కాంట్రాక్ట్ అధ్యాపకుల శ్రమ దోపిడీకి నిలయాలుగా విశ్వవిద్యాలయాలు
ఉన్నత విద్యను అందిస్తూ సమాజానికి మార్గదర్శిగా ఉండాల్సిన విశ్వవిద్యాలయాలే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నకాంట్రాక్ట్ అధ్యా పకులశ్రమ దోపిడీకి నిలయాలుగా మారాయి. 1990 శతాబ్దంలో ఉమ్మడి రాష్ట్రంలో లో అప్పటి ప్రభుత్వాలు కొత్త చట్టాలను తెచ్చి కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టాయి. అతి తొందర్లోనే ఈ కాంట్రాక్టు వ్యవస్థను మెల్లిమెల్లిగా దాదాపు అన్ని ప్రభుత్వ సంస్థల్లోకి తీసుకువచ్చారు. అలా యూనివర్సిటీల్లో కూడా కాంట్రాక్ట్ పద్ధతిన బోధన, బోధనేతర సిబ్బందిని నియమించుకోవటం జరిగింది. అలా దశాబ్దాలుగా ప్రభుత్వాలే శాశ్వత ఉద్యోగులను నియమించకుండా ఇలా కాంట్రాక్ట్ పద్ధతిన తక్కువ వేతనానికి కాంట్రాక్ట్ ఊగ్యోగులను నియమించుకుంటు వారి శ్రమదోపిడి చేస్తున్నారు. శాశ్వత ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్నప్పటికీ జీతభత్యాల/వేతనాలలో మాత్రం తేడాలు ఉన్నాయి. కనీస మూల వేతన నియమము ప్రకారం జీతభత్యాలు ఇవ్వాలి అని డిమాండ్ కాలంతోపాటుగా కొనసాగుతూ వస్తుంది. అయిననూ ప్రభుత్వాలు ఏనాడు చెల్లించలేదు పైగా పై అధికారుల చేత భయబ్రాంతులకి గురిచేయిస్తున్నారు.
ఈ వలస పాలనలో మాకు అన్యాయం జరుగుతుంది అని చెప్పి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే మాకు ఉద్యోగాలు, చేస్తున్న ఉద్యోగులకు సరైన జీతాలు, మంచి భవిష్యత్తు వస్తుందని, ఆత్మగౌరవంతో జీవిస్తామని శతాబ్దాల తరబడి ఎదురు చూస్తున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను నెరవేర్చుకోవాలని, ఒకవైపు విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమంలో భాగస్వామ్యమై పాలుపంచు కున్నాము.జరిగిన ఉద్యమ నేపథ్యంలో మాకంటు ఒక మెట్టు కూడా ఉన్నదని యావత్ తెలంగాణ ప్రజానీకం గుర్తెరిగింది.కేసిఆర్ సారథ్యంలో అందరి సమిష్టి కృషి మేర తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నాము. ఆనాటి ఉద్యమ నాయకులు ఈనాటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2014లో ఎన్నికల మ్యానిఫెస్టోలు విద్యా వ్యవస్థకు సంబంధించి ఎన్నో హామీలు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో పని చేస్తున్నటువంటి అన్ని సంస్థల్లో కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తాం అన్నారు.2014 జులై 16న ప్రభుత్వం ఏర్పడిన మొదటి కేబినేట్ ఆమోదించిన 43 అంశాల్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ వారిని రెగ్యులరైజ్ అంశం కూడా ఉన్నది. జనవరి 2, 2016 న సీఎం మీడియా సంక్షంలో మాట్లాడుతూ జనవరి 31 లోగా క్రమబద్ధీకరిస్తామన్నారు కానీ అవన్నీ ఉత్త మాటలుగానే మిగిలినా, వారికి జీతాలు పెంచిన మాట వాస్తవమే. దీనికి సీఎం గారికి కాంట్రాక్ట్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
యూనివర్శిటీ కాంట్రాక్ట్ అధ్యా పకులకు మాత్రం ఎలాంటి వేతనాలు పెంపు జరగలేదు. మా ఆందోళన, మా అర్జీలు, ఆర్తనాదాలు, అభ్యర్థనలు, నిరసనలు కొనసాగిన పక్షంలో దాని ఫలితంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాల పెంపు కొరకై తిరుపతి రావు కమిటీ సిఫారసు మేరకు యూనివర్శిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు 75% వేతనాలు పెంచుతూ G.O.Ms.No.11ను జారీచేసింది. ఈ GOలొ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ప్రస్తావన లేకపోవడంతో ఆయా యూనివర్సిటీ VCలు కేవలం మంజూరు చేయబడిన పోస్ట్ లో ఉన్నవారికి మాత్రమె అమలుచేస్తూ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు జీతాలు పెరగలేదు.ఈ రాష్ట్ర ప్రభుత్వం 18.04.2018 రోజున యూనివర్సిటీ లో పని చేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాల పెంపుకై G.O.Ms.No. 11 విడుదల చేయడం జరిగింది. విడుదలైన ఈ జీవో పాక్షికంగా మాత్రమే అమలు పరచడం జరిగింది. ఈ జీవో విడుదలకి ముందు వరకు కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరికీ సమానమైన వేతనము ఉండేది, అమలు అనంతరం వేత నాలలో తేడాలు రావడం వలన G.O.Ms.No. 11 అమలుకు నోచుకోనివారు 11 యూనివర్సిచేస్తున్నప్పటి 450 కాంట్రాక్ట్ అద్యాపకులు మళ్లీ ఉద్యమ బాట పట్టారు. ఒకే రకమైన విధినిర్వహణ చేస్తున్నప్పటికీ జీతాలలో మాత్రం తేడాలు చూపుతున్నారు.
ఇక్కడ రెగ్యులర్ కోర్స్,సెల్ఫ్ ఫైనాన్స్ కోర్స్ అనే విభజన రేఖను సృష్టించి సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులను విస్మరించారు. ఇదే విషయాన్ని గౌరవ మంత్రివర్యులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి,ITశాఖమంత్రివర్యులు కేటీఆర్‌కి,ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకి, గౌరవ రైతు బంధు ఛైర్మెన్‌వీmlc పల్లా రాజేశ్వర్ రెడ్డికి, విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కి చాలాసార్లు విన్నవించుకోవడం జరిగింది. ఉన్నత విద్యామండలి ఛైర్మన్, ఎడ్యుకేషన్ సెక్రటరీకి సమస్యను తెలియపరచడం జరిగింది. సెట్, నెట్,పీహెచ్డీ అర్హతలు ఉండి చేస్తున్న పనికి కనీస మూల వేతనం కూడా లభించడంలేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంట్రాక్ట్ జూనియర్ లెక్చరర్స్, కాంట్రాక్ట్ డిగ్రీ లెక్చరర్స్, కాంట్రాక్ట్ పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు జీతాల పెంపు చేయడం జరిగింది. శాశ్వత ఉద్యోగుల మూల వేతనాన్ని వీరికి అందించడం జరుగుతుంది. కానీ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అధ్యాపకులకు మాత్రం రాష్ట్రం ఏర్పడి 7 సంవత్సరాలు అయినప్పటికీ పాత జీతాలనే కొనసాగిస్తున్నారు.జారీ చేసిన జీవో అందరికీ వర్తించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి ఎన్నో సార్లు విన్నవించుకుంటూ వస్తున్నా కూడా జాప్యం ఎక్కడ జరుగుతుంది, లోపం ఎక్కడ ఉన్నది?
యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల జీతాల పెంపు కొరకై తిరుపతి రావు కమిటీ సిఫారసు మేరకు 75% వేతనాలు పెంచుతూ G.O.Ms.No. 11ను జారీచేసింది.
ఈ GO లొ సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల ప్రస్తావన లేకపోవడంతో ఆయా యూనివర్సిటీ vc లు కేవలం మంజూరు చేయబడిన పోస్ట్ లో ఉన్నవారికి అమలుచేస్తూ, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులను జీతాలు పెరగలేదు. తెలంగాణ రాష్ట్ర అన్ని యూనివర్సిటీస్ లో కలిపి 450 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు ఎన్నో యేళ్లు గా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో బోధిస్తున్నారు. ou లో 127, puలో 56, kuలో 45, mguలో 35, tu లో13, Telugu university22, r.Ambedkar open Universityలో23 మరియు SUలో 6 అకడమిక్ కన్సల్టెంట్స్ etc. యూనివర్సిటీస్ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నారు. కానీ వీరికి G.O.Ms.No. 11 ప్రకారంగా వేతనాలు అందడం లేదు. 2017 లో కాంట్రాక్ట్ : jl లో18000/ నుండి 27000/ కి , pl కీ 21000/ నుండి 31500/ కి మరియు dl కి 21000/ నుండి 31500/ పెంచడం జరిగింది. మళ్ళీ 2018లో jl కి లో27000/ నుండి 37100/ కి ,pl;కీ 31500/ నుండి 40270/ కి మరియు •dlకి 31500/ నుండి 40270/ పెంచడం జరిగింది.యూనివర్శిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులకు G.O .11 అమలవుతున్న వారికి 60000/ జీతాలు వస్తున్నాయి. అదేవిధంగా ప్రస్తుతం పెంచిన PRC తో కాంట్రాక్ట్ jl కి 54000/, pl కి 58000/, DL కీ 58000/. వేతనాలు వస్తున్నాయి. కానీ యూనివర్సిటీ లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు కేవలం 23000/ నుండి 33000/ జీతాలు వస్తున్నాయి. ఇదేరకమైన వ్యత్యాసాన్ని రెగ్యులర్, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్న పార్ట్ టైం కాంట్రాక్ట్ అధ్యాపకుల లో కూడా చూపిస్తూ వారి పరిస్తితి ఇంక అగమ్య గోచరంగా తయారయ్యింది. రెగ్యులర్ కోర్స్ లో పనిచేసే వారికి hour basisలొ ఒకరకమైన వేతనం, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో ఒకరకమైన వేతనం ఇస్తూ సెమిస్టర్ చివరిలో చెల్లిస్తున్నారు. వీరి కుటుంబ పోషణ అంతంత మాత్రమే గడుస్తుంది. యూనివర్సిటీ ల్లో UGCపే స్కేల్ అమలు పరచడం లేదు, అంతేకాకుండా రెగ్యులర్ ఫ్యాకల్టీ కి లభించేటటువంటి పిఎఫ్, హెల్త్ కార్డ్ ఇతరత్రా బెనిఫిట్స్ ఏదైతే ఉన్నాయో అవేవీ వీరికి లభించడంలేదు. ప్రసూతి సెలవులకి వెళ్ళిన మహిళ ఫ్యాకల్టీ కి సెలవుల్లో ఉన్న సమయాలలో ఎలాంటి వేతనాలు అందటం లేదు మరియు పురుషులకి పితృత్వ సెలవులు ఇవ్వటం లేదు. ఈ కోవిడ్-19 కారణంగా కరొన బారినపడి అకడమిక్ కన్సల్టెంట్స్ లో నలుగురు చనిపోయారు, వారికి ఎలాంటి ఆర్ధిక సహాయం ఇటు యూనివర్సిటీ నుండి కానీ ప్రభుత్వం నుండికాని లభించక పోవటం మూలాన వారి కుటుంబాలు దీన స్థితిలొ ఉన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో5048మందికాంట్రాక్ట్ JL, PL, DL కీ వేతనాలు పెంచిన ప్రభుత్వం మాకు కూడా పెంచాలని కోరుతున్నాము. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు లభిస్తుంది? మా శ్రమని వాడుకుంటూ చదువుకున్న బానిసలుగా బతకమంటారా? కనీస మూల వేతనం కూడా చెల్లించకుండా బట్టకి పొట్టకి పని చేయించుకుంటూ సమాన పనికి సమాన వేతనం అని కోర్టు ఇచ్చిన తీర్పును అమలుపరచకుండా ఈ కాలయాపన ఎందుకు?ప్రశ్నిస్తే విధుల నుండి తొలగిస్తామని భయబ్రాంతులకు గురి చేసి ఉద్యోగ అభద్రత భావం పెట్టీ వేదనలకి గురి చేయడం ఎందుకు?, చేస్తున్న పని ఒకటే అయినప్పుడు శాశ్వత ఉద్యోగులు కాంట్రాక్ట్ ఉద్యోగులు అంటూ ఈ తేడాలెందుకు?. ఈ కాంట్రాక్టు అధ్యాపకులలో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేసేవారు, రెగ్యులర్ కోర్సులో పని చేసేవారు అని విభజన రేఖ తీసుకువచ్చారు. సెట్, నెట్, పీహెచ్డీ లు ఉండి కూడా భోధన పట్ల ఉన్న అభిమానంతో పనిచేస్తున్నారు కానీ ఆర్థిక సమస్యల కూపంలోకి నెట్టివేయబడుతున్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూడా వాటినిబేఖాతరు చేస్తూ యూనివర్సిటీ అధికార యంత్రాంగం కనీస మూల వేతనాన్ని అందించడం లేదు. విడుదల చేసిన G.O.Ms.No. .11 ను ఆచరణలో అనుసరించాల్సిన అవసరంలేదు అనే పద్ధతిలో యూనివర్సిటీ యంత్రాంగంవ్యవహరిస్తున్నది దీనికి స్పందన గా ప్రభుత్వమే చొరవ చూపాలి.భావి భారత నిర్మాణానికి పునాదులు వేసి భవిష్యత్తును తీర్చి దిద్దే అధ్యాపకులు పెరుగుతున్న నిత్యావసర ధరలు,వైద్య ఖర్చులు,కుటుంబ పోషణ పిల్లల విద్య ఖర్చుల వ్యయ భారాల వలన తీవ్ర వొత్తిడి, ఆర్థిక సమస్యలతో నిత్యం మనో వేదనకి గురవుతూ సతమతమవుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకులు అర్ధాంతరంగా జీవితాన్ని ముగియకముందే ప్రభుత్వాలు కన్ను తెరిస్తే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల్లో పనిచేస్తున్నఎందరోకాంట్రాక్ట్అధ్యాపకుల జీవితాలే కాకుండా విద్యార్థి లోకానికి వెలుగులు విరాజిల్లుతాయి.
– మట్టిపెల్లి రామచంద్రు, TS-UCTA అధ్యక్షులు
(తెలంగాణస్టేట్యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్), అకడమిక్ కన్సల్టెంట్(కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్), మహాత్మా గాంధి యూనివర్సిటీ, నల్గొండ, 9618652554