Take a fresh look at your lifestyle.

ధాన్యం గోదాము నిర్మాణానికి స్థల పరిశీలన

ధాన్యం గోదాముల నిర్మాణానికి స్థల పరిశీలన చేసేందుకు జిల్లా కలెక్టర్‌ ‌వి.పి. గౌతమ్‌ ‌గురువారం మహబూబాబాద్‌ ‌మండలంలోని గుమ్ముడూరు, అనంతారం గ్రామాలలో రెవిన్యూ, సర్వే అధికారులతో పర్యటించారు. జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వకు గాను గోదాము నిర్మించవలసి ఉన్నందున ముందుగా మహబూబాబాద్‌ ‌మండల కేంద్రం లోని బయ్యారం రహదారి పక్కనే ఉన్న ఆర్తి గార్డెన్స్ ‌వెనుక ఉన్న గుమ్ముడూరులో ప్రభుత్వ స్థలాన్ని కలెక్టర్‌ ‌పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ ‌కలెక్టర్‌ ‌కు ప్రభుత్వ భూమి వివరాలు వివరించారు.

గుమ్ముడూరు లోని సర్వే నెంబర్‌ 287 ‌లో గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ ‌డిగ్రీ బాయ్స్ ‌కళాశాలకు 5 ఎకరాలు, మైనారిటీ సంక్షేమం రెసిడెన్షియల్‌ ‌బాయ్స్ ‌స్కూల్‌ ‌కు 5 ఏకరములు, జిల్లా సైన్స్ ‌సెంటర్‌ ‌కు ఎకరం, జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఈ.జి.ఎం.ఎం. శిక్షణ కేంద్రానికి 2 ఎకరాలను సర్వేయర్‌ ‌తో కలిసి సరిహద్దులు కూడా చూపించారు. అంతే కాకుండా కోర్ట్ ‌భవనంనకు కూడా ఇదే ప్రాంతంలో ప్రభుత్వ భూమి కేటాయించడం జరిగిందని కలెక్టర్‌ ‌కు రెవిన్యూ అధికారులు వివరించారు. అనంతరం అనంతారంలోని రైల్వే ట్రాక్‌ ‌పక్కనే ఉన్న ప్రభుత్వ భూమి గుట్టను కూడా కలెక్టర్‌ ‌సందర్శించి పరిశీలించారు. అనంతారం గ్రామంలో గోదాం నిర్మాణానికి స్థలం అనుకూ లంగా లేకపోవడంతో గుమ్ముడూరు లొనే 287 సర్వే నెంబర్‌ ‌లో 20 ఎకరాలుకు స్థలం కేటాయించాలని, ఆ స్థలానికి సరిహద్దులు గుర్తించి మ్యాప్‌ ‌తో సహా నివేదిక అందజేయాలని ఆర్డీఓ కొమురయ్య ను కలెక్టర్‌ ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ కొమురయ్య, తహసీల్దార్‌ ‌రంజిత్‌, ‌సర్వేయర్‌ ‌భాస్కర్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply