Take a fresh look at your lifestyle.

కొరోనాతో మనసు ‘మరో…’’ నా’!

“ఇప్పుడు కొత్తగా ఎక్కడ ఎవరినోట్లో విన్నా ఇమ్యూనిటీని పెంచుకోవడం పైనే చర్చ! దానికోసం అవి తాగండి ఇవి తినండి అంటూ సందట్లో సడెమియా అంటూ కుచ్చుటోపీలు పెడుతున్న వ్యక్తులు, సంస్థలు ఎన్నో ఎన్నెన్నో..! ముఖ్యంగా  అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే… ఇమ్యూనిటీ  అనేది అమాంతంగా ఒకే రాత్రిలో పెరిగిపోదు.అది వారి వారి శారీరిక నిర్మాణాన్ని,అంతర్గత గ్రంధులను..ఇంకా ముఖ్యముగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే వారి వారి మానసిక స్థితి/ ఆరోగ్యమును బట్టి కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇమ్మునిటీ తగ్గిపోతుంది.”

కొరోనా కాలం లో విపరీతంగా పెరిగి పోతున్న మానసిక సమస్యలు!
కొరొనా ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా సోకుతుందో అర్థంకాని పరిస్థితి ఇది.కొందరిలో లక్షణాలు కనపడుతాయి. మరికొందరు పెళ్ళికొడుకు/పెళ్లికూతురిలా లక్షణంగా ఉంటారు ఏ లక్షణాలు పైకి కనిపించకుండా..కానీ కోవిడ్‌-19 ‌పరీక్ష లో పోసిటివ్‌ ‌గా తేలుతారు. ఇలాంటి పరిస్థితుల్లో మన ఇంట్లో వారిని కూడా అనుమానించక తప్పడం లేదు.
ఇదంతా నాణానికి ఒకవైపు అయితే మరో ప్రక్క కొరొనా వచ్చినా రాకున్నా.. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు మానసిక సమస్యలతో చుట్టుముట్టబడి సతమతమవుతున్నారు.

ఇప్పుడు కొత్తగా ఎక్కడ ఎవరినోట్లో విన్నా ఇమ్యూనిటీని పెంచుకోవడం పైనే చర్చ! దానికోసం అవి తాగండి ఇవి తినండి అంటూ సందట్లో సడెమియా అంటూ కుచ్చుటోపీలు పెడుతున్న వ్యక్తులు, సంస్థలు ఎన్నో ఎన్నెన్నో ..!ముఖ్యంగా  అందరూ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే… ఇమ్యూనిటీ  అనేది అమాంతంగా ఒకే రాత్రిలో పెరిగిపోదు.అది వారి వారి శారీరిక నిర్మాణాన్ని,అంతర్గత గ్రంధులను..ఇంకా ముఖ్యముగా చెప్పాల్సిన విషయం ఏమిటంటే వారి వారి మానసిక స్థితి/ ఆరోగ్యమును బట్టి కూడా ఉంటుంది. అందుకే ఎక్కువగా తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యేవారిలో ఇమ్మునిటీ తగ్గిపోతుంది.

ఎవరు సహజంగా తుమ్మినా,దగ్గినా,కాస్తా ఒళ్ళు వెచ్చబడినా కూడా కొరొనా వచ్చేసిందేమోనని విపరీతంగా మానసిక ఒత్తిడికి గురై ఆందోళన చెందుతున్నారు. ఇక పాసిటివ్‌ ‌గా తేలిందో మరింత ఒత్తిడి అనుభవిస్తారు.
అందుకనే ఎంత పెద్దవారైనా, చదువుకున్నవారైనా కూడా క్వారంటైన్‌ ‌ల నుండి పారిపోవడం, పాసిటివ్‌ ‌గా తేలినా మూతికి ముసుగు లేకుండా తిరిగేయడం అందరికీ అంటించి తమకు తోడు చేసుకోవడం కూడా చూస్తున్నాం.కొందరైతే పాసిటివ్‌ ‌వస్తుందేమోనన్న భయంతో అసలు పరీక్ష కూడా చేయించుకోవడం లేదు.

ఇవిగాక ప్రత్యేకంగా వెంటాడుతున్న మానసిక సమస్యలు ఇలా ఉంటున్నాయని జాతీయ అంతర్జాతీయ పరిశోధనలు,సర్వేలు చెబుతున్నాయి.అవేవో చూద్దామా….
1. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరగడం
2.పెరిగిన ఒత్తిడి వలన ఆందోళన, పానిక్‌ అటాక్‌ ‌లకు గురై సరిగ్గా తినక పోవడం /అతిగా తినడం..అలాగే తగినంత నిద్ర పట్టకపోవడం/ అతిగా నిద్ర పోవడం.
3.క్రుంగుబాటుకు గురై తామేదో అపరాధం చేసినట్టు విపరీతంగా అపరాధ భావనకు గురవడం.(కొన్నిసార్లు దీనివలన ఆత్మహత్యకు పాల్పడడం కూడా జరుగుతోంది)
4.అనుమానాస్పద ప్రవృత్తి(paranoea) పెరిగిపోతోంది. ఎదుటి వ్యక్తిని చూస్తే వీడు మనకు అంటిస్తాడేమోనన్న అనుమానించే ప్రవర్తన కలిగి ఉండడం.
5.ఉద్వేగాలపై పట్టు కోల్పోవడం
6.ఒంటరిగా ఉండడానికి ఇష్టపడడం
7.చేసిన ఆలోచననే మళ్ళీ మళ్ళీ చేయడంObsesdive compulsive Neurosis))
8.ఒంటరిగా ఉంటూ కొరొనా గురించి విపరీతంగా భయపడడం/లేదా భావించడం
9.నేను బలవంతుణ్ణి నాకెందుకు వస్తుంది అని విపరీతంగా నిర్లక్ష్యంగా తిరగడం..
10.డెత్‌ ‌ఫోబియా…చనిపోతామేమో అని భయం.
11.ఆర్థిక పరమైన అభద్రతా భావాలు (ఉద్యోగం, వృత్తి, ఆదాయం కోల్పోతే  ఎలా అంటూ) భవిష్యత్తును గురించిన దిగులు బెంగతో క్రుంగుబాటు.
12. మళ్ళీ దొరకవేమో అని దుస్తులు, ఆహార పదార్థాలు, మాస్కులు, మందులు అతిగా నిల్వ చేసుకోవడంhoarding),,
13. జబ్బును గురించిన ఆందోళన వలన IBS(ఇర్రిటబుల్‌ ‌బొవెల్‌ ‌సిండ్రోమ్‌) ‌కు గురవడం,ఎసిడిటీ పెరగడం లాంటివి మొదలవుతాయి
14. టీవీల్లో,సోషల్‌ ‌మీడియా లో కొరొనా మృతుల గురించి నితంతరం బ్రేకింగ్‌ ‌న్యూస్‌ ‌వింటూ చూస్తూ ఉండడం వల్ల ఏ చిన్న నలత కలిగినా తనకు ఆ జబ్బు వచ్చేసిందేమో,వస్తుందేమో అని సంశయించడం (హైపోకాండ్రి యాసిన్‌)
15.‌రోజూ వైవిధ్యం లేకుండా ఒకే చోట ఉంటూ ఒకే రకమైన పనులుచేస్తూ..ఎక్కడికి వెళ్ళడానికి స్వేచ లేకుండా ఉండడం వల్ల బోర్డం తో నిస్త్రాణకు గురై ఒంటరితనం తో బాధపడడం
16. చేతులు వస్తువులు  పదే పదే కడిగి కడిగిOCD అబ్సెసివ్‌ ‌కంపల్సరీ డిజార్డర్‌ ‌కు గురికావడం..
17.ఇంతవరకు  ఎంతో బిజీ బిజీ గా ఉండి కుటుంబం తో చాలా తక్కువ సమయం గడిపేవారు..ఇప్పుడలా కాదు తప్పకుండా ఇంట్లోనే ఉండాల్సి రావడం తో కుటుంబ సభ్యుల మధ్యన తీవ్ర స్థాయి లో వాగ్వివాదాలు,కుటుంబకలహల తో మనశాంతి లోపించడంమేగాక ఇప్పటికే మానసిక సమస్యలు ఉన్నవారిలో అవి మరింత ప్రమాద స్థాయికి చేరుతున్నాయి.
(ఏవిధంగా వీటిని ఎదుర్కొనాలో మరొక సంచిక లో తెలుసుకోండి..)

shravanthi aitha raju
డా।। స్రవంతి ఐతరాజు
క్లినికల్‌ • ‌రీహబిలిటేషన్‌ ‌సైకాలజిస్ట్, ‌తిరుపతి

Leave a Reply