Take a fresh look at your lifestyle.

పార్లమెంట్‌ ‌భవనంలో 26న రాజ్యాంగ దినోత్సవం

  • సెంట్రల్‌ ‌హాలులో ప్రసంగించనున్న రాష్ట్రపతి
  • పాల్గొననున్న ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, తదితరులు
  • వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రులు
  • పౌరులెవరైనా పాల్గొని సర్టిఫికెట్‌ ‌పొందవచ్చని వెల్లడి

భారతదేశం 75 సంవత్సరాల కాలంలో సాధించిన ప్రగతి, దేశ చరిత్ర, సంస్కృతి మరియు అద్భుతమైన చరిత్రను ప్రదర్శించి స్మరించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌ ‌కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా నవంబర్‌ 26‌న రాజ్యాంగ దినోత్సవాన్ని పార్లమెంట్‌ ‌హౌస్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు రుగుతున్నాయి. కార్యక్రమ వివరాలను కేంద్ర మంత్రులు ప్రహ్లాద్‌ ‌జోషి, వి మురళీధరన్‌, ‌డా. ఎల్‌ ‌మురుగన్‌ ‌మీడియాకు వివరిస్తూ..ఆజాదీ కా అమృత్‌ ‌మహోత్సవ్‌లో భాగంగా 2021నవంబర్‌  26‌న  నిర్వహించనున్న   సంవిధాన్‌ ‌దివస్‌ ‌వివరాలను మంగళవారం నేషనల్‌ ‌మీడియా సెంటర్‌లో తెలియజేశారు.

రాష్ట్రపతి నాయకత్వంలో జరిగే ఈ కార్యక్రమాన్ని 2021 నవంబర్‌ 26‌వ తేదీ ఉదయం 11 గంటల నుంచి ప్రత్యక్ష ప్రసారం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్‌, ‌మంత్రులు, పార్లమెంట్‌ ‌సభ్యులు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని వారు తెలిపారు. కార్యక్రమంలో తొలుత రాష్ట్రపతి ప్రసంగిస్తారని, తరువాత రాష్ట్రపతితో కలిసి జాతి మొత్తం రాజ్యాంగ పీఠికను చదువుతుందని, కోవిడ్‌-19 ‌నిబంధనలను పాటిస్తూ ప్రజలతో సహా ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/డిపార్ట్‌మెంట్‌లు, రాష్ట్ర/కేంద్రపాలిత ప్రాంతాలు, పాఠశాలలు/కళాశాలలు/విశ్వవిద్యాలయాలు/సంస్థలు, బార్‌ ‌కౌన్సిల్‌లు తదితర రంగాలకు చెందిన వారు తమ తమ ప్రాంతాల నుంచి రాష్ట్రపతితో కలిసి రాజ్యాంగ పీఠిక చదువుతారని అన్నారు. రేడియో/టీవీ/సామజిక మాధ్యమాలను ఉపయోగిస్తూ రాష్ట్రపతితో కలిసి రాజ్యాంగ పీఠిక చదవడానికి వివిధ రంగాలకు చెందిన వారు ముందుకు రావాలని కేంద్ర మంత్రి జోషి పిలుపునిచ్చారు. ‘‘రాజ్యాంగ పీఠిక  ఆన్‌లైన్‌ ‌పఠనం’’లో 23 భాషలలో(22 అధికారిక భాషలు మరియు ఇంగ్లీష్‌) ‌పాల్గొనడానికి, ‘‘రాజ్యాంగ ప్రజాస్వామ్యంపై ఆన్‌లైన్‌ ‌క్విజ్‌’’‌లో  ఎజూ•.అఱమీ.ఱఅ/మీశీఅ•ఱ•బ•ఱశీఅ-••• ద్వారా ఎవరైనా ఎక్కడి నుంచి అయినా పాల్గొని సర్టిఫికేట్‌లను పొందవచ్చునని మంత్రి వివరించారు.

ఎవరైనా ఈ పోర్టల్‌లో నమోదు చేసుకుని 23 భాషల్లో దేనిలోనైనా రాజ్యాంగ పీఠిక  చదివి సర్టిఫికెట్‌ ‌పొందవచ్చునని వివరించారు. రాష్ట్రపతి, ప్రధానమంత్రితో కలిసి ఎక్కువ మంది ప్రజలు పార్లమెంట్‌ ‌సెంట్రల్‌ ‌హాల్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలకు మంత్రి పిలుపు ఇచ్చారు. రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని జాతీయ కార్యక్రమంగా గుర్తించి దీనిలో పాల్గొని సర్టిఫికేట్‌లను సోషల్‌ ‌మీడియాలో ప్రతి ఒక్కరూ పంచుకోవాలని మంత్రి కోరారు.

Leave a Reply