ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా మహ మ్మారి బారినపడి అనేకమంది మరణిస్తుంటే, అటువంటి వారి అంత్యక్రియలకు అప్పటివరకు ఆత్మీ యత గా ఉన్న సొంత బంధువులు సైతం రాని పరిస్థితులలో, మాన వత్వం మంట కలుస్తున్న నేటి సమా జంలో యువత ముందుకు వచ్చి ‘‘మేమున్నామంటూ’’ కరోనా బాధితులకు అండగా నిలిచేందుకు నడుంబిగించారు చర్ల పౌరులు. ఈ పరిస్థితులను గమనించిన చర్ల పౌరులు నీలి ప్రకాష్, ఎస్కే షాజహాన్, దొడ్డి తాతారావు, నీలి నందుబాబు, గొట్టిపాటి శ్రీనివా సరావు, కొటేరు శ్రీనివాసరెడ్డి తది• •రుల
సారధ్యంలో కరోనా బాధితు లకు భరోసా కల్పించాలనే ఉద్దేశంతో మనం’’ రోగితో కాదు – వ్యాధితో పోరాటం చేయాలే తప్ప వెలి వేయరాదు ‘‘ అనే నినాదం తో 20 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి కరోనా బాధిత కుటుంబ సభ్యులకు మానసిక ధైర్యాన్ని ఇవ్వడమే ప్రధానలక్ష్యంగా ముందుకు వెళ్తామని కమిటీ సభ్యులు నీలి ప్రకాష్, ఎస్కేషాజహాన్ తెలిపారు. ఎస్కే షాజహాన్ 10,000 రూపాయలు, పరుచూరి అమర్ చంద్ 5,000 రూపాయలు వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లంక వెంకట్, ముత్తు ప్రేమ్ కుమార్, ఎస్కే అక్బర్ షా, కర్రీ శివా రెడ్డి, కొప్పుల రాంబాబు, ఎస్.కె ఆదిల్ షా ( రషీద్), దొడ్డి హరి నాగ వర్మ, దొడ్డ ప్రభుదాసు పాల్గొన్నారు.