Take a fresh look at your lifestyle.

అనాధలకి రాజ్యాంగ పరిధిలో ఉండే చట్టాన్ని ఏర్పాటు చేయాలి ..!

ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌ ‌రెడ్డి, ఇతర ప్రముఖులను కలిసిన ‘ఫోర్స్’ ‌బృందం

న్యూ దిల్లీ ,ఆగస్టు 2:అనాథలను అనాథలాగే వదిలేయకుండా వారికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..రాజ్యాంగ పరిధిలో ఉండే చట్టాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ‌తో చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా రెండవ రోజురాజ్యసభ ఎంపీ బండ ప్రకాష్‌ ఆధ్వర్యంలో,భారతదేశపు ఉపరాష్ట్రపతి ముప్పారపు వెంకయ్య నాయుడు ని ‘ఫోర్స్’ ‌ప్రతినిధి బృందం కలిసి అనాథలకు ప్రత్యేక చట్టం తేవాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. సంబంధిత ఇద్దరు మంత్రుల తోటి చర్చించి వెంటనే న్యాయం చేయాలని అని చెప్తా అని ఉపరాష్ట్రపతి హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.. ఇది చాలా న్యాయసమ్మతమైనది, తప్పనిసరిగా న్యాయం చేయాలని, చేస్తామని భరోసా నిచ్చారని తెలిపారు .అంతకు ముందు .. ఎన్‌ ‌సీ పీ సి ఆర్‌ ‌మెంబర్‌ ‌ప్రజ్ఞ పరాండే ని కలిసి ప్రపోసల్‌ ‌డ్రాఫ్ట్ ‌కాపీ ని ప్రతినిధులు అందచేశారు.. ఈ విషయం పట్ల వారు సానుకూలంగా స్పందించి ఇంతకుముందు ఫోర్స్ ‌సంస్థ చేసినటువంటి కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడుతూ తప్పకుండా ఈ పిల్లలకి హక్కులు కల్పించే దిశగా నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అదే విధంగా మహిళ శిశు సంక్షేమ మంత్రిత్వశాఖ మరియు సామాజిక న్యాయం మంత్రిత్వ శాఖలకు కూడా వారి తరుపునుండి వినతిపత్రం అందచేస్థానని తెలియజేసారు. అనాథల హక్కుల సాధనలో తన పూర్తి మద్దతు ఫోర్స్ ‌సభ్యులకి ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అదేవిదంగా ఈరోజు కేరళ ఎంపీ కె. సురేష్‌ ‌ని కూడా కలిసి వినతిపత్రం అందచేయగా వారు కూడా విషయాన్ని అర్థం చేసుకొని తప్పకుండా పార్లమెంటులో ఈ విషయంపై మాట్లాడతానని తెలియజేసారు అని ప్రతినిధులు తెలిపారు.. ప్రధానమంత్రి, సంబంధిత మంత్రులకు మరియు అన్ని పార్టీల పార్లమెంటు సభ్యుల సమన్వయంతో ప్రదానమంత్రి కి ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞాపన చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోర్స్ ‌సంస్థ వ్యవస్థాపకులు గాదె ఇన్నారెడ్డి, రైల్వే యూనియన్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కర్ర యాదవ రెడ్డి, వి ఫర్‌ ‌నీడీ సంస్థ వ్యవస్థాపకులు సామినేని నీరజ రాణి , వంశిధర్‌ ‌గారు, ఫోర్స్ ‌సభ్యులు కమఠం రజిత, పంజుగుల పూజ , కమఠం దీపిక, సిద్ధం విజేత, సిద్ధం శ్వేత, పెద్దమ్మ ప్రియాంక, కమఠం మౌనిక, చీకటి రవళి, గాదె కారుణ్య, గాదె మాధవి, షైక్‌ ‌రేష్మ పాల్గొన్నారు.

అంతకు ముందు ఆదివారం రాజ్య సభ ఎంపీ బండ ప్రకాష్‌ ‌సర్‌ ‌ని కలిసి, ప్రపోజల్‌ ‌డాక్యుమెంట్‌ ఇవ్వడం జరిగింది. ఎంపీ బండ ప్రకాష్‌ ఇం‌తకు ముందే అనాథల హక్కుల ప్రత్యేక చట్టం గురించి పార్లమెంట్‌ ‌లో ప్రస్తావించిన విషయం గుర్తు చేస్తూ .. కోవిడ్‌ ‌నేపథ్యంలో ఆ విషయాన్ని పూర్తిగా చర్చించలేక పోయారు. మళ్ళీ ఇప్పుడు భారత దేశంలో ఉన్న 4 కోట్ల అనాథల ప్రత్యేక చట్టం కోసం మళ్ళీ తన గొంతును పార్లమెంట్లో వినిపిస్తానని మాట ఇవ్వడం జరిగిందాని తెలిపారు. . ఈ సందర్భంగా అందరి కంటే ఎక్కువ అవసరం ఉన్న వీళ్ళకి ఒక చట్టం లేకపోవడం బాధాకరం అని తెలియజేశారు. అనాథల హక్కుల సాధనలో తన పూర్తి మద్దతు ఫోర్స్ ‌సభ్యులకి ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా ప్రకాష్‌ ‌హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు.కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గంగాపురం కిషన్‌ ‌రెడ్డి ని కూడా కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా అనాథ బిడ్డల హక్కుల సాధనకై రిటైర్డ్ ఐ ఏ ఎస్‌ ఆఫీసర్‌ ‌ఛాయ రతన్‌, ‌సీనియర్‌ ‌జడ్జులు, చీ+• సంస్థల ఆధ్వర్యంలో తయారు చేసిన ప్రపోసల్‌ ‌డాక్యుమెంట్‌ ‌మరియు కేంద్రం పరిధిలో ఉన్నటువంటి స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మత్రింత్వ శాఖలకు కూడా తమ విన్నపాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతూ ప్రపోసల్‌ ‌డాక్యుమెంట్‌ ‌కాపీ ఫోర్స్ అం‌దచేసింది. కిషన్‌ ‌రెడ్డి విన్నపాన్ని స్వీకరించి ప్రతినిధులను ఆప్యాయంగా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందిస్తూ తప్పకుండా కృషి చేస్తానని, ప్రధానమంత్రికి కూడా ఈ విషయం తెలియజేసి నా వంతుగా ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ, సామాజిక న్యాయ మత్రింత్వ శాఖలకు కూడా నా తరపున వినతిపత్రం అందజేస్తానని హామీ ఇచ్చారని ఫోర్స్ ‌ప్రతినిధులు తెలిపారు.

Leave a Reply