వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

జగిత్యాల అభివృద్ధికి నిరంతర కృషి పాలకవర్గంతో మంత్రి కెటిఆర్‌

January 30, 2020

“మంత్రి కేటిఆర్‌ను కలిసిన జగిత్యాల ఎమ్మెల్యే, మున్సిపల్‌ ‌నూతన కార్యవర్గం, రాష్ట్ర మున్సిపల్‌ ‌మంత్రి కేటిఆర్‌ను కలిసిన మంత్రి ఈశ్వర్‌, ‌ధర్మపురి నాయకులు”

Telangana State Social Welfare Minister Koppula Ishwar

జగిత్యాల పట్టణాభివృద్దికి తనవంతు సహకారం నిరంతరం ఉంటుందని ఇదివరకు ప్రకటించిన విధంగానే నిధుల మంజూరిలో ఎలాంటి వివక్షలేదని మున్సిపల్‌ ‌శాఖ మంత్రి కేటిఆర్‌ను కలిసిన జగిత్యాల మున్సిపల్‌ ‌చైర్మన్‌ ‌బోగశ్రావణితో కూడిన కౌన్సిల్‌ ‌బృందంతో అన్నారు. బుధవారం జగిత్యాల పురపాలికలో గెలిచిన టిఆర్‌ఎస్‌ ‌కౌన్సిలర్లు, చైర్మన్‌ ‌శ్రావణిలు సంయుక్తంగా హైదరాబా ద్‌ ‌వెళ్ళి మంత్రి కేటిఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్బంగా మంత్రి కేటిఆర్‌ ‌నూతన పాలకవర్గాన్ని అభినందించారు. ఆనంతరం అయన మాట్లాడుతూ కొత్తగా జగిత్యాల పురపాలికపై తెరాస పాలకవర్గం ఏర్పడిందని భాద్యతగా, అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తూ చిరకాలం పట్టణ ప్రజల అధరాబిమానాలతో కొనసాగాలన్నారు. ఆలాగే తనవంతుగా జగిత్యాల పట్టణాభివృద్ది కోసం నిధుల కేటాయింపు ఉంటుందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ‌సహాకారంతో పట్టణాభివృద్ది ని చేపట్టాలని చెప్పారు. ఈకార్యక్రమములో నూతనంగా గెలుపొందిన కౌన్సిలర్లు ఉన్నారు.

 

 

Continuous contribution to the development of jagityala Minister KTR1నృసింహుని దయతో ధర్మపురి‘పుర’ అభివృద్ధికి కృషి చేయాలి: కేటీఆర్‌
ధర్మపురి: నూతనంగా ఏర్పడిన ధర్మపురి మున్సిపల్‌ ‌పీఠాన్ని పుర ప్రజలు తెరాసకు అందించడం గర్వంగా ఉందని, ధర్మపురి నృసింహుని దయతో రాబోయే రోజుల్లో ధర్మపురి పురోభివృద్ధి తో రూపురేఖలు మారబోతున్నాయని తెలంగాణ రాష్ట్ర మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆధ్వర్యంలో ధర్మపురి నూతన మున్సిపల్‌ ‌చైర్మన్‌ , ‌తెరాస నాయకులు హైదరాబాద్‌ ‌లోని తెలంగాణ భవన్‌ ‌లో మర్యాద పూర్వకంగా కలసి పూలమొక్కలు బహుకరించి స్వామి వారి చిత్రపటా న్ని శేష వస్త్రాన్ని ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ ధర్మపురి ఎన్నికల్లో ప్రజలు అభివృద్ధికి పట్టం కట్టారని,ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నూతన పాలకవర్గం ధర్మపురి అభివృద్ధికి కృషి చేయాలని, మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ‌సహకారంతో ధర్మపురి ని టెంపుల్‌ ‌సిటీ అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌కృషి చేస్తు న్నారని, ఇప్పటికే ధర్మపురిలో పలు అభివృద్ధి కార్యక్ర మాలు ప్రగతి దశలో ఉన్నాయని రానున్న రోజుల్లో ధర్మపురి టెంపుల్‌ ‌సిటీగా మారబోతుందని, టెంపుల్‌ ‌సిటీ గా అభివృద్ది చేయడానికి 100 కోట్లు, నూతన మున్సిపల్‌ ఆవిర్భావంతో 25, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌ప్రత్యేకించి 10 కోట్లు కేటాయించారని రానున్న రోజుల్లో ధర్మపురి రూపురేఖలు మారతాయని, మున్సిపల్‌ ‌శాఖ మంత్రిగా తన సహాయ సహకారాలు ఎల్లప్పుడు ఉంటాయని, అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపిస్తే నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి నరసయ్య, ఎండి ఆసిఫ్‌, ‌పురాణపు సాంబు ,అనంతుల లక్ష్మణ్‌ ,‌మృతి శ్రీనివాస్‌, ‌బత్తిని ఇంద్ర కరణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Tags: Dharmapuri Municipal, Continuous contribution,development, jagityala, Minister KTR