Take a fresh look at your lifestyle.

‌గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా విజృంభణ ..!

  • ప్రధాన మంత్రి మోడీ ఆందోళన
  • కొరోనా పై ఉన్నతస్థాయి సమీక్ష
  • వెంటిలేటర్ల పనితీరుపై ఆడిట్‌ ‌నిర్వహించాలని ఆదేశం

కేంద్రం పంపిణీ చేసిన వెంటిలేటర్లు లోపభూయిష్టంగా ఉన్నాయంటూ వస్తోన్న ఆరోపణలను ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణించారు. దానికి సంబంధించి వెంటనే ఆడిట్‌ ‌నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన దేశంలో నెలకొన్న కొవిడ్‌ ‌పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా వెంటిలేటర్ల అంశం చర్చకు వచ్చింది. ’వెంటిలేటర్ల పనితీరుపై పలు రాష్ట్రాల నుంచి వస్తోన్న ఆరోపణలను ప్రధాని తీవ్రంగా పరిగణించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న ఈ వెంటిలేటర్లపై తక్షణమే ఆడిట్‌ ‌నిర్వహించాలని ఆదేశించారు. అలాగే సరిగా పనిచేస్తోన్న వెంటిలేటర్ల విషయంలో అవసరమైతే ఆరోగ్య కార్యకర్తలకు కొత్తగా శిక్షణ ఇవ్వాలని సూచించారు’ అంటూ కేందప్రభుత్వ ప్రకటన వెల్లడించింది.

దాంతో పాటు కొరోనా పాజిటివిటీ రేటు అధికంగా ఉన్న ప్రాంతాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని మోదీ ఈ సమావేశంలో సూచించారు. స్థానిక కంటైన్‌మెంట్‌ ‌జోన్ల ఆవశ్యతకను ప్రధానంగా ప్రస్తావించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహించేలా, ఆక్సిజన్‌ ‌కొరత లేకుండా చూసేలా వనరులను పెంచాలని ఆయన అధికారులను ఆదేశించారు. పీఎం కేర్స్ ‌నిధులతో పలు రాష్టాల్రకు కేంద్రం వెంటిలేటర్లను సరఫరా చేసింది. అయితే రాజస్థాన్‌, ‌పంజాబ్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌మహారాష్ట్ర వంటి రాష్టరాల్లో ఆ వెంటిలేటర్లలో సమస్య తలెత్తినట్లు వార్తా కథనాలు వెల్లడించాయి. ఈ వ్యవహారంపై రాజస్థాన్‌ ‌ముఖ్యమంత్రి అశోక్‌ ‌గహ్లోత్‌ ‌ట్విటర్‌లో పేర్కొన్నారు. వాటి సేకరణపై కేంద్ర ఆరోగ్య శాఖ వెంటనే దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్‌ ‌చేశారు. కొరోనా ఫస్ట్ ‌వేవ్‌ ‌లో పట్టణాల్లోనే ఎక్కువగా కేసులు నమోదయ్యేవి. కానీ ఈ సెకండ్‌ ‌వేవ్‌ ‌లో పట్టణాలతో పాటు గ్రామాల్ని కూడా కబళించేస్తోంది కొరోనా మహ్మారి. ఈ క్రమంలో కొరోనా కట్టడిపై ప్రధాని మోదీ అత్యున్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.

గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా విజృంభిస్తోందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో కోవిడ్‌-19 ‌పరిస్థితిపై ప్రధాని మోదీ శనివారం అత్యున్నతస్థాయి సమావేశం సందర్భంగా ప్రధాని గ్రామీణ ప్రాంతాల్లో కొరోనా నిర్దారణ పెంచాలని..గ్రామాల్లో ఆక్సిజన్‌ ‌సరఫరా అవసరానికి తగినట్లుగా పెంచాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో డోర్‌ ‌టూ డోర్‌ ‌సర్వే నిర్వహించాలని సూచించారు. కొరోనా కట్టడికి ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ వర్కర్ల సేవలను ఉపయోగించు కోవాలనీ..కొరోనా కట్టడిలో భాగంగా వ్యాక్సినేషన్‌ ‌పక్రియ వేగాన్ని పెంచాలన్నారు. రాష్ట్ర, జిల్లాస్థాయిలో కొరోనా పరిస్థితి, టెస్టులు, ఆక్సిజన్‌ ‌లభ్యత, ఆరోగ్యసంరక్షణ కోసం తీసుకోవాల్సిన మౌలికసదుపాయాలు, టీకా రోడ్‌మ్యాప్‌పై అధికారులు ప్రధానికి సూచనలిచ్చారు.

పాజిటివిటీ రేటు ఎక్కువున్నచోట టెస్టింగ్‌ ‌మరింత పెంచాలని ఆయా రాష్టాల్రకు సూచించారు. ఎక్కడికక్కడ కంటైన్మెంట్‌ ‌వ్యూహాలే ఇప్పుడు చాలా అవసరమన్నారు. మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పెంచాలనీ..గ్రామీణ ప్రాంతాల్లో ఆక్సిజన్‌ ‌సరఫరా సరిగా జరిగేలా చూడాలని..వెంటిలేటర్ల నిర్వహణ, తదితర పరికరాల వినియోగంలో సిబ్బందికి తగినవిధంగా శిక్షణ ఇచ్చి ప్రాణాలు పోకుండా కావాలని..సమీక్షలో అధికారులను ప్రధాని మోడీ ఆదేశించారు.

Leave a Reply