Take a fresh look at your lifestyle.

కాప్‌ 26 ‌వ సదస్సు 12 రోజుల వేడుక మాత్రమే!

‘‘ప్రస్తుతం ఉన్న స్ధితిలో ఉద్గారాల కట్టడికి మునుపెన్నడూ లేని రీతిలో నియంత్రణా చర్యలు చేపడితే తప్ప ఇలా 12 రోజులు వేడుకలు ద్వారా ఏ మాత్రం ప్రయోజనం లేదంటూ ధన్‌ ‌బర్గ్ ‌గొంతెత్తి చాటారు.కర్బన ఉద్గారాల విడుదల లో అల్ప భాగం అయిన వర్ధమాన దేశాలపై బాధ్యతలు పెంచడం ఈ సదస్సులో కూడా కొనసాగింది. ప్రపంచ ఉద్గారాలలో ఆఫ్రికా వాటా కేవలం 3 శాతం మాత్రమే అని చరిత్ర చెబుతోంది. అయితే మొత్తం ప్రపంచ ఉద్గారాల ప్రభావానికి ఆఫ్రికన్లు మూల్యం చెల్లించవలసి వస్తున్నదని ఆఫ్రికా దేశాలు వాపోతున్నాయి.అంతే కాకుండా దక్షిణార్ధ గోళంలో ఉండే దేశాలు ఉద్గారాల కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నాయి అయితే వాటి ప్రస్దావన మాత్రం పైకి రావడం లేదు.భారత్‌  ‌విషయం లో చూస్తే ప్రపంచపు మూడో అతి పెద్ద కాలుష్య కారక దేశంగా పెద్ద బూచిగా చూపిస్తున్నారు.’’

ఎప్పటి లాగానే గ్రీన్‌ ‌హౌస్‌ ‌వాయువుల విడుదల అరికట్టాలని..భూతాపం పెరగకుండా చూడాలని ప్రపంచదేశాలు సమావేశం కావడం  గొప్ప  శపధాలు చేయడం అనేది ఈ కాప్‌ 26 ‌సదస్సులో కూడా కొనసాగింది.
ఈ భూతాపానికి మీరంటే మీరు కారణం అంటూ పుణ్య కాలం 12 రోజులు గడిచిపోయాయి.సదస్సులో కొన్ని దేశాలు మాత్రం మేము శిలాజ ఇంధనాల వాడకం తగ్గింపుకు కట్టుబడి ఉన్నాం అని హామీలు ఇవ్వడం జరిగింది కానీ సంవత్సరాన్నీ చెప్పలేదు.పారిస్‌ ఒప్పందం అమలు జరిగిన తీరుపై ఈ సదస్సులో సమీక్షలు జరిపారు.అగ్రరాజ్యం అమెరికా గతంలో పారిస్‌ ఒప్పందం నుండి పక్కకు తప్పుకు పోవడాన్ని చింతిస్తూ అమెరికా క్షమాపణలు కూడా చెప్పింది.నెట్‌ ‌జీరో లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం అంటూ సదస్సుకు హాజరైన అనేక దేశాలు హామీలు గుప్పించాయి.అయితే ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి సంపన్న దేశాలు ఎక్కువ బాధ్యతలు తీసుకోవాలని నెట్‌ ‌జీరో లక్ష్యానికి అవసరమైన సాంకేతికతను ద్రవ్య వనరులను సంపన్న దేశాలే సమకూర్చాలని వర్ధమాన దేశాలు పట్టు పట్టాయి.పారిశ్రామిక విప్లవం ఆరంభం నుండి శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వినియోగిస్తూ వాటి ద్వారా వెలువడే గ్రీన్‌ ‌హ్రౌ ‌వాయువులను ప్రపంచం అంతటికీ పంచిన భాగ్యవంత దేశాలు నెట్‌ ‌జీరో లక్ష్యానికి  ఎక్కువ బాధ్యత వహించాలని వర్ధమాన దేశాలు మరొక సారి గొంతు విప్పాయి. గత సమావేశాలలో కూడా ఇదే ప్రతిపాదనలు వర్ధమాన దేశాలు చేస్తూ రావడం జరిగింది.

గతంలో ఈ విషయమై సంపన్న దేశాలు అన్నీ కలసి ఒక నిధి ఏర్పాటు చేయాలని తీర్మానం అయితే చేశారు కానీ అది నేటికి వాస్తవ రూపం దాల్చలేదు.కర్బన ఉద్గారాల తటస్దీకరణ దిశగా ఎక్కువ దృష్టి పెట్టాలన్న ఈ సదస్సు లక్ష్యంపై భారత్‌ ‌తన అభిప్రాయాన్ని చెప్పింది.. నెట్‌ ‌జీరో లక్ష్యాలు అన్నీ కూడా తాత్కాలిక ఉపశమనం ఇచ్చేవి తప్ప శాశ్వత ప్రయోజనాలు చేకూరేవి ఏ మాత్రం కాదని.. శాశ్వత పరిష్కారం అనేది సంప్రదాయేతర ఇంధన వనరులో కీలకమైన సౌర శక్తి వినియోగం గా భారత్‌ ‌పేర్కొంది.గతంలో భారత ప్రధాని సూచించిన ఒకే సూర్యుడు. ఒకే పుడమి..ఒకే గ్రిడ్‌ ‌ప్రతిపాదన మరలా ఈ సమావేశంలో హైలెట్‌ ‌చేశారు.దీనికోసం భారత్‌ ఆధ్వర్యంలో రూపకల్పన చేసిన అంతర్జాతీయ సౌర కూటమిలో చేరడానికి ఈ సదస్సులో అమెరికా సైతం అంగీకారం తెలిపింది.ప్రపంచ జనాభాలో భారత జనాభా 17 శాతంగా ఉంది ప్రపంచ కర్బన ఉద్గారాల వాటా కేవలం 5 శాతం గా ఉన్నప్పటికీ కూడా భారత్‌ ‌చిత్త శుద్దితో ఉద్గారాల కట్టడికి కృషి జరుపుతూ ఉందని సదస్సులో భారత ప్రధాని పేర్కొన్నారు.దీని కోసం ప్రత్యేకించిపంచామృతలుగా పిలవబడే పంచ సూత్రాలను భారత్‌ అమలు పరచడానికి సిద్ధం అయ్యిందని భారత్‌ ‌ప్రకటించింది.

పంచ సూత్ర ఎజెండా ద్వారా వాతావరణ మార్పులు అరికట్టేందుకు భారత్‌ ‌కృతనిశ్చయంతో ఉన్నట్లు ప్రకటించింది.శిలాజేతర ఇంధన వనరులు ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచడానికి సిద్ధం కావడం.దేశ ఇంధన అవసరాలలో 2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరులు ద్వారా సమకూర్చుకోవడం.కర్బన ఉద్గారాలను 2030 నాటికి 100 కోట్ల మేర తగ్గించడం 2070 నాటికి జీరో లక్ష్యాన్ని సాధించడం వంటివి పంచ సూత్రాలుగా మన ప్రధాని పేర్కొన్నారు.సౌర శక్తి విషయం లో పంచ సూత్రాలు విషయంలో ప్రపంచ దేశాలు మన ప్రతిపాదనలను ప్రశంసించాయి.అయితే సంపన్న దేశాల స్పందన మాత్రం ఆశించినంత ఈ సదస్సులో కనిపించలేదు.. వాతావరణ మార్పులు కు సంబంధించి ఈ  కాప్‌ 26 ‌సదస్సు చాలా కీలకం అయినదని చాలా ప్రచారం చేశారు.అయితే వాస్తవంలో మాత్రం ఈ సదస్సులో అద్భుత ప్రతిపాదనలు కానీ కార్యాచరణ ప్రణాళికలతో ముందుకు రావడంలో మాత్రం చిత్త శుద్ధి ఏ మాత్రం కనిపించలేదనే చెప్పవచ్చు. ప్రపంచానికి భూతాపం వలన రాబోయే కాలంలో ఏర్పడే విపత్తులు గురించి శాస్త్రవేత్తలు.. పర్యావరణ వేత్తలు ఎన్నో హెచ్చరికలు చేస్తూ వస్తున్నారు ..ఐక్యరాజ్య సమితి కూడా ఈ మధ్యనే కోడ్‌ ‌రెడ్‌ ‌పేరిట రాబోయే విపత్తు గురించి హెచ్చరించింది.అయినా కార్యాచరణలో ముందుకు వెళ్లే పరిస్ధితులు పెద్దగా కనిపించడం లేదు..ప్రపంచం లోనే అత్యధిక ఉద్గారాలను విడిచి పెట్టె చైనా మాత్రం కుంటి సాకులు చూపించి ఈ సదస్సుకు డుమ్మా కొట్టింది. ఒక వేళ హాజరు అయితే తాను దోషిగా నిలబడి ఉండాల్సి వస్తుందని చైనా కు కూడా తెలుసు.అందుకే సదస్సుకు దూరం అయ్యింది.ఎప్పటి లాగేవర్ధమాన దేశాలు సంపన్న దేశాల యొక్క ఈ ధోరణిని ఈ సదస్సులో తప్పు పట్టాయి.

.అభివృద్ధి అనేది సంపన్న దేశాలకు దాని వలన విడుదల అయిన ఉద్గారాల కట్టడి మాత్రం సమిష్టి బాధ్యత అనే తీరుపై వర్దమాన దేశాలు తీవ్రంగా ఖండించాయి. ప్రయోజనాలు మీవి త్యాగాలు మావి అనే తీరు ఇక చెల్లదు అనే సంకేతాలు పంపించాయి.. అయినప్పటికీ సంపన్న దేశాలలో పెద్ద చలనం లేదు.కాప్‌ 26 ‌వ సదస్సులో పాల్గొన్న భారత బాలిక వినీసా చేసిన ప్రసంగం ఎంతో ఆకట్టుకుంది. ప్రపంచ దేశాలు కర్బన ఉద్గారాలు కట్టడిలో చూపుతున్న అలసత్వాన్ని ఆమె దుయ్య బెట్టింది. తన ప్రసంగంలోప్రపంచ నేతలపై కోపం తెచ్చుకునేందుకు నా దగ్గర చాలా కారణాలు ఉన్నాయని అయితే అందుకు నా దగ్గర సమయం లేదని  పేర్కొంది. ఇప్పటికైనా మాటలు ఆపి.. చేతల్లో చూపించాలని, పాత పద్ధతులను ఆపేసి.. భవిష్యత్‌ ‌కోసం కొత్త దృక్పథం నిర్మించాలని చెప్పింది. తమ ఆవిష్కరణలు, సృజనపై డబ్బులను వెచ్చించి.. నవతరం భవిష్యత్‌ ‌కోసం ప్రయత్నాలు చేయాలని వినీశా చెప్పింది. మా భవిష్యత్‌ను మేం నిర్మించుకుంటామని వినీశా ఉమాశంకర్‌ ఆవేదనతో ప్రసంగం చేసింది.అంతే కాదు వాతావరణ మార్పులపై అలుపెరుగని పోరాటం జరుపుతున్న గ్రేటా ధన్‌ ‌బర్గ్ ‌గురించి తెలియని వారు ఉండరు.ప్రపంచ నేతలను ఉద్దేశించి స్వీడన్‌ ‌లో  మా తరం వారి ప్రయోజనాలను పాతి పెట్టడానికి మీకు ఎంత ధైర్యం అనే మాటలు మన చెవులలో ఇంకా మార్మోగుతున్నాయి.

గ్రేటా ధన్‌ ‌బర్గ్ ‌గ్లాస్గో లో విద్యార్థులు ఏర్పాటుచేసిన ర్యాలీ లో పాల్గొని కాప్‌ 26 ‌వ సదస్సుపై విమర్శల బాణాలను గుప్పించారు.ఈ సదస్సు కేవలం 2 వారాల వేడుక తప్ప ఏ విధమైన ప్రయోజనం లేదని. ప్రపంచ నాయకులు అందరూ వారి ప్రపంచంలో వారు బతుకుతున్నారని విమర్శించారు.ఈ సదస్సులో గొంతెత్తి వాగ్దానాలు చేసిన నాయకులు అందరూ సదస్సు అనంతరం ఎవరి పని వారు చేసుకుంటారు తప్ప వీటి వలన ఒరిగేది ఏమీ కనిపించదు అనేది అనేక సదస్సులు రుజువు చేశాయని ఆమె వాపోయింది..ఈ సదస్సు కూడాదానిలో ఒక భాగమే  తప్ప దీని ప్రత్యేకత ఏమీ లేదని ధన్‌ ‌బర్గ్ ‌పేర్కొన్నారు.ఈ ప్రపంచం భగ భగ గభ మండుతుంది..దీని వలన ఏర్పడే వాతావరణ మార్పుల ప్రభావాన్ని ప్రజలు చవిచూస్తున్నారు.అయినా మీకేం పట్టడం లేదు అని ఆమె వాపోయారు.

ప్రస్తుతం ఉన్న స్ధితిలో ఉద్గారాల కట్టడికి మునుపెన్నడూ లేని రీతిలో నియంత్రణా చర్యలు చేపడితే తప్ప ఇలా 12 రోజులు వేడుకలు ద్వారా ఏ మాత్రం ప్రయోజనం లేదంటూ ధన్‌ ‌బర్గ్ ‌గొంతెత్తి చాటారు.కర్బన ఉద్గారాల విడుదల లో అల్ప భాగం అయిన వర్ధమాన దేశాలపై బాధ్యతలు పెంచడం ఈ సదస్సులో కూడా కొనసాగింది. ప్రపంచ ఉద్గారాలలో ఆఫ్రికా వాటా కేవలం 3 శాతం మాత్రమే అని చరిత్ర చెబుతోంది. అయితే మొత్తం ప్రపంచ ఉద్గారాల ప్రభావానికి ఆఫ్రికన్లు మూల్యం చెల్లించవలసి వస్తున్నదని ఆఫ్రికా దేశాలు వాపోతున్నాయి.అంతే కాకుండా దక్షిణార్ధ గోళంలో ఉండే దేశాలు ఉద్గారాల కట్టడికి విశేషంగా కృషి చేస్తున్నాయి అయితే వాటి ప్రస్దావన మాత్రం పైకి రావడం లేదు.భారత్‌  ‌విషయం లో చూస్తే ప్రపంచపు మూడో అతి పెద్ద కాలుష్య కారక దేశంగా పెద్ద బూచిగా చూపిస్తున్నారు.అయితే భారత్‌ ‌విడుదల చేసే కర్బన ఉద్గారాలు 2.88 గిగా టన్నులు మాత్రమే.అదే  చైనాలో అయితే 10.6 గిగా టన్నులు.అమెరికాలో అయితే 5 గిగా టన్నులు.దీనిని బట్టి చూస్తే ఉద్గారాల విడుదల కు మనం ప్రధాన కారకులం కాదు.

ఎవరైతే ప్రధాన కారకులో వాళ్ళు మాత్రం సదస్సులు కు డుమ్మా కొట్టి మిగిలిన దేశాలపై కట్టడి భారం మోపుతున్నారు.ఎంతకాలం అయినా ఎన్ని సదస్సులు జరిపినా ఈ శైలి లో మార్పు కనపడటం లేదు.గంభీరంగా వాగ్దానాలు తప్ప కార్యాచరణ లు కానరావడం లేదు.దీని వలన భావితరాల వారి ప్రయోజనాలు మాట అటు ఉంచితే ప్రస్తుత తరం వారే తీవ్ర విపత్తును ఎదుర్కోవలసి వస్తున్నది.ఈ పుడమిపై కోట్లాది జీవరాసులు జీవిస్తూ ఉంటే ప్రకృతికి హాని చేసేది మాత్రం కేవలం మనిషి మాత్రమే.మానవ నిర్మితమైన ఈ భూతాపం వలన మనిషితో పాటు సకల జీవరాసుల మనగడ ప్రశ్నార్ధకం అయ్యింది.అలాగే సంపన్న దేశాల పాపానికి వర్ధమాన దేశాలు పాపాన్ని అనుభవించవలసిన పరిస్ధితులు దాపురించాయి. ఇప్పటికైనా కళ్ళు తెరవక పోతే తగిన మూల్యం చెల్లించక తప్పదు..
– రుద్రరాజు శ్రీనివాసరాజు…9441239578.
లెక్చరర్‌..ఐ.‌పోలవరం.

Leave a Reply