Take a fresh look at your lifestyle.

దేశవ్యాప్తంగా కొరోనా విజృంభణ

  • 4 లక్షలకు పైగా కేసులు నమోదు
  •  3,915 మంది మృతి
  • గుర్తింపు కార్డులు లేని వారికి వ్యాక్సినేషన్‌

దేశవ్యాప్తంగా కొరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు 4 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజాగా హెల్త్ ‌బులిటెన్‌ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. దేశంలో కొత్తగా 4,14,188 కొరోనా కేసులు నమోదయ్యాయి. కొరోనా కారణంగా 3,915 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం 2.14 కోట్ల కొరోనా కేసులు నమోదవగా.. 2.34 లక్షల మంది ఇప్పటి వరకూ కొరోనాతో మృతి చెందారు. దేశంలో ప్రస్తుతం 36.45 లక్షల యాక్టివ్‌ ‌కేసులున్నాయి. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 81.95% ఉండగా.. మరణాల రేటు 1.09%గా ఉంది.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 16.49 కోట్ల మందికి  టీకాలు వేసినట్టు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇదిలావుంటే ఫొటో గుర్తింపు కార్డులు లేనివారికి కోవిడ్‌-19 ‌వ్యాక్సినేషన్‌ ‌చేసేందుకు మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. ఇటువంటివారి పేర్లను కోవిన్‌ ‌సాప్ట్‌వేర్‌లో నమోదు చేసే బాధ్యతను జిల్లా టాస్క్‌ఫోర్స్‌లకు అప్పగించింది. జైలు అధికారులు, వృద్దాశ్రమాల ప్రతినిధులు వంటివారు ప్రధాన ఫెసిలిటేటర్‌గా వ్యవహరిస్తూ బిచ్చగాళ్ళకు, జైలులో నిర్బంధంలో ఉన్నవారికి వ్యాక్సినేషన్‌ ‌చేయించవచ్చునని తెలిపింది. ఫొటో గుర్తింపు కార్డులు లేకుండానే వ్యాక్సినేషన్‌ ‌చేయించేందుకు కొన్ని వర్గాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది.

వివిధ మతాలకు చెందిన సాధువులు, జైలులో నిర్బంధంలో ఉన్నవారు, మానసిక చికిత్సాలయాల్లో చికిత్స పొందుతున్నవారు, వృద్దాశ్రమాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, బిచ్చగాళ్లు, పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నవారు, ప్రభుత్వం నిర్దేశిరచిన ఏడు ఫొటో ఐడీ కార్డుల్లో కనీసం ఒకటి అయినా లేని ఇతరులకు ఈ విధానంలో వ్యాక్సినేషన్‌ ‌చేస్తారు.

Leave a Reply