Take a fresh look at your lifestyle.

అ‌ప్రమత్తంగా ఉండకుంటే ముప్పు తప్పదు

  • యూరోపియన్‌ ‌దేశాల్లో మళ్లీ కొరోనా విజృంభణ
  • వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు అంచనా
  • హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్‌ ‌టెడ్రోస్‌

యూరోపియన్‌ ‌దేశాల్లో రోజురోజుకీ కొరోనా మహమ్మారి మళ్లీ కల్లోలం సృష్టిస్తుంది. రోజువారీ కొత్త కేసుల నమోదు, మృతుల సంఖ్య భారీగా ఉండడంతో..ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి కొరోనా రెండేళ్ల కావస్తున్నా ఇంకా అదుపులోకి రాలేదు. కొన్ని దేశాల్లో తగ్గుముఖం పడుతున్నా యూరోప్‌ ‌దేశాల్లో మాత్రం రోజుకో సరికొత్త రూపం సంతరించుకుంటూ విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో యూరోప్‌లో గత వారంలో 11 శాతం కేసులు పెరిగినట్లు ప్రకటించింది. అంతేకాదు..వొచ్చే వసంత కాలం నాటికి ఐరోపాలో 7,00,000 వరకూ కోవిడ్‌ ‌మరణాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. అక్టోబర్‌ ‌మధ్య కాలం నుంచి ఈ పెరుగుదల కొనసాగుతుందని చెప్పారు. తక్షణ చర్యలు తీసుకోవాలని..యూరోప్‌ ‌లోని దేశాలన్నిటిలో వ్యాక్సినేషన్‌ ‌కార్యక్రమం వేగం పెంచాలని సూచించారు. అంతేకాదు ప్రజలు, ప్రభుత్వం తప్పనిసరిగా కొరోనా నియంత్రణ కోసం నిబంధనలు పాటించాలని..మాస్కులు అందరూ పెట్టుకోవాలని.. భౌతిక దూరం పాటించాలని చెప్పారు.

ఇప్పటికే యూరోపియన్‌ ‌దేశాల్లో అనేక ప్రాంతంలో 1 బిలియన్‌కు పైగా టీకా డోసులు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. అయితే కొరోనా ముగిసి పోయిందని, టీకా తీసుకున్నవారికి వైరస్‌ ‌సోకదని భావిస్తున్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిందేనని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ ‌జనరల్‌ ‌డాక్టర్‌ ‌టెడ్రోస్‌ అధనామ్‌ ‌ఘెబ్రేయేసస్‌ అన్నారు. తాజాగా మళ్లీ ఐరోపా దేశాలన్నింటిలో కోవిడ్‌ -19 ‌కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. టీకాతో సంబంధం లేకుండా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరారు. టీకాలు తీవ్రమైన వ్యాధి, మరణాల ప్రమాదాన్ని మాత్రమే తగ్గిస్తాయని టెడ్రోస్‌ ‌పేర్కొన్నారు. టీకాలు వేసినప్పటికీ జాగ్రత్తలు తీసుకోవడం కొనసాగించాలని చెప్పారు. మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం, గుంపులుగా ఉండకపోవడం, అవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్ల లోపల బాగా వెంటిలేషన్‌ ఉం‌చుకోవాలని టెడ్రోస్‌ ‌చెప్పారు. టీకా తీసుకోవడం వల్ల కోవిడ్‌-19 ‌మహమ్మారిని రాదనే తప్పుడు భావననుంచి ప్రజలు బయటపడాలన్నారు. ప్రజల్లో ఈ రకమైన భావనే తమకు ఆందోళన కలిగిస్తుందని అన్నారు.

దక్షిణాఫ్రికా, బోట్స్వానాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కోవిడ్‌ -19 ‌వేరియంట్‌ ‌గురించి చర్చించడానికి డబ్ల్యుహెచ్‌ఓ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. అంతకుముందు, బోట్స్వానాలో 32 వేరియంట్లు ఉన్న కొరోనా వైరస్‌ ‌జాతి కనిపించడంపై శాస్త్రవేత్తలు హెచ్చరించారని మీడియా నివేదికలు తెలిపాయి. అన్ని ఇతర వేరియంట్‌ల కంటే స్ట్రెయిన్‌ ‌స్పైక్‌ ‌ప్రోటీన్‌లో ఎక్కువ మార్పులను కలిగి ఉందని రష్యన్‌ ‌వార్తా సంస్థ నివేదించింది. దక్షిణాఫ్రికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫెక్షియస్‌ ‌డిసీజెస్‌ ‌కూడా దక్షిణాఫ్రికాలో కొత్త జాతి కనుగొన్నట్లు ధృవీకరించింది. విదేశాల్లో కొరోనా కేసులు పెరుగుతుండడంతో భారత్‌ అ‌ప్రమత్తమైంది. యూరోప్‌, ఆ‌ఫ్రికా దేశాల నుండి వొచ్చే ఫ్లైయ్యర్లను కఠినమైన స్క్రీనింగ్‌, ‌టెస్టింగ్‌ ‌చేయాలని నిర్ణయించింది. దీనిక సంబంధించిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్‌ ‌భూషణ్‌ ‌లేఖ రాశారు.

Leave a Reply