Take a fresh look at your lifestyle.

టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీలకు కాంట్రాక్ట్ ‌టీచర్స్,బ్రాహ్మణ సంఘాల మద్దతు

మంత్రి హరీష్ రావు లేఖ అందజేసిన సభ్యులు
రాష్ట్రంలోని 11 యూనివర్సిటీలకు చెందిన కాంట్రాక్ట్ ‌టీచర్స్ అసోసియేషన్‌ ‌టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులకు మద్దతు ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావుకు మద్దతు లేఖను యూనియన్‌ ‌నేతలు అందజేశారు. మంత్రిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ‌బలపరిచిన అభ్యర్థులు వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌రెడ్డికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా తీర్మానం ప్రతిని అందజేశారు. అనంతరం కాంట్రాక్ట్ ‌టీచర్ల సమస్యలు పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం వారిని మంత్రి హరీశ్‌రావు అభినందించారు. సమస్యలను సీఎం కేసీఆర్‌ ‌దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులు సురభి వాణీదేవి, పల్లా రాజేశ్వర్‌ ‌రెడ్డికి మద్దతు తెలుపుతున్నట్లు సంస్కృతిక రాష్ట్ర అసోసియేషన్‌, ‌వేద ధార్మిక సేవా సమితి, సంభాషణ సంస్కృతం అసోసియేషన్‌లు ప్రకటించాయి. ఈ క్రమంలో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌ ‌రావును ఈ మూడు అసోషియేషన్ల గౌరవాధ్యక్షులు రవీందర్‌ ‌సింగ్‌ ‌నేతృత్వంలో సంస్కృతిక రాష్ట్ర అసోసియేషన్‌ అధ్యక్షులు సాధన నరసింహాచార్యులు, వేద ధార్మిక సేవా సమితి అధ్యక్షులు కొండపాక కృష్ణమాచార్యులు, సంభాషణ సంసృతం అసోసియేషన్‌ అధ్యక్షులు నరేంద్ర కృష్ణ కలిశారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు అసోసియేషన్‌ ‌తీర్మాన ప్రతిని మంత్రి హరీశ్‌ ‌రావుకు అందజేశారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ ‌ద్వారా ఎంతో మంది పేదలకు సీఎం కేసీఆర్‌ ఆర్థిక సాయం చేస్తున్నారని కొనియాడారు. టీఆర్‌ఎస్‌ ‌పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇచ్చినందుకు మంత్రి హరీశ్‌ ‌రావు వారిని అభినందించారు.

Leave a Reply