Take a fresh look at your lifestyle.

రెడ్‌జోన్లలో కొనసాగనున్న ఆంక్షలు

అమరావతి,మే 21 :  ఎపిలో లాక్‌ ‌డౌన్‌ 4 అమలు జరుగుతున్నది. మే 31వతేదీ వరకు లాక్‌ ‌డౌన్‌ అమలులో ఉండబోతున్నది. అయితే, ఈ లాక్‌ ‌డౌన్‌ ‌లో అనేక వాటికి మినహాయింపులు ఇచ్చారు.  జనసమూహాలు ఉండే ప్రాంతాలు, రద్దీ ఎక్కువగా ఉండే వాటిని తప్పించి మిగతా వాటిని ఓపెన్‌ ‌చేయబోతున్నారు.  ఇక ఆంధప్రదేశ్‌ ‌లోని 13 జిల్లాల్లో అక్కడ ఉన్న కరోనా కేసులను అనుసరించి రేజ్‌ ‌జోన్‌లను ఏరియాలను ఏర్పాటు చేశారు. ఇందులో ఆయా జిల్లాలల్లో రెడ్‌జోన్‌ ‌ప్రాంతాలను ప్రకటించారు.

పశ్చిమ గోదావరి : గోపాలపురం, పోలవరం, టి. నరసాపురం, కొవ్వూరు, చాగల్లు, నిడదవోలు, తాడేపల్లిగూడెం, ఉడ్రాజవరం, పెనుగొండ, భీమడోలు, ఏలూరు, ఆకివీడు, ఉండి, భీమవరం, నరసాపురం.
తూర్పు గోదావరి : సామర్లకోట, పెద్దాపురం, కొత్తపేట, రాజమండ్రి అర్బన్‌, ‌పిఠాపురం, శంఖవరం.

 విశాఖపట్నం: పెదగంట్యాడ, నర్సీపట్నం, కసీంకోట, పెందుర్తి, విశాఖపట్నం అర్బన్‌, ‌పద్మనాభం. విజయనగరం: బొందప్లలె, పూసపాటిరేగ, కొమరాడ, బలిజిపేట.
గుంటూరు: మాచర్ల, దాచేపల్లి, అచ్చెంపేట, నరసరావుపేట, గుంటూరు టౌన్‌,‌తాడేపల్లి, మంగళగిరి.
కృష్ణాజిల్లా: జగ్గయ్యపేట, విజయవాడ రూరల్‌, ‌విజయవాడ అర్బన్‌, ‌పెనమలూరు, మచిలీపట్టణం, నూజివీడు, ముసునూరు.
కర్నూలు జిల్లా: ఆదోని, చిప్పగిరి, ఆస్పరి, తుగ్గలి, ఆత్మకూరు, కోడుమూరు, ఆత్మకూరు, నందికొట్కూరు, పాణ్యం, బనగానపల్లి, నంద్యాల, గడివేముల, చాగలమర్రి, పాములపాడు.
కడప జిల్లా: మైదుకూరు, పొద్దుటూరు, యర్రగుంట్ల, కడప టౌన్‌, ‌బద్వేల్‌, ‌పులివెందుల, కమలాపురం,
నెల్లూరు జిల్లా: నెల్లూరు టౌన్‌, ‌నాయుడు పేట, వాకాడు, సూళ్లూరు పేట, తడ.
ప్రకాశం జిల్లా: కారంచేడు, చీరాల, ఒంగోలు టౌన్‌, ‌గుడ్లూరు. అనంతపురం: హిందూపూర్‌, ‌కళ్యాణదుర్గం, అనంతపురం టౌన్‌.
‌చిత్తూరు: శ్రీకాళహస్తి, తిరుపతి అర్బన్‌, ‌రేణిగుంట, వరదాయపాలెం, సత్యవేడు, నాగలాపురం, నగరి, పుత్తూరు, వెంకటగిరికోటలు ఉన్నాయి.
అయితే పట్టణ ప్రాంతాల్లో దుకాణాలు, వ్యాపార సంస్థల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. మే 31 వరకు ప్రకటించిన నాలుగో విడత లాక్‌డౌన్‌లో జిల్లా కలెక్టర్లు కంటైన్‌మెంట్‌ ‌జోన్లుగా ప్రకటించిన ప్రాంతాల్లో మినహా ఇతర పట్టణాల్లో ఎంపిక చేసిన దుకాణాలు,వ్యాపార సంస్థలు తెరిచేందుకు అనుమతిచ్చింది. లెక్టర్లు, ఎస్పీలు, మున్సిపల్‌ ‌కమిషనర్లు తమ పరిధిలో పరిస్థితిని సక్షించి దుకాణాలు తెరిచేందుకు కార్యాచరణ చేపట్టాలని పేర్కొంది. వాటిని పురపాలక, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, ‌పరిశ్రమలు, మార్కెటింగ్‌, ‌మత్స్య, రవాణా శాఖలు పాటించాలని చెప్పింది. పట్టణ ప్రాంతాల్లో అనుమతించిన దుకాణాలను ఉదయం 7 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు తెరవొచ్చు. మందుల దుకాణాలకు మరింత సమయం అనుమతిస్తారు.  దుకాణాల వద్ద భౌతిక దూరం తప్పనిసరిగా పాటించాలి. ఆ బాధ్యత దుకాణ యజమానులదే. అందుకోసం దుకాణాల లోపల, బయట వృత్తాకార మార్కింగులు వేయాలి. దుకాణాల లోపల గరిష్టంగా ఐదు మందికి మించి అనుమతి లేదు. అక్కడ పనిచేసేవారు, కొనుగోలుదారులు కచ్చితంగా మాస్కులు ధరించాలి. దుకాణాలను రోజు తెరిచే ముందు ప్రవేశ ద్వారాలు, బయటకు వేళ్లే ద్వారాలు, పార్కింగ్‌ ‌ప్రదేశాలు, లిఫ్టులలో శానిటేషన్‌ ‌చేయాలి. తలుపుల హ్యాండిళ్లు, రైలింగులు, లిప్ట్ ‌బటన్లు మొదలైనవి ఎర్ర రంగుతో మార్కింగ్‌ ‌చేసి తరచూ శానిటేషన్‌ ‌చేయాలి.దుకాణాల్లో పనిచేసే సిబ్బంది అందరూ తమ మొబైల్‌ ‌ఫోన్లలో ఆరోగ్యసేతు యాప్‌ను డౌన్‌లోడ్‌ ‌చేసుకోవాలి. వృద్ధులు,చిన్న పిల్లలను వీలైనంతవరకూ దుకాణాల్లోకి అనుమతించకూడదు. ఉన్నంత వరకు దుకాణాల్లోకి ప్రవేశించేందుకు, బయటకు వచ్చేందుకు ద్వారాలు వేర్వేరుగా ఉండాలి. ఎక్కువ బిల్లింగ్‌ ‌కౌంటర్లు ఏర్పాటు చేయాలి. వీలైనంతవరకు నగదురహిత లావాదేవీలకే ప్రాధాన్యమివ్వాలి.

Leave a Reply