నుండి మే 30 వరకు లాక్‌ ‌డౌన్‌ ‌విధించారు. కరోనా వ్యాప్తిని మరింత కట్టడి చేసేందుకు జూన్‌ ‌మొదటి వారానికి లాక్‌ ‌డౌన్‌ ‌పొడిగించే అవకాశం ఉందని భావిస్తున్నారు.. గడచిన విద్యా సంవత్సరం 1 నుండి 5 తరగతులకు ప్రత్యక్ష బోధన లేకుండా విద్యా సంవత్సరం ముగిసింది. 9, 10 తరగతులకు 44 రోజులు, 6 నుండి 8 తరగతులకు 21 రోజులు ప్రత్యక్ష బోధన జరిగినా, అనేక పాఠశాలల్లో విద్యార్థులు కొరోనా బారిన పడినందున ఆన్లైన్‌ ‌తరగతులకే పరిమితమయింది. తెలంగాణలో పాఠశాల విద్యాశాఖ ఏప్రిల్‌ 27 ‌నుండి మే 31 వరకు వేసవి సెలవులు ప్రకటించింది. జూన్‌ 1‌వ తేదీ నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుందని, అప్పటి పరిస్థితులకనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ఈ విద్యా సంవత్సరం పై కూడా కరోనా పడగ విప్పనుందనే అనుమానాలు న్నాయి.

వవ 2019-20 విద్యా సంవత్సరంలో వార్షిక పరీక్షలు నిర్వహించకుండా 1 నుండి 9 తరగతులను పై తరగతికి ప్రమోట్‌ ‌చేసి, ఇంటర్నల్‌ ‌మార్కుల ఆధారంగా 10వ తరగతి ఫలితాలను ప్రకటించారు. 10వ తరగతి పరీక్ష ఫీజు చెల్లించిన 5,21,392 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లుగ ఫలితాలు వెల్లడించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే ఉత్తీర్ణతా శాతం, 10/10 జిపిఏ శాతం పెరిగినప్పటికీ ఆన్‌లైన్‌ ‌బోధనతో విద్యాప్రమాణాలు ఏ మేరకు మెరుగయ్యాయనే ప్రశ్న తలెత్తుతుంది.. పేద, ధనికబీద ప్రతిభావంతులు, మందబుద్ధులు తేడా లేకుండా సమదృష్టి పెంపొందుతుంది. ఆన్‌లైన్‌ ‌బోధనలో దీనికి ఆస్కారం లేదు. ఉపాధ్యాయ, విద్యార్ధుల మధ్య దూరం పెరిగి విద్య పట్ల ఆసక్తి తగ్గుతుంది.

గతేడాది దేశంలో కొరోనా తొలి కేసు నమోదైనప్పటి నుండి 2021 మార్చి 24 వరకు 10 ఏళ్ల లోపున్న 81,188 మందికి కొరోనా సోకగా, ఆ సంఖ్య మే 6 నాటికి 1, 49, 224 కు చేరింది. అంటే నెలన్నరలోనే 67 వేలకు పైగా కేసులు పెరిగాయి. . కర్ణాటకలో 10 ఏళ్ల లోపు పిల్లల్లో కొత్త కేసులు ఎక్కువగా వస్తుండడంతో థర్డ్ ‌వేవ్‌ ‌ప్రమాద• ఘంటికలు కర్ణాటక నుండి వెలువడుతున్నాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ ‌వేవ్‌లో పెద్ద వయస్సు వారు, సెకండ్‌ ‌వేవ్‌లో యువత కొరోనా బారిన పడగా, థర్డ్ ‌వేవ్‌లో చిన్నారులకు ముప్పు పొంచి ఉందనే ఆందోళన సర్వత్రా నెలకొంది. ఫిబ్రవరి 2021లో ఇండియన్‌ ‌కౌన్సిల్‌ ఆఫ్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ (ఐ ‌సీ ఎం ఆర్‌) ‌నిర్వహించిన సీరో సర్వేలో 25.3 శాతం మంది పిల్లలకు యాంటీబాడీలు ఉన్నట్లు తెలిసింది. అంటే వీరందరికీ కోవిడ్‌ ఇన్ఫెక్షన్‌ ‌సోకి ఉంటుంది. ఇంకా 60 శాతం మందికి ఇన్ఫెక్షన్‌ ‌సోకే అవకాశం ఉందని వైరాలజిస్ట్ ‌డా. రవి చెప్పారు. ఈ నేపథ్యంలో మూడో ముప్పును ఎదుర్కొనేందుకు మహారాష్ట్ర, ఉత్తర ప్రదేశ్‌, ‌కర్ణాటక, ఉత్తరాఖండ్‌ ‌వంటి రాష్ట్రాలు పిల్లల కోవిడ్‌ ‌టాస్క్ ‌ఫోర్స్ ‌ను ఏర్పాటు చేసి ఐ సి యు పడకలు, కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మాతా శిశు కేంద్రంలో చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా కోవిడ్‌ ‌సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.

మందు లేని కొరోనాను ఎదుర్కొనేందుకు 100 శాతం ప్రజలకు టీకా వేయడమే పరిష్కారం అయినప్పటికీ, 18 ఏళ్ళు పైబడిన వారిని మాత్రమే వ్యాక్సినేషన్‌ ‌కు అనుమతించడం, ఆ స్థాయిలో టీకా ఉత్పత్తి జరగక, టీకా ప్రక్రియ మందకొడిగా సాగడం ఆందోళన కలిగిస్తోంది.. భారత్‌ ‌బయోటెక్‌ ‌కోవాగ్జిన్‌ ‌క్లినికల్‌ ‌ట్రయల్స్ ‌ను 2 నుండి 18 ఏళ్ల వయస్సు వారి పై జూన్‌ 1‌వ తేదీ నుండి ప్రారంభించి, ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికి పిల్లలకు టీకా వేసేందుకు అనుమతులు వస్తాయని సంస్థ సిఎండి కృష్ణా ఎల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో ఇటు ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు 100 శాతం టీకా ప్రక్రియ పూర్తి చేసి థర్డ్ ‌వేవ్‌ ‌ను సమర్థంగా ఎదుర్కోవడం, పాఠశాలలు పునఃప్రారంభమై విద్యా సంవత్సరం సజావుగా సాగేలా చుడాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు మరువరాదు..

– గుండు కరుణాకర్‌, ‌వరంగల్‌, 9866899046.

Leave a Reply