Take a fresh look at your lifestyle.

ఉమ్మడి జిల్లాలో ఆందోళనకరంగా కొరోనా వ్యాప్

ఒక్కరోజే 14మంది మృతితో ప్రజల్లో భయాందోళన
నల్లగొండలో 4 గంటల వరకే బంగారు దుకాణాలు
ఆలయాల్లో సందర్శనవేళలు కుదింపు

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొరోనాపాజిటివ్‌ ‌కేసులు భారీగా నమోదు అవుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా 2,234 కొరోనా పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. నల్గొండ జిల్లాలో 1,213, సూర్యాపేట జిల్లాలో 593, యాదాద్రి- భువనగిరి జిల్లాలో 528 పాజిటివ్‌ ‌కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో భారీగా కొరోనా కేసులు నమోదు అవుతుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మృతిచెందిన వారిలో  నల్లగొండ జిల్లాలో ఐదుగురు, సూర్యాపేటలో ఐదుగురు, యాదాద్రి జిల్లాలో నాలుగురు మృత్యువాతపడ్డారు. కాగా, మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,234 పాజిటివ్‌ ‌కేసులు నిర్దారణ అయ్యాయి. నల్లగొండ జిల్లాలో 1,213, సూర్యాపేట జిల్లాలో 593, యాదాద్రిలో 528 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి.  పెద్దవూర మండలంలోని పోతునూర్‌ ‌గ్రామానికి చెందిన ఓ వృద్ధుడికి(76) వారం రోజుల క్రితం పాజిటివ్‌ ‌రాగా, హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటల్‌ ‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(45) నల్లగొండలోని ఓ ప్రైవేట్‌ ‌హాస్పిటలో మృతి చెందాడు. ఇరువురి అంత్యక్రియాలను వారి స్వగ్రామాల్లోనే నిర్వహించారు. శాలిగౌరారం మండలంలోని భైరవునిబండకు చెం దిన ఓ మహిళ(40)కు పది రోజుల కిందట పాజిటివ్‌రాగా, హోంక్వారంటైన్‌ ఉం‌ది. మూడు రోజుల క్రితం ఆరోగ్యం విషమించడంతో నల్లగొండ ప్రభుత్వ హాస్పిటకి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. గ్రామంలోనే ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు.  దేవరకొండ పట్టణానికి చెందిన గిరిజన సంక్షేమశాఖ వసతిగృహ అధికారి(55)గా పనిచేస్తున్న ఓ ఉద్యోగి కొరోనాతో చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని ఓ హాస్పిటల్‌  ‌లో మంగళవారం మృతి చెందాడు. హాలియకు చెందిన, నెల్లికల్‌ ‌విద్యుత్‌ ‌సబ్‌స్టేషన్‌లో ఆర్టిజన్‌గా పనిచేసే ఒకరు కొరోనాతో మృతిచెందారు.

సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలంలో కొరోనా•తో ఒక్కరోజే  నలుగురు మృత్యువాతపడ్డారు. నేరేడుచర్ల పరిధిలోని నర్సయ్యగూడెంకు చెందిన వ్యవసాయ కూలీ (50) నాలుగు రోజులుగా కొరోనాతో సూర్యాపేట ప్రభుత్వ హాస్పిటల్‌  ‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. జగనాతండాకు చెందిన మహిళా రైతు(60) హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందింది. దాచారం గ్రామానికి చెందిన రైతు, టీఆర్‌ఎస్‌ ‌నాయకుడు(50) కూడా హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. నేరేడుచర్లకు చెందిన ఎన్నెస్పీలో లష్కర్‌గా పనిచేసిన వృద్ధుడు(70) మృతి చెందాడు. నడిగూడెం మండలం బృందానపురం గ్రామానికి చెందిన బెల్లంకొండ లక్ష్మీకాంత్‌(40)‌కు కొరోనాతో మృతి చెం దాడు. ఆయన ఓ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్నారు.  లక్ష్మికాంత్‌కు భార్య స్వాతి, ఇద్దరూ కుమార్తెలు ఉన్నారు. నల్లగొండ పట్టణంలో స్వర్ణకారుల దుకాణాలు బుధవారం నుంచి సాయంత్రం 4గంటలకే బంద్‌ ‌చేయనున్నట్టు స్వర్ణకార సంఘ పట్టణ అధ్యక్షుడు హరిప్రసాద్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కొరోనా కేసులు పేరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కొరోనా నేపథ్యంలో హాలియాలోని రామాలయం, ఆంజనేయస్వామి ఆలయాలను బుధవారం నుంచి మూసివేస్తున్నట్లు ఆలయ చైర్మన్‌ ‌మలిగిరెడ్డి లింగారెడ్డి తెలిపారు. ప్రతిరోజు ఉదయం స్వామివారి ఆరాదన, నైవేద్యం నివేదన అనంతరం మూసివేస్తామని, రెండు వారాల పాటు దర్శనాలు ఉండవని తెలిపారు. అదేవిధంగా వేంకటేశ్వరస్వామి ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఆలయ అర్చకుడు గోవర్ధనారాఘవాచార్యులు తెలిపారు. కొవిడ్‌తో మృతిచెందిన వారిని ఖననం చేసేందుకు సూర్యాపేట జిల్లా కోదాడ మునిసిపాలిటీలో ప్రత్యేక కంట్రోల్‌రూం ఏర్పాటుచేశారు. ప్రజా అవసరాల దృష్ట్యా 24గంటల పాటు సేవలు అందించేందుకు మునిసిపల్‌ ‌సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. కంట్రోల్‌ ‌రూంలో ఇద్దరు విధులు నిర్వహిస్తారు. ఉదయం 6గంటల నుంచి సాయంత్రం 5వరకు ఒకరు, సాయంత్రం 5గంటల నుంచి ఉదయం 6 వరకు మరొకరు, వీరికి సహాయకంగా మరో ఐదుగురి సిబ్బందిని నియమించినట్లు కమిషనర్‌ ‌నీలం నాగేంద్రబాబు తెలిపారు.

Leave a Reply