Take a fresh look at your lifestyle.

దేశంలో నిలకడగా కొత్త కేసులు

తాజాగా 12,514 మందికి పాజిటివ్‌..251 ‌మంది మృతి
దేశంలో రోజువారీ కొత్త కేసులు నిలకడగా ఉన్నాయి. తాజాగా 24 గంటల్లో 12,514 కోవిడ్‌ ‌పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. కాగా మహమ్మారి నుంచి 12,718 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ‌బారినపడి 24 గంటల్లో 251 మంది మృత్యువాత పడ్డారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ ‌కేసుల సంఖ్య 3,42,85,814కు పెరిగాయి. ప్రస్తుతం 1,58,817 యాక్టివ్‌ ‌కేసులున్నాయి.

ఇప్పటి వరకు 3,36,68,560 మంది బాధితులు కోలుకున్నారు. వైరస్‌ ‌ప్రభావంతో ఇప్పటి వరకు మొత్తం 4,58,437 మంది మృతి చెందారు. మరో వైపు దేశంలో టీకాల పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 1,06,31,24,205 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరించింది.

Leave a Reply