Take a fresh look at your lifestyle.

దేశంలో కొరోనా @1600

  • కొరోనా కట్టడికి దేశవ్యాప్తంగా గట్టి కృషి
  • నిరంతరం శ్రమిస్తున్న అధికారులు
  • ప్రచార మాధ్యమాలతో చైతన్యం కల్పించే చర్యలు

ఢిల్లీ మర్కజ్‌ ‌లాంటి ఘటనలు మినహాయిస్తే ఇప్పటి వరకు కరోనా కట్టడిలో భారత దేశం కరోనా కట్టడిలో ఆదర్శ ప్రాయంగా నిలిచింది. వివిధ మాధ్యమాల ద్వారా కరోనా మహమ్మారితో వచ్చిపడిన ప్రమాదం గురించి ప్రచార ఉధృతిని చేపట్టింది. సామాజిక దూరం పాటించాలని హెచ్చరించింది. లాక్‌డౌన్‌ ‌ఖచ్చితంగా అమలు చేస్తోంది. ఈ నెల 14 వరకు ఇది కొనసాగనుంది. దేశంలో కేసుల సంఖ్య 1600 దాటింది. ఒక్కరోజే 203 కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం 49 మంది చనిపోయారు. మంగళవారం ఏడుగురు చనిపోయారు. కేరళ, మధ్యప్రదేశ్‌, ‌జమ్మూకాశ్మీర్‌, ‌పంజాబ్‌, ‌బెంగాల్లో, తెలంగాణలో ఇద్దరు చొప్పున చనిపోయారు. కరోనా జాబితాలోకి అస్సాంలో ఫస్ట్ ‌కేసు నమోదైంది. దేశంలో కరోనా మరణాలు, పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య పెరుగుతున్నందు వల్ల వైరస్‌ ‌సోకిన వారికి దూరంగా ఉండాలని చెప్పింది. కరోనా వైరస్‌ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందకుండా ఉండేందుకే లాక్డౌన్ను ప్రకటించారని, మనల్ని మనం కాపాడుకోవడమే దీని ఉద్దేశమని స్పష్టం చేసింది. నిత్యావసరాల కోసం తప్ప అస్సలు బయటకు రావొద్దని , ఇంటి నుంచి ఒక్కరే .. అది కూడా చాలా తక్కువ సార్లు మాత్రమే రావాలని పేర్కొంది.

కాగా, కొవిడ్‌ 19 ‌టెస్టింగ్‌, ‌శాంపిలింగ్స్ ‌పై కేంద్ర ఆరోగ్య మంత్రి హరవర్షన్‌ ఎప్పటికప్పుడు సక్షిస్తున్నారు. లేబొరేటరీలకు టెస్టింగ్‌ ‌కిట్లను సరఫరా చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. హాస్పిటల్స్, ‌ల్యాబ్ల్సో అన్ని సదుపాయాలు ఉండేలా చూడాలని, టెస్టింగ్‌ ‌కిట్లు, ఇతర ఎక్విప్మెంట్‌ ‌కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చేతులు పరిశుభ్రం చేసుకోవడం దగ్గరనుంచి ఇతరత్రా పాటించాల్సిన నియమాల వరకూ వారు బోధిస్తుంటే పౌరుల్లో అవగాహన పెరుగుతోంది. వైద్య సాయం అవసరమున్న వివిధ వ్యాధిగ్రస్తులకు, గర్భిణిలకు లాక్‌ ‌డౌన్‌ల వల్ల సమస్యలెదురుకాకుండా వారి ఇళ్లవద్దే మందులు, పౌష్టికాహారం వంటివి అంద జేస్తున్నారు. తమ ఇరుగుపొరుగులో విదేశాలనుంచి వచ్చినవారుంటే సమాచారం అందించే చైతన్యాన్ని ప్రజలకు కలిగిస్తు న్నారు.

లాక్‌డౌన్‌ ‌కారణంగా గత్యంతరం లేక నడక దారిన స్వస్థలాలకు పోవడానికి సిద్ధపడు తున్నారన్న కథనాలు వెల్లడయ్యాక తెలంగాణ సర్కారు అలాంటివారికి ఉచితంగా ఆహారం అందించేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో అన్ని దేశాలూ, రాష్టాల్రు తమకు చేతనైన రీతిలో పోరాడుతున్నాయి. ఇతరుల అనుభవాలను గ్రహించి ఆ పోరాటాన్ని మరింత పదునెక్కిస్తున్నాయి. ఇలాంటి సమష్టి పోరాటాలే ఈ మహమ్మారిని త్వరగా అంత మొందించగలవు. ఇందుకు పౌరుల సహాయసహకారాలు అత్యవసరం. ఇకపోతే లాక్‌డౌకారణంగా ఒత్తిడి పెరిగిపోతుందన్న సాకుచూపి మందు కొట్టడం, సిగరెట్‌ ‌కాల్చడం వంటివి చేస్తే రోగనిరోధక శక్తి తగ్గిపోతుందని కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం మెంటల్‌ ‌హెల్త్ ‌పైన కూడా పడుతుందని, కాబట్టి వాటికి దూరంగా ఉండాలని సూచించింది

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy