Take a fresh look at your lifestyle.

వైరస్‌ ‌తగ్గేవరకు సహకరించాలి : మంత్రి

ఖమ్మం అర్బన్‌, ఏ‌ప్రియల్‌ 30 (‌ప్రజాతంత్ర విలేకరి) : రాబోయే కొద్ది రోజుల్లో కరోనా వైరస్‌ ‌పాజిటీవ్‌ ‌కేసులు లేని జిల్లాగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. గురువారం కంటోన్మెంట్‌ ‌జోన్‌లో ఉన్న ఖిల్లా బజార్‌లో మంత్రి పువ్వాడ పర్యటించారు. పాజిటీవ్‌ ‌వచ్చి పూర్తిగా నయం అయిన ఇంటికి చేరుకున్న సత్తార్‌ ‌కుటుంబానికి ఆయన నిత్యావసర సరుకులు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ప్రజలెవరూ ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదన్నారు. మీ ప్రాంతానికి తానే నేరుగా వచ్చానని, వైరస్‌ ‌పట్ల ప్రజలు భయపడవద్దని కోరారు. సామాజిక దూరం పాటించి అప్రమత్తంగా ఉంటే చాలన్నారు. కరనా వైరస్‌ ‌సోకినవారిలో కూడా 97శాతానికి పైగా పేషంట్లు కోలుకుని డిశ్చార్జి అవుతుందడం మంచి పరిణామన్నారు.

వైరస్‌వ్యాప్తి ప్రబావం బాగా తగ్గుతున్నందున రాష్ట్రంలో కంటోన్మెంట్లు సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్లు వివరించారు. ప్రజలెవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని, గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ధోరణి చూస్తుంటే వైరస్‌వ్యాప్తి చాలా వరకు తగ్గుముఖం పట్టిందని ఇదే తరహాలో ప్రజలు సహకరిస్తే కరోనారహిత రాష్ట్రంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, ‌మున్సిపల్‌ ‌కమీషనర్‌ అనురాగ్‌ ‌జయంతి పాల్గొన్నారు.

వరి ధాన్యం, మక్కల కోసం స్టోరేజి ఏర్పాటుచేస్తాం
దాన్యం కొనుగోలు, కొనుగోలు చేసిన ప్రతి ధాన్యపు గింజను నిల్వ చేయడానికి జిల్లా వ్యాప్తంగా సరిపడే స్టోరేజిని ఏర్పాటుచేస్తామని రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ‌తెలిపారు. గురువారం ముదిగొండలోని ఉషశ్రీ జిన్నింగ్‌ ‌మిల్‌, ‌నేలకోండపల్లిలోని మధుకాన్‌ ‌షుగర్స్‌లోని ధాన్యం నిల్వచేసే ప్రాంతాలను పరిశీలించారు. ఉషశ్రీ జిన్నింగ్‌ ‌మిల్స్‌లో 4500 మెట్రిక్‌ ‌టన్నులు ఎంపి నామా నాగేశ్వరరావు సహకారంతో మధుకాన్‌ ‌షుగర్స్‌లో 7500 మెట్రిక్‌: ‌టన్నులలు స్టోరేజి ఇవ్వడానికి ముందుకొచ్చారన్నారు. ఆయా ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఎక్కడ ధాన్యం అక్కడే నిల్వ ఉంచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఆదేశాల మేరకు రైతు పండించిన ప్రతి ధాన్యపు గింజను కొనుగోలు చేసి రైతులకు భరోసా కల్పించాల్సిన బాద్యత మనందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ‌చైర్మన్‌ ‌లింగాల కమల్‌రాజ్‌, ‌జిల్లా కలెక్టర్‌ ఆర్‌వి కర్ణన్‌, అదనపు కలెక్టర్‌ ‌మధుసూధన్‌రావు, మార్క్‌ఫెడ్‌ ‌జిల్లా అధికారి సుధాకర్‌ ‌పాల్గొన్నారు.

Leave a Reply