Take a fresh look at your lifestyle.

ఏకగ్రీవాలు తప్పు కాదు… అందుకోసమే యత్నాలే తప్పు ఎ

నెల్లూరు పర్యటనలో అధికారులతో సమీక్షించిన నిమ్మగడ్డ
ఏకగ్రీవాలు తప్పుకాదని, ఏకగ్రీవాల కోసమే యత్నించడం తప్పని ఎస్‌ఈసి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ ‌స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లాలో ఎన్నికల అధికారులతో ఆయన సమావేశ మయ్యారు. అనంతరం విలేకర్ల సమావేంలో మాట్లాడారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకే ఎపిలోనూ ఎన్నికలకు ఇది సరైన సమయమని అభిప్రాయపడ్డారు. ఎన్నికలతో ప్రజాస్వామ్యం బలపడుతుందన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఏనాడూ తాను పరిధి దాటి ఇతర వ్యవస్థల్లోకి, సంఘాల్లోకి వెళ్లలేదని, రాజ్యాంగం నుండి సంక్రమించిన ఎన్నికల వ్యవస్థకే పరిమితమయ్యానని తెలిపారు. బుధవారమే తిరుపతికి చేరుకున్న ఆయన అధికారులతో సమావేశమయ్యారు. గురువారం తెల్లవారుజామున వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న ఆయన నెల్లూరు వెళ్లారు. బుధవారం సాయంత్రం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం సెనేట్‌హాల్లో అధికారులతోనూ సమావేశమాయ్యరు. రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌ ‌నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తున్నారు.

గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన జెడ్పీ హాల్‌లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో స్థానిక పరిస్థితులు, భద్రత ఏర్పాట్లు ఎలా ఉన్నది ప్రత్యక్షంగా తెలుసుకోడానికి పర్యటిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కొరోనా అదుపులోకి రావడం సంతోషమన్నారు. ఎన్నికల నిర్వహణకు ఇదే సరైన సమయమని, ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు సూచన మేరకు తాను ఎన్నికలు నిర్వహిస్తున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్‌ను గౌరవించకపోయినా ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. గౌరవాలకు, భేషజాలకు పోవాల్సిన అవసరంలేదన్నారు. తన విధులను తాను బాధ్యతగా నిర్వహిస్తానన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిర్వహణకు కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని పేర్కొన్నారు.

గతంలో ఎన్నడూ కూడా ఎన్నికల నిర్వహణలో ఇంతటి శ్రమ కలగ లేదన్నారు. అన్నిజిల్లాల్లో పర్యటిస్తున్నానని, కోవిడ్‌ను నియంత్రించామని, వాతావరణం బాగుందని తెలిపారు. తమిళనాడు, కేరళ, అస్సాంలలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. నూతన యాప్‌తో ద్యారా ప్రతి ఒక్కరూ సంతృప్తి చెందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంపిటిసి ఎన్నికల్లో జిల్లాలో గతంలో అనేక సంఘటనలు జరిగాయని, అటువంటివి పునరావృతం కాకుండా చూస్తామన్నారు. ప్రతివిషయాన్నీ ప్రసారం చేస్తున్న మీడియాను అభినందించారు. తెలంగాణలో కూడా జీహెచ్‌ఎం‌సీ ఎన్నికలు జరిగిన విషయాన్ని ఈ సందర్భంగా నిమ్మగడ్డ రమేష్‌ ‌కుమార్‌ ‌గుర్తు చేశారు

Leave a Reply