Take a fresh look at your lifestyle.

మళ్లీ విజృంభిస్తున్న కొరోనా

  • అయిదు రాష్ట్రాల్లో మరోసారి లాక్‌ ‌డౌన్‌ ‌దిశగా పరిణామాలు
  • పెరుగుతున్న కేసులు.. అప్రమత్తం చేసిన కేంద్రం

ముంబై, ఫిబ్రవరి 21 : కొరోనా మహమ్మారి కలుగజేసిన నష్టం నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న దేశం మరోసారి లాక్‌డౌన్‌ ‌బాటపట్టక తప్పని దిశగా పరిణామాలు నెటకొంటున్నాయి. గడిచిన పదిరోజులుగా దేశ వ్యాప్తంగా కొత్తగా పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సిన్‌ ‌పంపిణీ పక్రియ వేగంగా జరుగుతుండగా పెరుగుతున్న పాజిటివ్‌ ‌కేసులు కలవరానికి గురిచేస్తున్నాయి. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌రాష్ట్రాల్లో కొరోనా కేసులు అకస్మాత్తుగా పెరగడం వైద్యశాఖ అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. ఒక్క మహారాష్ట్రలోనే శనివారం 6 వేలకుపైగా నమోదుకాగా, కేరళలో 4,820 పాజిటివ్‌ ‌కేసులు నిర్ధారణ కావడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తుంది. మధ్యప్రదేశ్‌, ‌పంజాబ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌లోనూ పాజిటివ్‌ ‌కేసులు విపరీతంగా పెరడటం ఆ రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఆందోళనకు గురిచేస్తున్నది. ఏడాది కాలంగా కొరోనా వల్ల ఏర్పడ్డ గడ్డు పరిస్ధితుల నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న సమయంలో మరోసారి వైరస్‌ ‌విజృంభిస్తే పరిస్థితి ఏంటన్నది అంతుపట్ట కుండా ఉంది.

ఈ పరిస్థితులలో వైరస్‌నును అరికట్టేందుకు మరోసారి లాక్‌డౌన్‌ ‌విధించక తప్పదేమోనని రాష్ట్ర ప్రభుత్వా లు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వారం రోజులుగా పూణెలో పాజిటివ్‌ ‌కేసులు సంఖ్య విపరీతంగా పెరుగుతుండడం, అక్కడ కొత్తగా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అవుతుండడంతో లాక్‌డౌన్‌ ‌విధించాలని నిర్ణయించింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూణె పరిధిలో  కర్ఫ్యూ  కొనసాగుతుందని స్థానిక అధికారులు తెలిపారు. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో పాఠశాలలు, కాలేజీలను సైతం మూసివేశారు. ఫిబ్రవరి 28 వరకు మూసివేడం జరుగుతుందని ఆ రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. అలాగే నాగపూర్‌, ‌యావత్‌మాల్‌, అమరావతి లోనూ రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని ప్రభుత్వం భావిస్తోం ది. కేరళ, మహారాష్ట్ర, పంజాబ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మధ్యప్రదేశ్‌ ‌ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. వైరస్‌ ‌వ్యాప్తి కొనసాగకుండా జాగ్రత్త చర్యలు పాటించాలని కేంద్ర ఆరోగ్యశాఖమంత్రి హర్షవర్ధన్‌ ‌శనివారం పలు సూచనలు చేశారు. ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించేలా ఆదేశాలు జారీచేయాలన్నారు.

మహారా ష్ట్రలో కొత్తగా 6,281 కోవిడ్‌ ‌కేసులు నమోదయినట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కొరోనా కేసుల సంఖ్య 20,93,913 కు చేరుకుంది. 27 శాతం ముంబై, అమరావతి మునిసిపల్‌ ‌కార్పొరేషన్‌ ‌ప్రాంతాల్లో నమోద య్యాయి. ఒక్కరోజే 2,567 మంది కోవిడ్‌ ‌నుంచి కోలుకున్నా రు. దీంతో కోలుకున్న వారి సంఖ్య 19,92,530కి పెరిగిం ది. కొత్తగా 40 కొరోనా మరణాలు సంభవించగా.. రాష్ట్రం లో మొత్తం కోవిడ్‌ ‌వల్ల మృతి చెందిన వారి సంఖ్య 51,753 కు చేరుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,56,52,742  కొరోనా టెస్టులు నిర్వహించారు. ప్రస్తుతం 48,439 క్రియా శీల కేసులు ఉన్నాయి. 24 గంటల్లో ఒక్క ముంబైలోనే కొత్తగా 897  పాజిటివ్‌ ‌కేసులు వెలుగు చూశాయి. థానేలో ఇప్పటివరకు 2,49,566 మంది కొరోనా బాధితులు కోలుకున్నారని జిల్లా వైద్యాధికారులు తెలిపారు. జిల్లాలో రికవరీ రేటు 96.11 శాతంగా ఉన్నట్లు వెల్లడించారు. థానేలో శనివారం 471 కొత్త పాజిటివ్‌ ‌కేసులు వెలుగుచూశా యని, మొత్తం కేసుల సంఖ్య 2,59,668కి చేరుకుందని జిల్లా వైద్యాధికారి తెలిపారు.

జిల్లాలో ఎనిమిది మంది కోవిడ్‌ ‌కారణంగా మరణించారని ప్రకటించారు. ఇప్పటివర కు మరణాల సంఖ్య 6,227కి చేరిందని తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 3,875 యాక్టీవ్‌ ‌కేసులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో మరణాల రేటు 2.40 గా ఉంది. పొరుగున ఉన్న పాల్ఘర్‌ ‌జిల్లాలో ఇప్పటివరకు 45,646 కరోనా కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ 1,202 ‌మంది మరణించినట్లు జిల్లా వైద్య అధికారులు తెలిపారు. ముంబై నగరంలో పెరుగుతున్న కొత్త కొరోనా కేసుల్లో భవనాల్లో నివసించే వారిలో ఎక్కువ నమోదవుతున్నాయని బీఎంసీ అధికారులు ప్రకటించారు. ఒకప్పుడు మురికివాడల్లో ఎక్కువ నమోదైన కేసులు ఇప్పుడు భవనాల్లో వెలుగుచూస్తున్నాయి. ఫిబ్రవరి ఒకటో తేదీన నగరంలో 328 కొత్త కేసుల్ని గుర్తించగా 18వ తేదీన 66 శాతం పెరుగుదలతో ఆ సంఖ్య 823కు చేరుకుంది. ఈ కొత్త కేసుల్లో 90 శాతం భవనాల్లో నివసించేవారే ఉన్నారని బీఎంసీ అదనపు కమిషనర్‌ ‌సురేశ్‌ ‌కాకాణీ వెల్లడించారు. ప్రజలు కోవిడ్‌ ‌నిబంధనలను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు.  

Leave a Reply