Take a fresh look at your lifestyle.

నేటి ఇల్లాలి కష్టం – రేపే కరోనాకు కాష్టం

ఉయ్యాల ఉయ్యాల ఉయ్యాలో
ఏమి కష్టం వచ్చే ఉయ్యాలో
ఇది ఏమి ఘోరం ఉయ్యాలో
చైనాలో పుట్టిందట ఉయ్యాలో
అక్కడే పెరిగిందట ఉయ్యాలో
పృథ్వి నలుమూలల చేరిందట ఉయ్యాలో
మన దేశం, మన వూరు వచ్చిందట ఉయ్యాలో
ఇల్లు కదలరు ఎవ్వరు ఉయ్యాలో
పిల్లలకు బడి లేదు ఉయ్యాలో
పెద్దలకు పనులు లేవు ఉయ్యాలో
ఇల్లంతా గడ బిడ ఉయ్యాలో
ఏమేమో కావాలే అందరికి ఉయ్యాలో
ఇల్లాలే చేయాలట ఆ పనులు ఉయ్యాలో
ఇంటి ఆడ బిడ్డల గతి చూడాలె ఉయ్యాలో
ఒక్క క్షణం తీరిక లేదు ఉయ్యాలో
పనిమనుషులు రానె రారు ఉయ్యాలో
ఇంటి పని, వంట పని ఉయ్యాలో
ఇంకా స్నానాలు, పానాలు ఉయ్యాలో
ఎక్కువైన చిరు తిండ్లు, తేనీరు ఉయ్యాలో
ఇల్లాలి వర్క్ ‌ఫ్రం వంటిల్లు ఉయ్యాలో
పది రెట్లు పెరిగింది ఉయ్యాలో
పగటి కునుకు మరచిపోయే ఉయ్యాలో
రాత్రి పదకొండు దాకా పనే ఉయ్యాలో
ఇదెక్కడి కరోనా ఉయ్యాలో
మా దేవుళ్ళు కనబడరు ఉయ్యాలో
పక్కింటి ముచ్చట్లు బందాయే ఉయ్యాలో
కడిగి కడిగి చేతులు ఉయ్యాలో
సబ్బుతో పాటు అరిగినవి ఉయ్యాలో
ప్రక్క మనిషి మీటరు దూరమట ఉయ్యాలో
ఇల్లాలు మాత్రం అన్ని తెచ్చి చేతికియ్యాలట ఉయ్యాలో
ఇంట్లోని పిల్లల జుట్టు లాగా ఉయ్యాలో
పెరుగుతుంది ఆమె బీ పీ ఉయ్యాలో
ఐనా మన కే సీ ఆర్‌ ‌చెప్పిండు ఉయ్యాలో
ఈ కష్టాలే కరోనాకు  మనం పెట్టే పొగ ఉయ్యాలో
మా చెమట బిందువులె ఉయ్యాలో
మా తీరిక లేని ఇంటి పనులె ఉయ్యాలో
మా మూసిన ఇంటి తలుపులే ఉయ్యాలో
కరోనాకు చూపిస్తాయి చీపురు కట్ట ఉయ్యాలో
మా ఇల్లూ, గల్లీనే కాదు ఉయ్యాలో
మా వూరు. మా నాడు ఉయ్యాలో
మా భారతం, మా పృథ్వి ఉయ్యాలో
వదిలేదాకా తప్పవు దెబ్బలు ఉయ్యాలో
ఇదే మా శాపం ఉయ్యాలో
భారత నారి మాట అంటె ఉయ్యాలో
కరోనాకు తప్పని ఉరి త్రాడు ఉయ్యాలో

– పాములపర్తి చంద్రకీరి

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!