Take a fresh look at your lifestyle.

ప్రపంచ దేశాలను వొణికిస్తున్న’కరోనా’

'Corona' affecting world countries
ఫోటో :చైనాలో ఉన్న తమ జాతీయులను జపాన్, అమెరికా విమానాల ద్వారా స్వదేశాలకు రప్పిస్తోంది

చైనాలో కరోనా వైరస్ కేసులు అనుక్షణం పెరుగుతున్నాయి. ప్రాణాంతకమైన ఈ వ్యాధి సోకిన వారి సంఖ్య వేలల్లో ఉంది. మృతుల సంఖ్య 132కి పెరిగింది. వ్యాధి సోకిన వారి సంఖ్య ఆరువేలకు పెరిగింది. చైనాలో ఉన్న తమ జాతీయులను జపాన్, అమెరికా విమానాల ద్వారా స్వదేశాలకు రప్పిస్తోంది. చైనాలో వూహన్ నగరంలోనే ఈ కేసులు ఎక్కువ నమోదు అయ్యాయి. వూహన్ నుంచి 206 మంది జపనీయులను వెనక్కి తీసుకుని వచ్చిన ప్రత్యేక విమానం బుధవారం టోక్యోలో ల్యాండ్ అయింది. వీరిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు దగ్గు,జ్వరంతో బాధ పడుతున్నారు. వీరికి ప్రత్యేక పరీక్షలు జరిపిస్తున్నారు. నలుగురిలో ఇద్దరికి కరోనా వైరస్ లక్షణాలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. చైనాలో 5,094 మందికి ఈ వ్యాధి సోకినట్టు ప్రభుత్వం ధ్రువీకరించింది. ఈ వ్యాధి నివారణ కోసం చైనీస్ ప్రభుత్వం ఇంకా మరిన్ని చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తెస్తున్నాయి. విమానాశ్రయాల్లో ప్రయాణీకులకు ప్రత్యేక స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.

బ్రిటిష్ ఎయిర్ వేస్ వూహన్ సహా చైనాలోని అన్ని ప్రధాన విమానాశ్రయాలకు విమానాలను నిలిపి వేసింది. ఫ్రాన్స్ కూడా వూహన్ కు విమాన సర్వీసులను నిలిపి వేసింది. సార్స్ వైరస్ వల్ల చైనాలో 774 మంది మరణించారు.ఈ వ్యాధి ఐదువేల మందికి పైగా సోకింది. వూహన్ లో ఉన్న 630 మంది జపనీయులను తిరిగి వెనక్కి రప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం అదనపు విమాన సర్వీసులు నడుపుతున్నారు.

Tags: ‘Corona’ affecting, world countries

Leave a Reply