Take a fresh look at your lifestyle.

ఉమ్మడి ఖమ్మంలో కొరోనా విజృంభణ

“వివిధ ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరుద్యోగులు, తమ ఉద్యోగాలు కోల్పోవడంతో మోయలేని ఆర్ధికభారంతో మనోవేదనకు గురవుతున్నారు. తొలినాళ్ళలో సేఫ్‌గా ఉన్నామంటూ కొండత ధైర్యంతో ఉన్న జిల్లా వాసుల్లో కొరోనా విజృంభణ కంటి మీద కునుకు లేకుండా  చేసింది. లాక్‌ ‌డౌన్‌ ‌కఠిన నిబంధనలు పాంటించిన జనం అన్‌లాక్‌లో నిబంధ•నలకు త్రిలోదకాల్విడంతో పాజీటివ్‌ ‌కేసులు పెరగడంతో వైధ్యాధికారులు చేతులేత్తిసిన దుస్థితి నెలకొంది. మహమ్మారీ విజృంభణ నేపథ్యంలో చదువులు ముందుకు సాగే సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. తుమ్మినా, దగ్గిన, జ్వరం వచ్చినా కొరోనా అనే అనుమానం నిరంతరం ప్రజలను వెంటాడుతుంది. ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు ప్రజలను కొరోనా భయం నుంచి భయటపడడానికి భరోసా నిచ్చి తామూన్నామంటూ చెప్పలేని నిస్సహయక స్ధితిలో ఉన్నారు. తాము ఎన్నుకున్న పాలకలు మొండిచెయ్యి చూపడం…జిల్లా ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తుంది.”

  • పట్నం నుంచి పల్లెలకు ప్రయాణంతో వైరస్‌ ‌వ్యాప్తి
  • కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో నిర్వహణ లోపం ప్రజా జీవనం కకావికలం

ప్రపంచాన్ని ఆతలాకుతలం చేస్తున్న కొరోనా మహమ్మారీ విజృంభణ ఉమ్మడి ఖమ్మం జిల్లా జీవనాన్ని కకావికలం చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అధికారికంగా అధికారులు హెల్త్ ‌బులిటిన్‌ ‌విడుదల చేయని పరిస్థితి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అధికారికంగా 867 పాజిటివ్‌ ‌కేసులు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. వీటిలో 154 మంది కోలుకోగా 683 యాక్టివ్‌ ‌కేసులుకాగా 30 మంది మరణించినట్లు తెలుస్తుంది. వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం మార్చి 22 నుంచి లాక్‌ ‌డౌన్‌ ‌పేరుతో అన్ని దారులు మూసివేయడంతో ప్రజలు మూడు నెలలపాటు ఇంటికే పరిమితమాయ్యరు. ఆ తరువాత అన్‌లాక్‌లో ఆర్థిక కార్యకలపాలు వేగిర పరచడానికి ప్రైవేటు వ్యాపార సంస్థలు, , ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకున్నా ఇంకా నస్టాలో ఉన్నాయి. వివిధ ప్రైవేటు సంస్థల్లో పని చేసే చిరుద్యోగులు, తమ ఉద్యోగాలు కోల్పోవడంతో మోయలేని ఆర్ధికభారంతో మనోవేదనకు గురవుతున్నారు. తొలినాళ్ళలో సేఫ్‌గా ఉన్నామంటూ కొండత ధైర్యంతో ఉన్న జిల్లా వాసుల్లో కొరోనా విజృంభణ కంటి మీద కునుకు లేకుండా చేసింది. లాక్‌ ‌డౌన్‌ ‌కఠిన నిబంధనలు పాంటించిన జనం అన్‌లాక్‌లో నిబంధ•నలకు త్రిలోదకాల్విడంతో పాజీటివ్‌ ‌కేసులు పెరగడంతో వైధ్యాధికారులు చేతులేత్తిసిన దుస్థితి నెలకొంది. మహమ్మారీ విజృంభణ నేపథ్యంలో చదువులు ముందుకు సాగే సూచనలు కనుచూపు మేరలో కనిపించడంలేదు. తుమ్మినా, దగ్గిన, జ్వరం వచ్చినా కొరోనా అనే అనుమానం నిరంతరం ప్రజలను వెంటాడుతుంది.

ప్రభుత్వ అధికారులు, వైద్యాధికారులు ప్రజలను కొరోనా భయం నుంచి భయటపడడానికి భరోసా నిచ్చి తామూన్నామంటూ చెప్పలేని నిస్సహయక స్ధితిలో ఉన్నారు. తాము ఎన్నుకున్న పాలకలు మొండిచెయ్యి చూపడం…జిల్లా ప్రజలను భయభ్రాతులకు గురి చేస్తుంది. వైరస్‌ ‌విజృంభణ నేపథ్యంలో పట్టణాల్లో తాము చేస్తున్న కొలువులను వదిలి ప్రజలంతా కుటుంబ సభ్యులతో సొంత ఊరి దారి పట్టారు. కొరోనా పాజిటివ్‌ ‌మరణాలు రోజురోజుకు పెరుగుతుండడంతో ఖననం చేయడానికి స్మశానాలలో సైతం అనుమతుల్విడంలేదు. ఇటివల ఖమ్మం జిల్లాలో ఒక గ్రామంలో కొరోనా పాజిటివ్‌తో వ్యక్తి మరణించాడు. ఆ వ్యక్తి మృతదేహన్ని కడచూపుకోసం గ్రామంలోకి తీసుకోచ్చేందుకు బంధువులు ప్రయత్నించడంతో గ్రామస్థులు అడ్డుకున్నారు. గ్రామ సరిహద్దు చుట్టు ముళ్ళ కంచవేసి అడ్డుకున్న పరిస్థితి నెలకొంది. ఇలాంటి సన్నివేశాలు జిల్లాలో సర్వ సాధారణమయ్యాయి. కొరోనా మృతులకు ప్రత్యేక స్మశానాలు లేకపోవడంతో మృతదేహలను ఎక్క డో ఒకచోట గుంటతీసి, ఖననం చేయడం సర్వసాధారణం కావడంతో మృతుల కుంటుంబ సభ్యులను మరింత దుక్క సాగరంలో ముంచెత్తుతున్నాయి. తమ వారి కడసారి చూపును నోచుకోకపోవడం బంధువులను గుండెలు అవిసేలా చేస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొరోనా మరణమృదంగం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తుంది. మార్చి 14 న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అశ్వాపురంలో తొలికేసు నమోదు కాగా ఎఫ్రిల్‌ 6 ‌ఖమ్మంలో తొలి కేసు నమోదైంది. లాక్‌డౌన్‌లో కొరోనా వ్యాప్తి చెందడంతో ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం వచ్చింది. మహమ్మారీని కట్టడి చేసేందుకు ప్రజలందరూ ప్రభుత్వ నిబంధనలు పాటించారు. కానీ అన్‌లాక్‌లో ప్రజలు నిబంధనలు ఖాతరు చేయడంలేదు. ఖమ్మంలో ఏఫ్రిల్‌ 6‌వరకు కేసులు నమోదు కాకపోవడంతో ప్రజలందరూ ఊపిరీపిల్చుకున్నారు. కానీ తర్వాత పరిణామాలతో వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందింది.

పట్నం నుంచి పల్లెలకు….
లాక్‌ ‌డౌన్‌ ‌ముగిసిన తర్వాత జనం కాస్త ఊపిరిపీల్చుకుంది. అయితే హైదరాబాద్‌లో కొరోనా కేసులు భారీగా పెరిగిన నేపథ్యంలో మళ్ళీ లాక్‌ ‌డౌన్‌ ఉం‌టుందనే ప్రచారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఊపందుకుంది. దీంతో పోట్టకూటీకోసం పల్లెలనుంచి పట్నం బాటపట్టిన పేద, మధ్య తరగతి వర్గాల ప్రజలు, చదువుల కోసం వెళ్ళిన వారు పట్నం నుంచి పల్లెల బాట పట్టారు. అప్పటి వరకు నగరాలకు పరిమితమైన కొరోనా వైరస్‌ ‌పల్లెలకు వ్యాప్తి చెందింది. హైదరాబాద్‌ ‌నుండి వందలాది మంది పల్లె)కు రావడంతో గ్రామాల్లో సైతం కేసులు పెరిగాయి. పల్లెల్లో కేసులు అధికంగా నమోదు కావడంతో బయట వ్యక్తులను ఆయా గ్రామాల ప్రజలు తమ గ్రామాలలోకి అనుమతించలేదు. ఒకనోక దశలో కొత్త వ్యక్తులకు తమ గ్రామంలోకి అనుమతి లేదంటూ శివారుల్లో బోర్డులు సైతం ఏర్పాటు చేశారు.

కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్లలో నాడు…నేడు
జిల్లాలో కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్ల నిర్వహణపై భిన్నాభిపాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలిరోజుల్లో కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌లో సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని నేడు నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తొలి రోజుల్లో కేర్‌ ‌సెంటర్‌లో మంచి సౌకర్యాలు, పౌషికాహరం అందించేవారని నేడు నాణ్యత లోపించిందనే వాదనలున్నాయి. వారంలో ఒక రోజు నాన్‌ ‌వెజ్‌, ‌ప్రతి రోజు గుడ్డు, ఇచ్చేవారు. ఉదయం టిఫిన్‌లోకి పులిహోర,మధ్యాహ్నం కోడికూర బగారా రైస్‌ ..‌సాయంత్రం పల్లీ చెక్క,బిస్కెట్‌,‌చాయ్‌ ఇచ్చి ఇంటిని మరపించేలా చూసుకునేవారు. వీటికి తోడు వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు పప్పు, ఆకుకూరలు, కూరగాయల భోజనం వడ్డించారు. కానీ ప్రస్తుతం నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండడంతో కేంద్రంలో ఉండేందుకు భయపడిపోతున్నారు. ఇటివల కొరోనా పాజిటివ్‌ ‌వచ్చిన ఓ సామాజిక కార్యకర్త కోవిడ్‌ ‌కేర్‌ ‌సెంటర్‌ ‌నిర్వహణ చూసి బెంబేలేత్తిపోయారు. తాను ఇక్కడ ఉండలేనని తనను భయటకు పంపాలని సాక్ష్యత్తు జిల్లా కలెక్టర్‌ను వేడుకున్నారు. దీంతో ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. కేంద్రాల నిర్వహణ లోపంతో కొరోనా పాజిటివ్‌ ‌వ్యక్తులలో వైద్య సేవలపై అభద్రతాభవం ఏర్పడింది.

స్వచ్చందంగా బంద్‌…
‌కొరోనా మహమ్మారీ శర వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కట్టడికి ప్రజలతో పాటు వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. లాక్‌ ‌డౌన్‌ ‌సమయంలో ప్రభుత్వం విధించిన నింబంధనలు పాటిస్తూ ..ప్రభుత్వ ఆంక్షలకు అనుగుణంగా వ్యాపారాలు సాగించారు. తాజాగా మహమ్మారీ మళ్ళీ విజృంభిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వ్యాపార వర్గాలు స్వచ్ఛంద బంద్‌కు నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం నగరంతో పాటు, వైరా, కొత్తగూడెం, భద్రాచలం, మధిర, పాల్వంచ తదితర ప్రాంతాల్లో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పలు వర్గాల వ్యాపారులు బంద్‌ ‌పాటిస్తూ సమాజ సేవలో తాము సైతం అంటూ పాలుపంచుకుంటున్నారు.

సామాజిక వ్యాప్తి భయం…
కొరోనా మహమ్మారీ శర వేగంగా వ్యాప్తి చెందుతుంది. వైరస్‌ ‌సామాజిక వ్యాప్తి చెందుతుందనే ప్రకటనతో ప్రజల్లో తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఫలానా లక్షణాలతో కొరోనా ఉందనే స్పష్టత లేకపోవడంతో తుమ్మినా, దగ్గినా, జ్వరం వచ్చినా.. కొరోనా వచ్చిందనే భయంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రజలు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో పాటు శానిటైజేషన్‌ ‌చేసుకోకపోవడంతో కొరోనా వ్యాప్తి చెందుతుంది. ప్రజలను అధికారులు చైతన్యం చేయకపోవడంతో పాటు నిబంధనలు కఠినంగా అమలు చేయకపోవడం వ్యాప్తికి ప్రధాన కారణం అంటున్నారు వైద్యులు.

Leave a Reply