Take a fresh look at your lifestyle.

కొరోనా కట్టడికి మరికొంత కాలం సహకరించండి

వికారాబాద్‌ : ‌వికారబాద్‌ ‌పట్టణంలోని సీజన్‌ ‌కాలనీల్లో ఎమ్మెల్యే ఆనంద్‌, ‌మున్సిపల్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌చిగుళ్లపల్లి మంజులతో కలిసి పర్యటించి పరిస్థితులను సమీక్షించారు. ఈ సందర్భంగా సీజన్లలో నిత్యావసర సరుకులు ఏ విధంగా అందుతున్నాయి, పరిస్థితులు ఎలా ఉన్నాయని వార్డు కౌన్సిలర్లను, ప్రజలను అడిగి తెలుసుకున్నారు. సి- జోన్‌ ‌శివరంనగర్‌, ‌బిటిఎస్‌, అయ్యప్ప, వెంకటేశ్వర, ఆలంపల్లి, మదుకాలనీ, రాజీవ్‌ ‌నగర్‌, ‌రిక్షా కాలనీలలో పర్యటించారు.సి – జోన్‌ ‌లోని పలు ప్రాంతాల్లో కూరగాయలు, పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆనంద్‌ ‌మాట్లాడుతూ కష్టకాలంలో నిరుపేదలకు ఆకలి బాధల్లేకుండా చూడడమనేది ఈ సమాజంలో అందరి బాధ్యత అన్నారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు అన్నారు. సి జోన్‌ ‌లలో ఉన్న పరిస్థితులను, ప్రజాప్రతినిధులు, అధికారులు తీసుకుంటున్న చర్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు.ఇంకొంత కాలం ప్రజలు ఇదే విధంగా సహకరించాలి అని కోరారు. కొరోనా కట్టడి ప్రజలందరి భాధ్యత అని, ప్రతి ఒక్కరూ లాక్‌డౌన్‌ ‌పాటించి, మాస్కు లు ధరించి వైరస్‌ ‌నివారణలో భాగస్వామ్యం కావాలని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌తీసుకుంటున్న చర్యలను ప్రపంచమంతా హర్షిస్తున్నదన్నారు. వికారాబాద్‌ ‌నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కృషి చేయాలి అన్నారు. కొరోనాను అరికట్టేందుకు ఆహోరాత్రులు పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు, వైద్యులు, పోలీసులు, రెవెన్యూ, ఆశ వర్కర్లు, ఏఎన్‌ఎం‌లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు నవీన్‌ ‌కుమార్‌ ‌గాయత్రి లక్ష్మణ్‌ ‌సుధాకర్‌ ‌రెడ్డి విజేందర్‌ ‌గౌడ్‌ ‌రామస్వామి నాయకులు శుభప్రద్‌ ఆర్డీవో ఉపేందర్‌ ‌రెడ్డి తదితరలు పాల్గొన్నారు. కాలనీల్లో పర్యటించిన ఎమ్మెల్యే ఆనంద్‌ ‌మున్సిపల్‌ ‌చైర్పర్సన్‌ ‌మంజుల రమేష్‌ ‌కుమార్‌ అధికారులు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!