Take a fresh look at your lifestyle.

అం‌దరి హైదరాబాద్‌ను కొందరిదిగా మార్చే కుట్ర

కూకట్‌పల్లి నుంచి రోడ్‌షోతో పార్టీ ప్రచారం ప్రారంభం
బిజెపి తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌
‌వరదసాయాన్ని ఆపిన వారికి వోటుతో బుద్ధి చెప్పాలని పిలుపు

అందరి హైదరాబాద్‌ను కొందరి హైదరాబాద్‌కు మార్చేందుకు కుట్ర పన్నుతున్నవారికి ఓటుతో బుద్ధి చెప్పాల్సిందిగా మంత్రి కేటీఆర్‌ ‌ప్రజలను కోరారు. నగరంలోని కూకట్‌పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్‌, ‌మూసాపేట్‌ ‌డివిజన్ల టీఆర్‌ఎస్‌ ‌కార్పొరేట్‌ అభ్యర్థులకు మద్దతుగా మంత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. భారీ రోడ్‌ ‌షోలతో తన ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓల్డ్ అల్లాపూర్‌ ‌చౌరస్తాలో నిర్వహించిన రోడ్‌షోలో కేటీఆర్‌ ‌పాల్గొని
ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో గతంలో ఎట్లాయితే ప్రచారం ప్రారంభించుకుంటే కలిసొచ్చిందో మళ్ళీ అదే పద్ధతిలో ఇక్కడనే ప్రారంభించి విజయఢంకా మ్రోగించాలని చెప్పి కూకట్‌పల్లి నియోజకవర్గం నుంచే పార్టీ ప్రచారాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. డిసెంబర్‌ 1‌న జరిగే పోలింగ్‌ ‌ద్వారా ఓల్డ్ అల్లాపూర్‌ ‌కార్పొరేటర్‌గా సబీనా, మూసాపేట కార్పొరేటర్‌గా శ్రవణ్‌కుమార్‌ ఎన్నిక కాబోతున్న సందర్భంగా అందరూ చప్పట్లతో హర్షధ్వానాలు తెలపాలన్నారు. జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరారు.  ఆరేళ్లక్రితం ఉన్న అనుమానాలన్నీ పటాపంచలు చేసి తెలంగాణ ఇప్పుడు అభివృద్ధిలో దూసుకెళ్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ ‌పాలనలో హైదరాబాద్‌ ‌ప్రశాంతంగా ఉందన్నారు. నగరంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయన్నారు. ఓట్ల కోసం బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నరన్నారు. వరద బాధితులకు రూ.10 వేలు ఇస్తే బీజేపీ నేతలే ఆపారన్నారు. వరద బాధితులందరికి న్యాయం చేస్తామని.. బాధితులందరికీ రూ. 10 వేలు అందిస్తామని తెలిపారు. హైదరబాద్‌ అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ఎన్నో పనులు చేపట్టారు. మరి ఆరేండ్లలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఒక్కపనైనా చేసిందా అని ప్రశ్నించారు. పచ్చగా ఉన్న హైదరాబాద్‌లో బీజేపీ నేతలు నిప్పు పెట్టే ప్రయత్నం చేస్తున్నరు.

ప్రశాంతంగా ఉన్న హైదారాబాద్‌లో అలజడి రేపే ప్రయత్నం చేస్తున్నరు. ఓట్లకోసం శాంతిని చెడగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ‌తదితరులు పాల్గొన్నారు.
నగరంలో  వరద బాధితులకు రూ.10వేలు ఇస్తుంటే మోకాలు అడ్డుపెట్టింది ఎవరని టీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ‌మంత్రి కేటీఆర్‌ ‌ప్రశ్నించారు. అర్హులైన వారందరికీ వరద సాయం అందజేస్తామని కేటీఆర్‌ ‌పేర్కొన్నారు.  జీహెచ్‌ఎం‌సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా  శనివారం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ ‌నియోజకవర్గాల్లో నిర్వహించిన రోడ్‌షోల్లో  మంత్రి కేటీఆర్‌  ‌పాల్గొన్నారు. ’వరద సాయాన్ని ఆపిన బీజేపీ నేతలు రూ.25వేలు ఇస్తామంటున్నారు. ఇప్పుడు ఇవ్వకుండా బీజేపీ నేతల్ని ఎవరు ఆపారు?  టీఆర్‌ఎస్‌ ‌రూ.10వేలు ఇస్తామంటే ఆపినవాళ్లు..ఇప్పుడు రూ.25వేలు ఇస్తారట. ఇది అమాయకపు అహ్మదాబాద్‌ ‌కాదు..హుషార్‌ ‌హైదరాబాద్‌.  ‌గత ఎన్నికల్లో ఒక్క సీటుతో మనం సెంచరీ కోల్పోయాం. ఈసారి జీహెచ్‌ఎం‌సీ  ఎన్నికల్లో  టీఆర్‌ఎస్‌ ‌పార్టీ శతకం పూర్తి చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అం‌దరినీ కలుపుకుని వెళ్తున్నారు. ప్రశాంతమైన హైదరాబాద్‌ ‌కోసం టీఆర్‌ఎస్‌నే గెలిపించాలి.   కోసం పనిచేసే వారిని తిరిగి కార్పొరేషన్‌కు పంపించాలని’ కేటీఆర్‌ ‌కోరారు.  ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తదితరులు ఉన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply