Take a fresh look at your lifestyle.

‌గ్రేటర్‌ ఎన్నికల్లో విద్వేష ప్రసంగాలు..

బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌పై కేసులు నమోదు
విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలపై కఠిన చర్యలు : రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ 

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీలపై పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. గ్రేటర్‌ ‌ప్రచారంలో భాగంగా వీరిద్దరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు పోలీసులు సుమోటాగా కేసులు నమోదు చేశారు. ఐపీసీ 505 సెక్షన్‌ ‌కింద ఎస్‌ఆర్‌ ‌నగర్‌ ‌పోలీసులు వీరిపై కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. బండి సంజయ్‌, అక్బరుద్దీన్‌ ‌చేసిన వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని ఎఫ్‌ఐఆర్‌లో పోలీసులు పేర్కొన్నారు. పాత బస్తీలో
అక్రమంగా రోహింగ్యాలు నివసిస్తున్నారని, వారిపై సర్జికల్‌ ‌స్ట్రై ‌చేస్తామని బండి సంజయ్‌ ‌సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక… ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ అ‌క్రమ నిర్మాణాలపై మాట్లాడుతూ… హుస్సేన్‌ ‌సాగర్‌ను ఆక్రమించి కట్టిన ఎన్టీఆర్‌, ‌పీవీ సమాధులను కూల్చగలరా? అంటూ సవాల్‌ ‌విసిరారు. దీనికి బండి సంజయ్‌ ‌స్పందిస్తూ…పీవీ, ఎన్టీఆర్‌ ‌ఘాట్లను కూలిస్తే… రెండు గంటల్లోగా దారుసలాంను కూల్చేస్తామని ఛాలెంజ్‌ ‌విసిరారు.

వీరిద్దరి వ్యాఖ్యలతో సామాజికంగా ఘర్షణలు చెలరేగే అవకాశాలున్నాయని, అందుకే కేసులు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ మహేష్‌ ‌భగవత్‌ ‌హెచ్చరించారు. ఎన్నికల నియమావళి మేరకు ప్రచారం చేసుకోవచ్చునని, అయితే కొందరు నాయకులు వివాదాలు సృష్టిస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. అభ్యర్థులు, నేతల ప్రసంగాలు రికార్డు చేస్తున్నామని, సోషల్‌‌డియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్న పోస్టులనూ గుర్తిస్తున్నామని సీపీ చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో ఉన్న 440 పోస్టులను తొలగించేందుకు ఆయా సంస్థలను కోరామని తెలిపారు. విద్వేషాలు రెచ్చగొట్దేందుకు ప్రయత్నిస్తే 100కు గానీ 94906 17111 నెంబర్‌పై ఫిర్యాదు చేయాలన్నారు. రాచకొండ కమిషరేట్‌ ‌పరిధిలో ఎన్నికల బందోబస్తు కోసం ఏడు ప్లయింగ్‌ ‌స్క్వాడ్‌లు, ఆరు స్టాటిక్‌ ‌సర్వైలైన్‌ ‌టీమ్‌లను ఏర్పాటు  చేసినట్లు వివరించారు.

పోలింగ్‌ ‌కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, కౌంటింగ్‌ ‌కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్‌ ‌భగవత్‌ ‌తెలిపారు. ఎన్నికల సందర్భంగా రౌడీషీటర్లను బైండోవర్‌ ‌చేశామని, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు 6వేల మంది సిబ్బందిని ఎన్నికల విధుల్లో వినియోగిస్తున్నట్లు తెలిపారు.

Leave a Reply