Take a fresh look at your lifestyle.

సోషల్‌ ‌మీడియా పై నియంత్రణ..!

గడువు మరో 15 రోజులు పెంచిన కేంద్రం
న్యూఢిల్లీ,మే27: సోషల్‌ ‌మీడియా నియంత్రణ పై తీసుకువచ్చిన నిబంధనల అమలు గడువును కేంద్ర ప్రభుత్వం మరో 15 రోజులకు పొడగించింది. ఫిబ్రవరి 25న రూపొందించిన ఈ ఐటీ గైడ్‌లైన్స్  ‌మే 26న అమలులోకి వస్తాయని, ఆలోపు సోషల్‌ ‌ మీడియా వేదికలు సహా ఓటీటీ, ఇతర డిజిటల్‌ మీడియా వేదికలు తప్పక పాటించాలని కేంద్రం ప్రకటించింది. అయితే ఒక్క నెట్‌ప్లిక్స్ ‌మినహా ఏ ఇతర సోషల్‌, ‌డిజిటల్‌ ‌వేదికలు ఈ నిబంధనలను అంగీకరించలేదు. ఫేస్‌బుక్‌ ‌కొంత సానుకూలంగానే ఒక ప్రటకన విడుదల చేసింది. తాము ప్రభుత్వం కొత్తగా చేసిన ఐటీ నిబంధనలను అంగీకరించాలనే అనుకుంటు న్నామని, అయితే కొన్ని సమస్యాత్మక అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.

ట్విట్టర్‌ ‌కూడా అంగీకారినిక కాస్త సముఖుత చూపుతూనే కొన్ని అంశాలపై అభ్యంతరాలు తెలిపింది. దీంతో మరో 15 రోజుల వరకు గడువు పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ నిబంధనల ప్రకారం, ఈ బడా టెక్‌ ‌కంపెనీలన్నీ కూడా భారత్‌లో ఒక చీఫ్‌ ‌కంప్లయన్స్ ఆఫీసర్‌ను నియమించాలి. వీళ్లు ప్రభుత్వానికి అవసరమైనప్పుడు వెంటనే స్పందించేలా ఉండాలి. ప్రభుత్వం అడిగిన సమాచారాన్ని సత్వరమే అందించాలి. అలాగే నోడల్‌ ఆఫీసర్లను కూడా ఏర్పాటు చేయాలి. వీళ్లు ప్రభుత్వానికి అవసరం అయినప్పుడు.. లా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీలకు 24 గంటలు అందుబాటులో ఉండాలి. వీళ్లతోపాటు గ్రీవెన్స్ ‌రిడ్రసల్‌ అధికారిని కూడా నియమించాలి. వీళ్లు యూజర్లకు ఎదురయ్యే సమస్యలు, కష్టాలకు జవాబుదారీగా వ్యవహరించాలి.

Leave a Reply