Take a fresh look at your lifestyle.

తిరుమల, యాదాద్రి తరహాలో…

శ్రీ కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో కాటేజీల నిర్మాణం చేపట్టాలి: మంత్రి హరీష్‌రావు 
తిరుమల, యాదాద్రి తరహాలో …శ్రీ కొమురవెల్లి మల్లన్న దేవస్థానంలో కాటేజీల నిర్మాణం చేపట్టాలనీ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి  తన్నీరు హరీష్‌ ‌రావు దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్ధిపేట జిల్లాలోని జగదేవ్‌పూర్‌ ‌మండలంలో గల తీగుల్‌నర్సాపూర్‌  ‌శ్రీ కొండ పోచమ్మ దేవస్థానం సమావేశ మందిరంలో శ్రీ కొమురవెల్లి మల్లన్న, శ్రీ కొండ పోచమ్మ ఆలయాల అభివృద్ధిపై జిల్లా కలెక్టర్‌ ‌వెంకట్రామ రెడ్డి, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర మంత్రులు  తన్నీరు హరీష్‌ ‌రావు,  తలసాని శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ‌సమీక్ష నిర్వహించారు.

శ్రీ కొమురవెల్లి మల్లన్నను దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తున్నందుకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులూ తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. శ్రీ కొమురవెల్లి మల్లన్న దేవస్థానం వద్ద కాటేజీల నిర్మాణాలక• దాతలు ముందుకు వస్తున్నందున …. కాటేజీల నిర్మాణంకు స్థలంను గుర్తించాలని రెవెన్యూ, ఆలయ అధికారులను అదేశించారు. శ్రీ కొమురవెల్లి మల్లన్న కొండపైన వాస్తు ప్రకారం వేద పండితులు, స్థపతుల సమక్షంలో కొండపైన లెవెలింగ్‌ ‌పూర్తి చేసి, లే అవుట్‌ ‌పనులను వచ్చే 10 రోజుల్లో సిద్ధం చేయాలనీ మంత్రి జిల్లా కలెక్టర్‌కు సూచించారు. కొండపైకి రోడ్డు నిర్మాణంకు ఒక కోటి 90 లక్షల రూపాయలు ఇది వరకే ప్రభుత్వం మంజూరు చేసిందనీ,  ఆ నిధులతో కొంత మేర రోడ్డు నిర్మాణం చేపట్టామని పంచాయితీరాజ్‌ ‌పర్యవేక్షక ఇంజనీర్‌ ‌కనకరత్నం మంత్రికి తెలిపారు.

రోడ్డుతో పాటు రివిట్‌ ‌మెంట్‌ ‌పనుల పూర్తికి రూ.3 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని ఎస్‌ఈకి మంత్రికి తెలిపారు. స్పందించిన మంత్రి రోడ్డు, రివిట్‌ ‌మెంట్‌ ‌పనుల పూర్తికి 3 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. వచ్చే రెండు నెలల్లో రోడ్డు, రివిట్‌ ‌మెంట్‌ ‌పనులను పూర్తి చేయాలనీ మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే ఆలయ వెండి దర్వాజ నిర్మాణంకు అనుమతి ఇచ్చిన తీవ్ర జాప్యంపై మంత్రి ఆలయ అధికారులపై ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెండి దర్వాజను నెల రోజులలో పూర్తి చేయాలని అదేశించారు. అలాగే కొండపైన ఎల్లమ్మ గుడి నిర్మాణంకు భూమి పూజ చేసి రెండేండ్లవుతున్న పనులు నెమ్మదిగా జరగడంపై మంత్రి అధికారులను ప్రశ్నించారు. ఈ నెలాఖరులోగా ఎల్లమ్మ గుడిని ప్రారంభానికి సిద్ధం చేయాలనీ ఆదేశించారు.

అలాగే కొమురవెల్లిలో నిర్మాణంలో ఉన్న కొత్త బస్టాండ్‌ ‌పనులను వేగవంతం చేయాలన్నారు.  శ్రీ కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా ప్రతి రోజూ 500 మందికి మిగతా రోజుల్లో 100 మందికి అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. భద్రకాళి, వీరభద్ర స్వామి ఆలయ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్నారు. పోచమ్మ అమ్మ వారి టెంపుల్‌కు కాంపౌండ్‌ ‌వాల్‌ ‌నిర్మించాలన్నారు. రాతిగీరల మండపం పనులు తొందరగా పూర్తి చేయాలని సూచించారు. శానిటేషన్‌, ‌త్రాగునీటి సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ తక్షణ పరిష్కారం చూపాలన్నారు.

Leave a Reply