Take a fresh look at your lifestyle.

వ్యాక్సిన్‌తో కొరోనాను పూర్తిగా నిర్మూలించలేం

వైరస్‌ ‌ముప్పు ఇంకా తొలగలేదు
ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్

వ్యాక్సిన్‌ ‌త్వరలో అందుబాటులోకి రానున్నదన్న వార్తలు వొస్తున్న తరుణంలో కొరోనా ఐరాస తీవ్ర హెచ్చరిక చేసింది. వ్యాక్సిన్‌ ‌వొచ్చినా దాంతో తాత్కాలిక ఉపశమనమే తప్ప వైరస్‌ ‌మనతో శాశ్వతంగా ఉంటుందని తెలిపింది. కొరోనా ఇప్పటికే కోట్లాది మందికి సోకింది. కొరోనా మహమ్మారి వలన ఇప్పటికే లక్షలాది మంది మృతి చెందారు.

 

టీకా అందుబాటులోకి వొస్తే వైరస్‌కు అడ్డుకట్ట వెయ్యొచ్చని అంటున్నారని, అయితే టీకా అందుబాటులోకి వొచ్చినా మహమ్మారిని కట్టడి చేయడం కష్టమని, అలా భావించడం పిచ్చితనమే అవుతుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ ‌పేర్కొన్నారు. కొరోనా మహమ్మారి దశాబ్దాలపాటు కొనసాగుతుందని అన్నారు. శాస్త్రవేత్తలు నిబద్ధతతో పోరాటం చేస్తున్నారని అన్నారు. యూకే ప్రభుత్వం ఫైజర్‌ ‌టీకాకు అత్యవసర అనుమతి ఇచ్చిన తరువాత ఆంటోనియో ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం.

Leave a Reply