- రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్
- అమెరికా ఫెడ్ ప్రభావమేనని అంచనా
ముంబై, సెప్టెంబర్ 26 : రూపాయి పతనం కొనసాగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా పడిపోతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ పతనం ఇంకా కొనసాగుతూనే ఉంది. అమెరికా రేట్ల పెంపుతో ఊపందుకున్న పతనం ఈక్విటీ మార్కెట్లలోని బలహీనతలతో కొనసాగుతోంది. సోమవారం రూ.81.52 వద్ద ప్రారంభమైన రూపాయి క్రితం సెషన్ ముగింపుపై రూ.80.99తో పోలిస్తే 0.64 శాతం పతనమైంది. అయితే గత తొమ్మిది సెషన్‌లలో మొత్తం ఎనిమిది సెషన్‌లలో రూపాయి పతనం కొనసాగింది. 2.28 శాతం మేర నష్టపోయింది. ఉదయం సమయంలో డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.56 వద్ద కనిష్ఠాన్ని నమోదు చేసింది. అమెరికన్ కరెన్సీ బలపడటం, ఇన్వెస్టర్లలో రిస్క్ విముఖత స్థానిక యూనిట్‌పై తీవ్ర ప్రభావం చూపడంతో సోమవారం ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 43 పైసలు క్షీణించి ఆల్ టైమ్ కనిష్ట స్థాయి 81.52 వద్దకు చేరుకుంది. అంతేకాకుండా ఉక్రెయిన్‌లో వివాదాల కారణంగా భౌగోళిక రాజకీయ ప్రమాదాలు పెరగడం, దేశీయ ఈక్విటీలలో ప్రతికూల ధోరణి, గణనీయమైన విదేశీ నిధుల ప్రవాహం పెట్టుబడిదారుల అతృతను తగ్గించాయని ఫారెక్స్ వ్యాపారులు తెలిపారు. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారకం వద్ద, రూపాయి గ్రీన్‌బ్యాక్‌తో పోలిస్తే 81.47 వద్ద ప్రారంభమైంది.
ఆపై 81.52కి పడిపోయింది. దాని మునుపటి ముగింపు కంటే 43 పైసల పతనం నమోదు చేసింది. శుక్రవారం రూపాయి 30 పైసలు క్షీణించి ఙా డాలర్‌తో పోలిస్తే తాజా లైఫ్‌టైమ్ కనిష్ట స్థాయి 81.09 వద్ద ముగిసింది. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు యుఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను దూకుడుగా పెంచుతుందని ఇన్వెస్టర్లు అంచనా వేయడంతో భారత రూపాయి బలహీనంగా ఉండవచ్చని నిపుణులు తెలిపారు. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు శుక్రవారం క్యాపిటల్ మార్కెట్‌లో నికర విక్రయదారులుగా మారారు. ఎందుకంటే ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం వారు రూ. 2,899.68 కోట్ల విలువైన షేర్లను ఆఫ్‌లోడ్ చేశారు. కాగా, సెప్టెంబర్ 16తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ నిల్వలు 5.219 బిలియన్ డాలర్లు క్షీణించి 545.652 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఆర్బీఐ కరెన్సీ మరింత బలహీనపడకుండా నిరోధించడానికి చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నారు. ఇంతలో ఆరు కరెన్సీలకు వ్యతిరేకంగా గ్రీన్‌బ్యాక్ బలాన్ని అంచనా వేసే డాలర్ ఇండెక్స్ 0.67 శాతం పెరిగి 113.94కి చేరుకుంది.
గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 0.58 శాతం తగ్గి ఙాఆ 85.65కి చేరుకుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్‌లో 30-షేర్ బిఎస్‌ఇ సెన్సెక్స్ 797.73 పాయింట్లు లేదా 1.37 శాతం క్షీణించి 57,301.19 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఇ నిప్టీ 260.80 పాయింట్లు లేదా 1.51 శాతం పడిపోయి 17,066.55 పాయింట్లకు చేరుకుంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ గతవారం కీలక వడ్డీరేట్లను 75 బేసిస్ పాయింట్లు పెంచిన సంగతి తెలిసిందే. అయితే రానున్న రోజుల్లో రేట్ల పెంపు మరింత వేగంగా ఉంటుందని ఫెడ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ వెల్లడించారు. అలాగే ద్రవ్యోల్బణం తప్పదేమోనని హెచ్చరించారు. దీంతో ఇతర దేశాల కరెన్సీలతో పోలిస్తే డాలర్ రోజురోజుకీ బలపడుతోంది. ఫలితంగా రూపాయికి డిమాండ్ తగ్గి మారకపు విలువ పడిపోతోంది. ప్రస్తుతం మదుపర్లు ఆర్‌బీఐ పరపతి విధాన సక్ష నిర్ణయాలపై దృష్టి సారించారు. రేపోరేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 16తో ముగిసిన వారానికి దేశ ఫారెక్స్ నిల్వలు 5.219 బిలియన్ డాలర్లు క్షీణించి 545.652 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.