అందుబాటులోకి ఐటి టవర్ సెంటర్
లాంఛనంగా ప్రారంభించిన మంత్రి కెటిఆర్
ప్రజాతంత్ర, కరీంనగర్ : కరీంనగర్ సెంటిమెంట్ ఎప్పుడూ బలంగా పనిచేస్తోందని, ఇక్కడ చేపట్టిన ఏ పనయినా విజయవంతం అవుతోందని మంత్రి కెటిఆర్ అన్నారు. కరీంనగర్ పట్టణానికి నిరంతర తాగునీటిని అందించే మిషన్ భగీరథ పథకానికి, ఐటి సెంటర్‌కు కెటిఆర్ ప్రారంభోత్వం చేశారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పెరుగుతున్న జనాభా అవసరాల మేరకు 30ఏళ్ల ప్రణాళికతో రిజర్వాయర్ నిర్మాణం చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. శాతవాహన వర్సిటీలో మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను మంగళవారం మంత్రి ప్రారంభించారు. కాళేశ్వరం నీటితో ఎల్ఎండి,అప్పర్ మానేరులో నీరు సమృద్దిగా అందుబాటులో ఉంటుందన్నారు. తాగు, సాగునీరుకు ఇక్కట్లు లేకుండా చేశామన్నారు. తెలంగాణా కోటి ఎకరాల మాగాణం లక్ష్యంగా సిఎం కెసిఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో గ్రాణ ప్రజల జీవితాలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. కరీంనగర్లో ఏ పని ప్రారంభించినా తప్పకుండా విజయవంత మవుతుందన్నారు. తాగు, సాగునీరు, విద్యుత్ ఇబ్బందులను తక్కువకాలంలో అధిగమించామన్నారు. కేవలం మూడేళ్ల వ్యవధిలోనే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. కరీంనగర్ పట్టణ ప్రజలకు ఇక నుంచి ప్రతి రోజు మంచి నీరు అందనుందని కేటీఆర్ అన్నారు. కరీంనగర్ పట్టణంలో ప్రతి రోజు మంచి నీరు అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందని కేటీఆర్ తెలిపారు. కరీంనగర్లో ఏ కార్యక్రమం చేపట్టిన విజయవంతం అవుతుంది. ఏ పని ప్రారంభించినా కరీంనగర్లో నాంది పలకడం సంప్రదాయంగా మారిందన్నారు.
ఇక్కడి నుంచే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు అభివృద్ధి పనుల విస్తరణ జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో 247 వాటర్ సైప్లె కూడా కరీంనగర్ నుంచే ప్రారంభం కావాలన్నారు. 30 ఏళ్ల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రమంత ఈ పథకం ఆదర్శం కావాలని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో దీర్ఘకాలిక ప్రణాళికలతో కీలక రంగాలపై దృష్టి పెట్టామని తెలిపారు. ఒక్కో పని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నామని ఆయన చెప్పారు. అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. భవిష్యత్ తరాలు బాగుండాలని 230 కోట్ల మొక్కలు నాటాలనేది లక్ష్యం. త్వరలో తీగల వంతెనను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తాం. కరీంనగర్‌కు కొత్త శోభను తీసుకువచ్చేలా జంక్షన్ రూపొందించాలన్నారు. టీహబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్లో ఏర్పాటు కాబోతోంది. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడిన వారికి ఇది మంచి అవకాశం. దేశానికి ధాన్య భాండాగారంగా తెలంగాణ మారిందని కేటీఆర్ వివరించారు. బీడు భూములకు గోదావరి, కృష్ణా జలాలను పారిస్తున్నామని పేర్కొన్నారు. అందరికీ 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇరిగేషన్ శాఖను జలవనరు శాఖగా మార్చామని మంత్రి తెలిపారు. సాగు, తాగు నీరు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు.
తెల్లరేషన్ కార్డు ఉన్నవారికి రూ. 1కే నల్లా కనెక్షన్ ఇస్తామన్నారు. కరీంనగర్ జనసాంద్రత ప్రకారం.. అర్బన్ లంగ్స్ ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. రాబోయే నెల రోజుల్లో కేబుల్ బ్రిడ్జి పూర్తి చేసి సీఎం కేసీఆర్ చేతుల దుగా ప్రారంభిస్తామన్నారు. కరీంనగర్‌కు కొత్త అందాన్ని తెచ్చే అలుగునూరు చౌరస్తాను సుందరమైన జంక్షన్‌గా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్‌కు పరిమితమైన ఐటీ ఇప్పుడు కరీంనగర్ జిల్లాకు విస్తరించింది. కరీంనగర్లో నైపుణ్య శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. టీ హబ్ ప్రాంతీయ కేంద్రం కరీంనగర్ జిల్లాలో ఏర్పాటు కాబోతోందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు ఇతర దేశాల్లో స్థిరపడ్డ కరీంనగర్ వాసులు సహకరించాలని మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ మానేరు తీరంలో మొక్కలు నాటారు. ఇక్కడ పుట్టడం అదృష్టం అన్న గంగుల కేసీఆర్ పుట్టిన గడ్డ ద తామందరం పుట్టడం అదృష్టమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. మంగళవారం ప్రతిరోజూ నీటి సరఫరాను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి గంగుల మాట్లాడుతూ కేసీఆర్ కడుపున కేటీఆర్ పుట్టడం ఒక వరమని… కేటీఆర్ బర్త్ డే కానుకగా కరీంనగర్‌కు తాగునీరు వచ్చిందని తెలిపారు. గత పాలకులు కరీంనగర్‌ను పట్టించుకోలేదని విమర్శించారు. కరీంనగర్ చిరకాల వాంఛ ప్రతిరోజూ తాగునీరని..ఇచ్చిన హాని నిలబెట్టుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు.