Take a fresh look at your lifestyle.

ఆత్మవిమర్శకు ఉపకరించే అంశాలలో ఒకటి రెండు

బస్‌ ‌స్టాండ్లను, టాయిలెట్స్‌ను కూడా వదలకుండా ‘‘ఇద్దరి చిత్రాలతోనే నగరమంతా నింపివేయడం ప్రజలకు నచ్చి ఉండక పోవచ్చు ! నగరం అన్నాక మేయర్‌కే ప్రాధాన్యత,.. చేసిన అభివృద్ధిలో మేయర్‌ ‌ప్రస్తావన ఎక్కడా ఉండక పోవడం కావచ్చు. వరదసహాయ కార్యక్రమాలలో ‘‘అస్మదీయులకే’’ సహాయం అందినట్టు, కమీషన్‌ ఏజంట్ల చేతివాటం ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఏడవ తారీకు నుండి అందించబోయేటప్పుడు ఆ తప్పిదాలు లేకుండా జాగ్రత్త పడాలి. ఐటి అభివృద్ధి, ఫ్లై ఓవర్లు, రోడ్లు మొదలగునవి పేదలను ఆకర్షించే అంశాలు కావు. ఎక్కువగా ఓటింగ్‌లో పాల్గొనేది వారే కనుక మౌలిక అవసరాలపైన కూడా అధిక దృష్టి అవసరం.

టాయిలెట్స్ ‌నిరుపయోగంగా ఉండడం, తాళాలు వేసి ఉండడం, చుట్టూ గడ్డి, చెత్త ఉండడం వల్ల పక్కనే మూత్ర విసర్జన చేయడం.. అవి ప్రచార ఆర్భాటానికే అనిపించడం ! ఏ పార్టీ ఉత్థాన పతనాలైనా పార్టీ కార్యకర్తల పనితీరు పైననే ఆధారపడి ఉంటాయన్నది నిర్వివాద అంశం. వీరాభిమానులం అని చెప్పుకునే వారు, నిజంగా పార్టీ అభివృద్ధిని కోరి, ప్రజల మధ్య ఉండేవారు కనుక నిర్మొహమాటంగా ప్రజల మనోగత అభిప్రాయాన్ని, భావనలను యథాతథంగా పార్టీకి ఎప్పటికప్పుడు తెలియజేస్తుండాలి. సరియైన సూచనలు ఇవ్వాలి. బాధిత ప్రజలు కోపంతో ఏదో అంటారు..సంయమనం పాటించి, శాంతంగా మాట్లాడి నచ్చజెప్పాలి గాని వాదోపవాదాలకు దిగి మనసు నొచ్చుకునే విధంగా ప్రవర్తించరాదు. అటువంటి వీడియోలు సామాజిక మాధ్యమాలలో దర్శనమిచ్చాయి ! గతం లో, ముఖ్యమంత్రి కాగల అనుభవం, ప్రజ్ఞ ఉన్న సీనియర్‌ ‌నాయకుడు, ‘‘మీరు ఓటు వేస్తే ఎంత, వేయకపోతే ఎంత ? ‘‘ అని, కనుమరుగైన విషయం తెలుసుకదా ! •ఖీ•ఱశ్రీబతీవ ఱ •ష్ట్రవ •వజూజూఱఅస్త్ర ••శీఅవ •శీ •బమీవమీ్ణ అన్న సామెతను గుర్తుచేసుకొని తదనుగుణంగా నడచుకుంటే శ్రేయస్కరం !.
– మనోహర్‌ ‌బోరంచ

Leave a Reply