Take a fresh look at your lifestyle.

బ్యాంకు మేనేజర్లు ఇబ్బందిపెడితే యంపిడిఓలను సంప్రదించండి లబ్దిదారులను కోరిన ఐటిడిఏ పిఓ

రూరల్‌ ‌ట్రాన్స్‌లేషన్‌ ‌పథకం గిరివికాసం ట్రైకార్‌ ‌పధకం క్రింద దరఖాస్తులు చేసుకున్న లబ్దిదారులకు సంబంధించిన యుసిలు గ్రేడింగ్‌ ‌చేసే విషయము సంబంధిత బ్యాంకు మేనేజర్లు ఏమైనా ఇబ్బందలు కలిగిస్తే సంబంధిత యంపిడిఓల ఏపియంలు వెంటనే మాకు సమాచారం అందించాలని ఇబ్బందులు సృష్టించే బ్యాంకు మేనేజర్లు పై శాఖా  పరమైన చర్యలు తీసుకుంటామని ఐటిడిఏ పిఓ గౌతమ్‌ ‌పొట్రూ హెచ్చరించారు. గురువారం నాడు ఐటిడిఏ సమావేశం హలు ఉమ్మడి ఖమ్మం జిల్లా యంపిడిఓలతో ,ఏపియంలతో, ఏపిడిఓలతో మరియు డిడిఓలతో బ్యాంకు మేనేజర్లుతో వీడియో కాన్షరెన్సు ద్వారా సపమీక్షించారు. ఈ సందర్బంగా పిఓ మాట్లాడుతూ ట్రైకార్‌ ‌కు సంబంధించిన లబ్దిదారుల జాబితా విషయంలో సంబంధిత• ఏపియంలతో కోఆర్డినేట్‌ ‌చేసి బ్యాంకు మేనేజర్‌లకు  గ్రౌండ్‌ అయ్యేల చొరపవచూపాలని అన్నారు.

ప్రతీ లబ్దిదారుని డేటా బ్యాంకు మేనేజర్‌ ‌దగ్గర ఉండాలని అందుకు ఏపియంలు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. రూరల్‌ ‌ట్రాన్స్ ‌కోపరేషన్‌ ‌పథకం క్రింద ద•ఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు సంబంధించిన పిన్‌ అకౌంట్‌ ‌మేనేజర్‌ ‌ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని అన్నారు. కొత్తగా ఎవరైన లబ్దిదారులు ద•ఖాస్తు చేసుకుంటే యంపిడిఓలతో ఏపియంలతో బ్యాంకు వారికి అందించాలన్నారు. గిరివికాసం సంబంధించిన అంశాలు ఏపియంకు తెలియాలని, కరెంటు, బోరు మోటారుకు సంబంధించిన దరఖాస్తులు అర్హులైనవి, కానివి వేరువేరుగా తీసుకుని వెంటనే డిఆర్‌డిఓకు కార్యాలయానికి పంపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ ‌సురేష్‌ ‌బాబు, విభాగం సిబ్బంది అపర్ణ ,సిసి పూర్ణోదయకు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!