కొత్తగా మరో 2384 పాజిటివ్ కేసులు.17మంది మృతి
హైదరాబాద్,జూన్ 2: తెలంగాణలో కొరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతున్న సమయంలో మంగళ వారం పాజిటివ్ కేసుల్లో పెరుగుదల స్థిరంగా కనిపించింది. . కాగా..మంగళ వారం 2493 పాజిటివ్ కేసులు నమోదు కాగా బుధవారం 2384 కేసులు నమోదు అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ లో వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో 17 మంది కోవిడ్ తో మరణించారు.. 2242 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసులు 5,83,228 కు పెరిగాయి. వీరిలో 5,46,536మంది కోలుకున్నారు.
ఇంకా 33,379 యాక్టివ్ కేసులున్నాయి. ఇవాళ్టి వరకు 3313 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ 1,08,696 సాంపిల్స్ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్రంలో కొవిడ్ రికవరీ రేటు 93.70 శాతంగా ఉంది. మరణాలు రేటు 0.56 శాతంగా ఉందని పేర్కొంది.