Take a fresh look at your lifestyle.

ఐపిఎల్‌ ‌కి కొరోనా దెబ్బ

  • క్రీడాకారులకు  పాజిటివ్‌
  • సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు శుక్లా ప్రకటన

క్రికెట్‌ ‌ప్రేమికులకు కావాల్సినంత వినోదాన్ని అందిస్తున్న ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌ ఐపీఎల్‌ ‌కొరోనా దెబ్బకు బలైంది. పలు ఫ్రాంచైజీలకు చెందిన ఆటగాళ్లకు కొరోనా సోకడంతో బీసీసీఐ అప్రమత్తమైంది. ఇంతటితో ఈ సీజన్‌ను ఆపెయ్యాలని నిర్ణయించుకుంది. ఐపీఎల్‌-14‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్టు బీసీసీఐ వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌రాజీవ్‌ ‌శుక్లా ప్రకటించారు. ఇంకా ఈ సీజన్‌లో 30కి పైగా మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. గ్లోబల్‌ ‌క్రికెట్‌ ‌క్యాలెండర్‌, ‌కోవిడ్‌ ‌పరిస్థితిని బట్టి ఈ మ్యాచ్‌లను రీ షెడ్యూల చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జరగనున్న టీ-20 ప్రపంచకప్‌ ‌తర్వాత ఐపీఎల్‌-14 ‌మిగతా భాగాన్ని నిర్వహించాలనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే పలు ఫ్రాంఛైజీలకు చెందిన ఆటగాళ్లు, కోచింగ్‌ ‌సిబ్బంది కొరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా సన్‌రైజర్స్ ‌హైదరాబాద్‌కు చెందిన ఆటగాడు వృద్ధిమాన్‌ ‌సాహా కూడా కొరోనా బారిన పడ్డాడు.  దేశంలో కోవిడ్‌ ‌సెకండ్‌వేవ్‌ ‌విజృంభణ నేపథ్యంలో భారత క్రికెట్‌ ‌నియంత్రణ మండలి ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఆటగాళ్లు వరుసగా కొరోనా బారిన పడుతుండటంతో ఐపీఎల్‌-2021 ‌సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ ‌శుక్లా మంగళవారం ప్రకటన విడుదల చేశారు. కాగా వేర్వేరు జట్లలో ఇప్పటికే 9 మంది ఆటగాళ్లకు కోవిడ్‌-19 ‌సోకింది. బయో బబుల్‌లో ఉన్నప్పటికీ క్రికెటర్లు, ఇతర సిబ్బందికి కొరోనా పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో తొలుత టోర్నీని నిరవధికంగా వాయిదా వేయాలని భావించిన బీసీసీఐ.. 31 మ్యాచ్‌లు మిగిలి ఉండగానే ఈ సీజన్‌ను రద్దు చేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది.

బిసిసిఐకి ఫైన్‌ ‌వేయండి
బాంబే హైకోర్టులో పిటిషన్‌ ‌దాఖలు  దేశంలో కొరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ఇండియన్‌ ‌ప్రీమియర్‌ ‌లీగ్‌(ఐపీఎల్‌)‌ను నిర్వహించిన బీసీసీఐకి రూ.1000కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో పిటీషన్‌ ‌దాఖలైంది. కొవిడ్‌ ‌సెకండ్‌ ‌వేవ్‌ ‌కారణంగా భారత్‌లో కొరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్‌ 2021‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను బాంబే కోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. బవిపత్కర పరిస్థితుల్లో ఐపీఎల్‌ను నిర్వహించడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బీసీసీఐకి రూ.1000కోట్ల ఫైన్‌ ‌వేయాలని, అలాగే ఐపీఎల్‌ ‌ద్వారా వచ్చే లాభాలనుకొరోనా చికిత్సకు అవసరమైన ఔషధాలు, మెడికల్‌ ఆక్సిజన్‌ ‌సరఫరా కోసం ఉపయోగించేలా ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఐపీఎల్‌ 14‌వ సీజన్‌ను బీసీసీఐ రద్దు చేసింది. సన్‌రైజర్స్ ‌హైదరాబాద్‌ ‌టీమ్‌లో వృద్ధిమాన్‌ ‌సాహా, ఢిల్లీ క్యాపిటల్స్ ‌ప్లేయర్‌ అమిత్‌ ‌మిశ్రా కూడా కొరోనా బారిన పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Leave a Reply