Take a fresh look at your lifestyle.

కలికాలపు కబ్జాలు

నిన్నటి ‘కల్చర్‌’‌ను కబ్జా చేశారు
అతివలపై అత్యాచారం చేస్తున్నారు
నేటి ‘వల్చర్‌’ ‌నరరూప రాక్షస మృగాళ్ళు !

నైతిక విలువల్ని కబ్జా చేసేందుకు
అరచేతిలో వెలసిన స్మార్ట్ ‌వైకుంఠం
చిమ్ముతోంది అశ్లీల నీలి విషాన్ని యువతపై !

కబ్జాలు చేసే భూబకాసురులు
బినామీ ఆస్థుల సునామీలు
బంధాలు బంధుత్వాలన్నీ ఎండమావులే !

చట్టాన్ని చుట్టంలా కబ్జా చేస్తూ
అవినీతికి పట్టాభిషేకం చేసే
ఎంత సంపన్నులైనా  కడుహీనులే !

స్వేచ్ఛను కబ్జా చేసింది కొరోనా
దూరాచారాలు, మాస్కులు తెచ్చి
విశ్వమహమ్మారి గృహనిర్భందం తెచ్చె !

యువత మదిని కబ్జా చేసి
ఒంటరి మరమనిషిని చేస్తోంది
అసాంఘీక ఆంటీ సో’సెల్‌’ ‌మీడియా !

నిస్వార్థాన్ని కబ్జా చేసి
పరుల ధనంపై కన్నేసి
‘పరువు’ను త్యాగం చేసెను నేటి మనిషి !

వ్యక్తి జ్ఞాపకశక్తిని కబ్జా చేసి
తనలో జ్ఞానాన్ని దాచుకున్న గూగులమ్మ
అమ్మలా వితరణ చేసే అడిగిందే తడవుగా !

dr burra madhsudhan
డా: బుర్ర మధుసూదన్‌ ‌రెడ్డి,కరీంనగర్‌, 9949700037

 

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply