Take a fresh look at your lifestyle.

మత ఘర్షణలకు కుట్ర

  • ప్రభుత్వం వద్ద ఖచ్చితమైన సమాచారం
  • సంఘ విద్రోహక శక్తులను కఠినంగా అణచివేస్తాం
  • రాష్ట్రంలో శాంతిభద్రత పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ‌సమీక్ష

తీవ్ర నిరాశా, నిస్ప•హలో ఉన్న కొన్ని అచారక శక్తులు హైదరాబాద్‌ ‌నగరంలో, రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించి మత విధ్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాయనీ, వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు పోలీసు అధికారులను ఆదేశించారు. అరాచక శక్తుల కుట్రలకు సంబంధించి ప్రభుత్వం వద్ద కచ్చితమైన సమాచారం ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌ ‌నగరంలో శాంతి భద్రతలు కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమనీ, మత సామరస్యాన్ని దెబ్బతీసి రాజకీయ ప్రయోజనం పొందాలనుకునే వ్యక్తులు, శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని చెప్పారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై సీఎం కేసీఆర్‌ ‌బుధవారం ప్రగతి భవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ ‌కుమార్‌, ‌డిజిపి మహేందర్‌రెడ్డి, హైదరాబాద్‌, ‌సైబరాబాద్‌, ‌రాచకొండ సిపిలు అంజనీకుమార్‌, ‌విసి సజ్జన్నార్‌, ‌మహేశ్‌ ‌భగవత్‌ ‌తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జీహెచ్‌ఎం‌సి ఎన్నికల సందర్భంగా రాజకీయంగా లబ్ది పొందడానికి కొందరు అనేక కుట్రలు చేస్తున్నారనీ, సోషల్‌ ‌మీడియా ద్వారా తప్పుడు ప్రచారాలు చేస్తూ మార్ఫింగ్‌ ‌ఫోటోలతో ప్రజలను ఏమార్చాలనీ, మాటలతో కవ్వింపు చర్యలకు పూనుకున్నారని తెలిపారు.

అయినప్పటికీ శాంతికాముకులైన హైదరాబాద్‌ ‌ప్రజలు పట్టించుకోకపోవడంతో హైదరాబాద్‌ ‌నగరంలో ఘర్షణలు సృష్టించి రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. పెద్ద ఎత్తున గొడవలు సృష్టించి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అసలు జీహెచ్‌ఎం‌సి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకుండా చేయాలనీ, ఎన్నికలు వాయిదా వేయించాలని పక్కా ప్రణాళిక రచించారనీ, దీనికి సంబంధించిన పక్కా సమాచారం ప్రభుత్వం వద్ద ఉందని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్‌ ‌నగరంతో పాటు రాష్ట్రంలో శాంతి సామరస్యాలు యధావిధిగా కొనసాగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమనీ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహ శక్తుల ఆటలు సాగనీయవద్దని హెచ్చరించారు. ఎంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామనీ, నిబద్ధతతో పనిచేసి రాష్ట్రాన్ని ఒక దారికి తీసుకొచ్చామనీ, పేకాట క్లబ్బులు, గుడుంబా వంటి మహమ్మారులను దూరం చేసినట్లు చెప్పారు. శాంతి భద్రతలను కాపాడే విషయంలో సంఘ విద్రోహ శక్తులను అణచివేసే దిశగా ప్రభుత్వం ముందు నుంచీ కఠినంగా వ్యవహరిస్తున్నదని స్పష్టం చేశారు. ఈ నగరాన్ని కాపాడుకోవడం ప్రభుత్వ ప్రధాన బాధ్యత అనీ, హైదరాబాద్‌ ‌నగరం ప్రశాంతంగా ఉండటం ముఖ్యమనీ, తెలంగాణకు గుండె కాయ

వంటి హైదరాబాద్‌ ‌నగరంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి మత ఘర్షణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత హైదరాబాద్‌ ‌నగరంలో మత చిచ్చు పెట్టడానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, ఎవరో రెచ్చగొడితే రెచ్చి పోవద్దని నగర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలీసు యంత్రాంగం పూర్తి అప్రమత్తతతో ఉంటుందనీ, ఎట్టి పరిస్థితుల్లోనూ అరాచక, సంఘ విద్రోహ శక్తుల కుట్రలను భత్నం చేసి తీరతామని పోలీసు అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉంటారనీ, ఎక్కడ ఏచిన్న అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూస్తామని ఈ సందర్భంగా వారు సీఎం కేసీఆర్‌కు స్పష్టం చేశారు.

Leave a Reply