- ఒక్కరోజులోనే పదివేలు దాటిన పాజిటివ్ కేసులు
- బ్రిటన్ను దాటి నాలుగోస్థానంలోకి భారత్
- కెనాడాను దాటేసిన మహారాష్ట్ర
భారత్‌లో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. తాజాగా కరోనా వైరస్ ప్రభావం తీవ్రంగా ఉన్న
దేశాల్లో భారత్ బ్రిటన్ను దాటి నాలుగోస్థానంలో నిలిచింది. భారత్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజూకు పెరుగుతున్నది. వైరస్ విజృంభిస్తున్న తీరు.. తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. గత 24 గంటల్లో దేశంలో నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య పది వేలు దాటింది. ఒక్క రోజే 10956 కేసులు రికార్డు అయ్యాయి. ఒకే రోజులో పదివేల మార్క్‌ను దాటడం దేశంలో ఇదే మొదటిసారి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ వల్ల 396 మంది మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది. శుక్రవారం రోజున కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 10,956 కేసులు నమోదు కాగా.. 396 మంది మృతి చెందారు. మొత్తంగా 2,97,535 కేసులు, 8,498 మరణాలతో నాలుగో స్థానానికి చేరుకుంది.

కాగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 1,41,842 యాక్టివ్ కేసులు ఉండగా.. కరోనా మహమ్మారి నుంచి కోలుకొని 1,47,195 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో కరోనా రికవరీ రేటు 49 శాతానికి చేరుకుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 53,63,445 కరోనా టెస్టులు నిర్వహించగా.. గడిచిన 24 గంటల్లో 1,50,305 టెస్టులు నిర్వహించారు. దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. ఇప్పటిదాకా మహారాష్ట్రలో అత్యధికంగా 97,648 కేసులు నమోదవ్వగా.. 3,590 మంది మృతి చెందారు. తమిళనాడులో 38,716 కేసులు నమోదవ్వగా.. 349 మంది మృతి చెందారు. ఢిల్లీలో 34,687 కేసులు నమోదవ్వగా.. 1,085 మంది మృతి చెందారు. గుజరాత్లో 22,032 కేసులు నమోదవ్వగా 1,385 మంది మృతి చెందినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను వెల్లడించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదు అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఒక్క రోజే 3607 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 152 మంది మరణించారు. ఓవరాల్‌గా మహారాష్ట్రలో 97648 కోవిడ్19 కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రం పాజిటివ్ కేసుల విషయంలో కెనడాను దాటేసింది. మహారాష్ట్రలో 46078 మంది కోలుకున్నారు. ఒక్క ముంబైలోనే 54085 కేసులు ఉన్నాయి. ఆ సిటీలో ఇప్పటి వరకు 1954 మంది మరణించారు.ఇకపోతే దేశంలోని 13రాష్టాల్లోన్రి 69 జిల్లాల్లో కరోనా మరణ మృదంగం మోగిస్తున్నది. జాతీయ సగటు మరణాల రేటు 2.9 శాతంగా ఉండగా ఈ జిల్లాల్లో 5 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా ఉన్నది. మే 18 నుంచి ఈ 69 జిల్లాల్లో కరోనా మరణాల సంఖ్య బాగా పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. మే 18 నుంచి జూన్ 10 వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 1,00,800 నుంచి 2,87,155కి పెరిగాయి. అదే సందర్భంలో మరణాల సంఖ్య 3,156 నుంచి 8,108కి చేరింది. ఇందులో 82 శాతం కరోనా మరణాలు ఐదు రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌లోనే ఎక్కువగా నమోదైనట్లు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. మధ్యప్రదేశ్‌లో 21 జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లో 11, మహారాష్ట్రలో 10, గుజరాత్లో 9, రాజస్థాన్‌లో 5, తెలంగాణలో 3, హిమాచల్ ప్రదేశ్, పశ్చిమబెంగాల్, ఢిల్లీలో రెండు చొప్పున, హర్యానా, కర్ణాటక, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో ఒక్కో జిల్లాలో 5 శాతం లేదా అంతకన్నా ఎక్కువగా మరణాల రేటు ఉన్నది.