Take a fresh look at your lifestyle.

అనాధలకి రాజ్యాంగ పరిధిలో ఉండే చట్టాన్ని ఏర్పాటు చేయాలి ..!

‘ఫోర్స్’ ‌ప్రతినిధుల చలో ఢిల్లీ కార్యక్రమం
హైదరాబాద్‌,‌జూలై 31:అనాధ బిడ్డలకు జన్మదిన, కుల, మత జాతీయత, ఆదాయం, ఇంటిపేరు, రేషన్‌ ‌కార్డ్, ‌తల్లిదండ్రుల వివరాలు మొదలగునవి లేవనే కారణాలతో వారిలో చాలా మందిని విద్యాభ్యాసానికి దూరం చేస్తున్నారని ..వారికి రాజ్యాంగ పరిధిలో ఉండే చట్టాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ ‌సాధన కోసం ‘ఫోర్స్ ‘‘ ‌ప్రతినిధులు శనివారం చలో ఢిల్లీ కార్యక్రమం కు బయలుదేరారు. . ప్రభుత్వం అనాధ బిడ్డలలాగే పేదరికాన్ని అనుభవిస్తున్న, అంగవైకల్యం చెందిన వారికి కనీస సౌకర్యాలు అనగా ఇన్సురెన్స్, ‌బస్సుపాస్‌, ‌ట్రైన్‌ ‌పాస్‌, ఆరోగ్యశ్రీ కార్డులు, హాస్టల్‌ ‌వసతి మొదలగునవి కల్పిస్తూ, ఏ దిక్కులేని అనాధ బిడ్డలను మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే అనాధ బిడ్డలకు కూడా ఇన్సురెన్స్, ‌బస్సుపాస్‌, ‌ట్రైన్‌ ‌పాస్‌, ఆరోగ్యశ్రీ కార్డు, పెన్షన్‌ ‌సౌకర్యాలను కల్పించాలని .. అదే విధంగా స్కూల్స్, ‌కాలేజీల అడ్మిషన్‌ ‌ఫామ్స్ ‌లో ఆర్ఫన్‌ అనే ఆప్షన్‌ ‌ను చేర్చాలని డిమాండ్‌ ‌చేస్తూ సంస్థ శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది .

అన్ని కులాల వారికి, మతాల వారికి, క్రీడలు, ఎన్సీసీ , వికలాంగులు, ఎంఆర్‌ఐ , ఈ ‌డబ్ల్యుఎస్‌ ‌మొదలగు విభాగాలకు చెందిన వారికి ఉద్యోగ నియామకాల్లో, ప్రత్యేక అర్హత కోటాలో అవకాశం కల్పించుటలేదు. ప్రభుత్వం కానీ, స్వచ్ఛంద సంస్థలతో కానీ అనాధ బాలబాలికలను గుర్తించి వెంటనే ఆర్ఫన్‌ ‌సర్తిఫికేట్‌ ‌జారీచేయాలి. ప్రభుత్వమే మార్జిన్‌ ‌మనీ కట్టి అనాధలకు సెల్ఫ్ ఎం‌ప్లాయిమెంట్‌ ‌స్కీం ద్వారా బ్యాంక్‌ ‌రుణాలు ఇవ్వాలి. అనాధ బాలబాలికలు వారి ప్రతిభా పాటవాల ఆధారంగా ఉన్నత చదువులకు అయ్యే మొత్తం ఖర్చులను ప్రభుత్వమే భరించాలి. అనాధల సమస్యలను త్వరితగతిన పరిష్కరించుటకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ పరిధిలోనే ప్రత్యేకమైన అధికారులను నియమించి సత్వరమే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. ప్రాథమిక విద్యాభ్యాసం నుండి ఉన్నత చదువులు పూర్తయ్యే వరకు పుస్తకాలు, బట్టలు ఇంకా అవసరమైన ప్రాధాన్యత కలిగిన వాటి కనీస ఖర్చులను కూడా ప్రభుత్వమే అందించాలని ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఫోర్స్ ‌ప్రతినిధులు శనివారం ఢిల్లీకి బయలుదేరి ఆగస్ట్ 8 ‌వరకు అక్కడే ఉండి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సుప్రీం కోర్ట్ ‌ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌. ఎన్వీ రమణ , పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌ ‌రెడ్డి, సంబంధిత స్త్రీ •శిశు సంక్షేమశాఖ మంత్రి శ్రీమతి. స్మృతి ఇరానీ, సోషల్‌ ‌జస్టిస్‌, ‌మంత్రి డా.వీరేంద్ర కుమార్‌ , ‌న్యాయ శాఖ మంత్రి కిరేన్‌ ‌రిజిజు, స్త్రీ • శిశు సంక్షేమశాఖ సెక్రెటరీ దేవంశీ షా, సోషల్‌ ‌జస్టిస్‌ ‌శాఖ సెక్రెటరీ ఆర్‌.‌సుబ్రహ్మణ్యం, న్యాయ శాఖ సెక్రెటరీ బరున్‌ ‌మిత్రా, ఎగువసభ, దిగువసభ సభ్యులను కలిసి వారికి అనాధ బిడ్డల హక్కులకు సంబంధించిన పూర్తి అంశాలపై అవగాహన కల్పిస్తూ ఈ బిడ్డలకు చెందాల్సిన ప్రత్యేక హక్కులు, వారి సంక్షేమం మరియు రిజర్వేషన్స్ అనే అంశాల ఆధారంగా తయారు చేసిన డ్రాఫ్ట్ ‌ముసాయిదా ను అందచేయడం జరుగుతుందని తెలిపారు

Leave a Reply