Take a fresh look at your lifestyle.

త్వరలో టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి : బొత్స

అమరావతి,జూలై 28 : త్వరలో  2.62 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తామని రాష్ట్ర మున్సిపల్‌ ‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. అదే విధంగా, మౌళిక వసతుల కల్పన పనులకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుందని పేర్కొన్నారు.టిడ్కో, మెప్మా, బ్యాంక్‌ ‌సమన్వయకర్తలతో బుధవారం టెలికాన్ఫరెన్స్ ‌సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లబ్దిదారులకు ఏలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా, పనుల పురోగతిపై ప్రతివారం సక్షను నిర్వహిస్తామని తెలియజేశారు. లబ్దిదారులకు రుణాల మంజూరు చేసే పక్రియపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని అధికారులకు సూచించారు.

Leave a Reply