- 2026 జనాభాలెక్కల తర్వాతనే..తేల్చేసిన కేంద్రం
- ఉచిత బియ్యాన్ని తెలంగాణ పూర్తిగా పంపిణీ చేయలేదు
- పార్లమెంటులో రాష్ట్ర ఎంపిల ప్రశ్నలకు మంత్రుల సమాధానం
- రెండు బిల్లులకు లోక్ సభ ఆమోదం
- పార్లమెంట్ ఆవరణ వెలుపల మాక్ సెషన్ : ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదన
- నియోజకవర్గాల పునర్విభజన ఇప్పట్లో లేనట్లే ..!
- 2026 జనాభాలెక్కల తర్వాతనే..తేల్చేసిన కేంద్రం
- ఉచిత బియ్యాన్ని తెలంగాణ పూర్తిగా పంపిణీ చేయలేదు
- పార్లమెంటులో రాష్ట్ర ఎంపిల ప్రశ్నలకు మంత్రుల సమాధానం
- రెండు బిల్లులకు లోక్ సభ ఆమోదం
- పార్లమెంట్ ఆవరణ వెలుపల మాక్ సెషన్ : ప్రతిపక్ష పార్టీల ప్రతిపాదన
ఆంధప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య 119 నుండి 153కి పెంచాలన్న విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదా? ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని నియోజకవర్గాల డీలిమిటేషన్ చేపట్టే ఆలోచన చేస్తున్నదా? అని మంగళవారం లోక్ సభలో ఎంపి రేవంత్ రెడ్డి ప్రశ్నకు కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇస్తూ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన 2026 జనాభాలెక్కల తర్వాతనే అని స్పష్టం చేసారు. ఆంధప్రదేశ్ లోని ప్రస్తుత 175 అసెంబ్లీ నియోజకవర్గాలను 225 స్థానాలకు, తెలంగాణలోని ప్రస్తుత 119 అసెంబ్లీ స్థానాలను 153 స్థానాలకు పెంచాలని ‘‘ఏపి పునర్విభజన చట్టం’’ వుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026లో నిర్వహించే జనాభా లెక్కల పూర్తి అయిన తర్వాతనే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన పక్రియను కేంద్రం చేపడుతుందని మంత్రి నిత్యానంద రాయ్ తెలిపారు.
ఉచిత బియ్యాన్ని తెలంగాణ పూర్తిగా పంపిణీ చేయలేదు: కేంద్రం
కోవిడ్ మహమ్మారి కాలంలో పీఎంజీకేఏవై పథకం కింద కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా పంపిణీ చేసిన రేషన్ వివరాలతోపాటు తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆ రేషన్‌ను పూర్తి స్థాయిలో పంపిణీ చేసిందా? లేదా? అని ఎంపీ బండి సంజయ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి లిఖిత పూర్వక జవాబు ఇస్తూ ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన(పీఎంజీకేఏవై) పథకం కింద కోవిడ్-19 మహమ్మారి కాలంలో పేదలకు లబ్ది చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా కేటాయించిన బియ్యాన్ని తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో లబ్ది దారులకు పంపిణీ చేయలేదని తెలిపారు. పీఎంజీకేఏవై-1 పథకం కింద 11,833 మెట్రిక్ టన్నులు, పీఎంజీకేఏవై-2 పథకం కింద 26,627.21 మెట్రిక్ టన్నులు, పీఎంజీకేఏవై-3 కింద 6,751.45 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ఇవ్వగా అవి ఇంకా పంపిణీ కాలేదని తెలిపారు. అలాగే జులై-నవంబర్ మాసాలకు గాను పీఎంజీకేఏవై కింద నాలుగో దఫా పంపిణీ ఇంకా ప్రారంభం కాలేదన్నారు.
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి 5 కేజీల చొప్పున దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. గత ఏడాది (2020) ఏప్రిల్ నుండి నవంబర్ వరకు ఈ పథకం కింద 322 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం పంపిణీ చేసినట్లు చెప్పారు. అదే విధంగా ఈ ఏడాది (2021) మే నుండి నవంబర్ వరకు సైతం ఆయా పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నామని, అందుకోసం 278 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ఆయా రాష్ట్రాలకు కేటాయించినట్లు తెలిపారు. తెలంగాణ విషయానికొస్తే….గత ఏడాది 7.66 లక్షల మెట్రిక్ టన్నుల, ఈ ఏడాది 6.71 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను పీఎంజీకేఏవై పథకం కింద కేటాయించినట్లు కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి తెలిపారు. జాతీయ ఆహార భద్రతా చట్టం-2013 ప్రకారం ప్రజా పంపిణీ వ్యవస్థ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలోనే కొనసాగుతుందని పేర్కొన్న కేంద్ర మంత్రి అంత్యోదయ అన్న యోజన, ప్రాధాన్యత కలిగిన గ్రుహస్తుల (పీహెచ్ హెచ్) కింద లబ్ది దారుల ఎంపికతో పాటు రేషన్ షాపుల ద్వారా ఆహార ధాన్యాలను లబ్ది దారులకు సరఫరా చేసే బాధ్యత రాష్ట్రాలదేనని తెలిపారు.