Take a fresh look at your lifestyle.

ఢిల్లీలో కొరోనా విజృంభణ

ఆందోళనకరంగా పాజిటివ్‌ ‌కేసులు
ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌పరీక్షలకు ఐసిఎంఆర్‌ అనుమతి

ఢిల్లీలో భారీ స్థాయి కొరోనా పరీక్షలు చేపడుతున్నారు.  దేశ రాజధానిలో వైరస్‌ ‌విజృంభిస్తున్న నేపథ్యంలో..  ఐసీఎంఆర్‌ ‌సహకారంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సిరోలాజికల్‌ ‌సర్వే చేపడుతున్నాయి.   27వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ సర్వే జరగనున్నది. నేషనల్‌ ‌సెంటర్‌ ‌ఫర్‌ ‌డిసీజ్‌ ‌కంట్రోల్‌(ఎన్‌సీడీసీ) సంస్థ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి సహకరిస్తున్నది. ఢిల్లీలో యాంటిజెన్‌ ఆధారిత ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌పరీక్షలను చేపట్టనున్నట్లు ఐసీఎంఆర్‌ ‌వెల్లడించింది. దీని కోసం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి 50వేల యాంటిజెన్‌ ‌ర్యాపిడ్‌ ‌టెస్ట్ ‌కిట్స్ ‌సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ ‌పేర్కొన్నది. ఉచితంగా ఈ కిట్లను ఢిల్లీ ప్రభుత్వానికి అందజేసినట్లు ఐసీఎంఆర్‌ ‌వెల్లడించింది.  కేంద్ర ప్రభుత్వం కూడా ఢిల్లీ సిరోలాజికల్‌ ‌పరీక్షలకు తమ వంత సహకారం అందించింది.  దీని కోసం 1.57 లక్షల ఆర్‌ఎన్‌ఏ ‌కిట్లను అందజేసింది. వీటితో పాటు 2.84 లక్షల వైరల్‌ ‌ట్రాన్స్‌పోర్ట్ ‌డియం(వీటీఎం)లను అందజేసింది. స్వాబ్‌ ‌శ్యాంపిళ్ల సేకరణ కోసం వీటిని వినియోగిస్తారు. ఢిల్లీలో నిర్వహించే పరీక్షల కోసం డయాగ్నస్టిక్‌ ‌మెటీరియల్‌ను కూడా ఐసీఎంఆర్‌ ‌సరఫరా చేస్తున్నది. ఢిల్లీలో మొత్తం 12 ల్యాబ్‌లు ఇప్పటి వరకు 4.7 లక్షల ఆర్‌టీ పీసీఆర్‌ ‌పరీక్షలు చేపట్టాయి. ఆ ల్యాబ్‌లకు డయాగ్నస్టిక్‌ ‌మెటీరియల్‌ను తామే సరఫరా చేసినట్లు ఐసీఎంఆర్‌ ‌చెప్పింది.
డిఎంకె ఎమ్మెల్యేకు కరోనా
తమిళనాడులో కరోనా విజృంభిస్తుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఆ రాష్ట్రంలో మహమ్మారి బారినపడుతున్న ప్రజాప్రతినిధుల సంఖ్య పెరుగుతున్నది. తాజాగా చెంగల్పేట్‌ ‌జిల్లా చెయ్యూర్‌ ‌నియోజకవర్గ డీఎంకే ఎమ్మెల్యే ఆర్‌ ‌టీ అరసు కరోనా బారినపడ్డారు. కరోనా పరీక్ష కోసం శాంపిల్స్ ఇచ్చిన అరసు..కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయినట్లు శనివారం ఉదయం తేలింది. చికిత్స కోసం చెన్నైలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. అరసు కుటుంబ సభ్యులు కూడా కరోనా టెస్టు కోసం శాంపిల్స్ ఇచ్చారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. డీఎంకేలో కరోనా బారినపడిన మూడో ఎమ్మెల్యే అరసే. ఇప్పటికే కరోనా మహమ్మారి వల్ల డీఎంకే ఎమ్మెల్యే అన్బళగన్‌ ‌మృతిచెందిన విషయం తెలిసిందే. మరో ఎమ్మెల్యే కే.కార్తికేయన్‌కు కూడా కరోనా సోకింది. తమిళనాడులో శుక్రవారం ఒక్కరోజే 3,645 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.
కరోనా కేసులతో ప్రజల్లో మానసిక ఆందోళన
దేశవ్యాప్తంగా కోవిడ్‌19 ‌కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు ఎక్కువైనట్లు మానసిక నిపుణులు అంచనా వేస్తున్నారు.  దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నట్లు తెలిపారు. వైరస్‌ ‌పరీక్షలో పాజిటివ్‌గా తేలిన వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతున్నారు. పాజిటివ్‌ ‌వ్యక్తులు డిప్రెషనల్‌కు గురవుతున్నట్లు నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.  కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలు కూడా చోటుచేసుకుంటున్నట్లు వారు వెల్లడించారు. శరీరం బలహీనంగా మారడం,  వ్యాధి సంక్రమిస్తుందన్న భయం, ఆందోళనకర దాడులు,  విభిన్నమైన ప్రవర్తన, నిద్రలేమి, తీవ్ర ఆందోళనలు, నిస్సహాయంగా ఫీలవడం లాంటి లక్షణాలతో జనం సతమతం అవుతున్నట్లు మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం వల్ల కూడా డిప్రెషన్‌, ‌చికాగు లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉద్యోగాలు కోల్పోవడం, ఆర్థిక ఇబ్బందులు,  భవిష్యత్తుపై అనిశ్చితి, ఆహార నిల్వలు తగ్గిపోవడం వంటి సంఘటనల వల్ల కూడా ప్రజలు మానసిక ఆందోళనలకు గురి అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!