Take a fresh look at your lifestyle.

ఆదిలాబాద్‌లో విజృంభిస్తున్న కొరోనా

ఒక్కరోజే పదిమంది మృతి
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొరోనా విజృంభణ కొనసాగుతోంది. కొరోనాతో ఒక్కరోజే 10 మంది మృతి చెందారు. జిల్లా వ్యాప్తంగా 371 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. మంచిర్యాల జిల్లాలోనే అత్యధికంగా 292 కేసులు నమోదు అవగా… ఆరుగురు మృత్యువాతపడ్డారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో లాక్‌ ‌డౌన్‌ ‌నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తూ జరిమానా విధిస్తున్నారు. కొరోనా మహమ్మారి నియంత్రణలో భాగంగా పట్టాణాల్లో ప్రధాన కూడళ్ల వద్ద ఇన్స్‌పెక్టర్‌ ‌స్థాయి అధికారులు బందోబస్తు పరిశీలించారు.

కొరోనా కట్టడి కోసమే కఠిన నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రజలను ఇబ్బంది పెట్టడానికి కాదన్నారు. వాహనాలపై రోడ్ల పైకి వచ్చి ఇబ్బంది పడవద్దని అన్నారు.కొరోనా బారిన పడకుండా కుటుంబాలను కాపాడుకోవాలని కోరారు. ప్రజల సంతోషమే పోలీసులకు కావాల్సిందని స్పష్టం చేశారు. ఇప్పటికైనా ప్రజలు నిబంధనలు పాటించాలని, వాటిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వివరించారు. బయట తిరిగేటప్పుడు మాస్క్‌లు తప్పనిసరిగా ధరించి భౌతిక దూరం పాటించాలని అన్నారు.

Leave a Reply