Take a fresh look at your lifestyle.

అభివృద్ధికి సహకరించండి

మహబూబ్‌నగర్‌, 22 ‌మే (ప్రజాతంత్ర ప్రతినిధి) : పట్టణం అభివృద్ధికి అందరూ సహకరించాలని ఎన్నో ఏళ్లుగా మహబూబ్‌ ‌నగర్‌ ‌పట్టణాన్ని ఎన్నో ఏళ్లుగా పట్టి పీడిస్తున్న టువంటి ట్రాఫిక్‌ ‌సమస్యను అధిగమిం చేందుకు రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయని రోడ్డు విస్తరణలో స్థలాలు కోల్పోయిన వారికి టిడిఆర్‌ ‌సర్టిఫికెట్లను ఇవ్వాలని సంబంధిత అధికారులకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ‌వెంకట్రావు సూచించారు. శనివారం కాలెక్టరేట్‌ ‌లోని కలెక్టర్‌ ‌ఛాంబర్లో సంబంధిత అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో కలెక్టర్‌ ‌మాట్లాడుతూ పట్టణం అభివృద్ధిలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్డు విస్తరణలో ఇండ్లు, దుకాణాల స్థలాలు కోల్పోతున్న వారికి టిడిఆర్‌ ‌సర్టిఫికెట్లను సిద్ధం చేసి స్థల యజమానులకు అందించాలని మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌కు సూచించారు. అలాగే పట్టణంలో కాకుండా ఇతర ప్రాంతాలలో జరుగుతున్న రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారికి భూ సేకరణ చట్టం ప్రకారం జనరల్‌ అవార్డ్ ‌పాస్‌ ‌చేయాలని కలెక్టర్‌ ‌తెలిపారు. జనరల్‌ అవార్డ్ ‌పాస్‌ ‌చేయడానికి ల్యాండ్‌ ‌వాల్యూ సరి చూసుకుని చేయాలని మహబూబ్నగర్‌ ఆర్డీఓ సంబంధిత అధికారులకు కలెక్టర్‌ ‌సూచించారు.

భూ సేకరణలో ఇంకా ఎంత పెండింగ్‌ ఉం‌దని సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. సమీక్షా సమావేశంలో అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌సీతారామరావు, డిఆర్‌ఓ ‌కె.స్వర్ణలత, మహబూబ్‌నగర్‌ ఆర్డీఓ శ్రీనివాసులు, మునిసిపల్‌ ‌కమీషనర్‌ ‌సురేందర్‌, ‌జిల్లా అటవీ శాఖ అధికారి గంగారెడ్డి, సర్వే ల్యాండ్‌ ఎడి శ్యామ్‌ ‌సుందర్‌, ‌నేషనల్‌ ‌హైవే అధికారులు, విద్యుత్‌ ‌శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy