Take a fresh look at your lifestyle.

కొరోనాను జయించినోళ్లు.. ప్లాస్మా దానంకు ముందుకు రావాలి

ప్లాస్మా దానంతో బాధితుల ప్రాణాలను కాపాడుకోవచ్చు

మునిసిపల్‌ ‌కార్యాలయం ఆవరణలో కొరోనా మొబైల్‌ ‌టెస్టింగ్‌ ‌బస్‌ ‌ప్రారంభంలో మంత్రి  హరీష్‌ ‌రావు కొరోనాను  జయించిన వ్యక్తులు ప్లాస్మా దానంకు ముందుకు రావాలని రాష్ట్ర  ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. కొరోనాను జయించిన వ్యక్తి దానం చేసే ప్లాస్మా ద్వారా కోవిద్‌ ‌బారిన పడిన ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని మంత్రి పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కోవిడ్‌ ‌టెస్టింగ్‌ (ఆర్‌టిపిసిఆర్‌) ‌ల్యాబ్‌ను, మునిసిపల్‌ ‌కార్యాలయం అవరణలో మొబైల్‌ ‌టెస్టింగ్‌ ‌బస్‌ను రాష్ట్ర మంత్రి హరీష్‌ ‌రావు  జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు  వేలేటి రోజా రాధకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామ రెడ్డితో కలిసి  ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి  హరీష్‌ ‌రావు మాట్లాడుతూ…కొరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో నిర్ధారణ పరీక్షలు వేగంగా చేసి వెంటనే ఫలితాలు ప్రకటించేందుకు వీలుగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో కొరోనా టెస్టింగ్‌ (ఆర్‌టిపి• ఆర్‌) ‌ల్యాబ్‌ను ఏర్పాటు చేశామన్నారు. తద్వారా కొరోనా  వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు. ఇంతకుముందు కొరోనా  నిర్ధారణ కోసం స్థానికంగా సేకరించిన శాంపిల్స్  ‌పరీక్షల కోసం హైదరాబాద్‌ ‌పంపే వారిమని మంత్రి తెలిపారు. ఫలితాలు కోసం రెండు నుంచి మూడు రోజులు వేచి చూడల్సివచ్చేదన్నారు. కానీ, ఇప్పటి నుంచి సిద్ధిపేట ప్రభుత్వ వైద్య కళాశాలలో కొరోనా  టెస్టింగ్‌  ‌ల్యాబ్‌ ఏర్పాటుతో ఒక రోజులోనే ఫలితాలు వస్తాయన్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆశీస్సులతో ప్రభుత్వ వైద్య కళాశాలలో, గజ్వేల్‌ ‌నియోజకవర్గంలోని ఆర్వీఎం ప్రయివేట్‌ ‌మెడికల్‌ ‌కళాశాలలో కొరోనా టెస్ట్ ‌ల్యాబ్స్‌ను ఏర్పాటు చేసుకున్నామన్నారు. కొరోనాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందనీ, ప్రజలు ఎవ్వరూ ఆందోళన చెందొద్దన్నారు. కొరోనా బాధితుల కోసం జిల్లాలో 200 పడకల సామర్థ్యం గల  విభాగంను ఏర్పాటు చేశామన్నారు. అనుభవజ్ఞులైన వైద్యులు సరిపడా అందుబాటులో ఉంచామన్నారు. జిల్లా కేంద్రంలో సరిపడా రెమిడిసివర్‌ ఇం‌జక్షన్లను  అందుబాటులో ఉంచామన్నారు. వ్యాధి లక్షణాలు ఉంటే ప్రజలు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో, లక్ష్మక్కపల్లిలోని ఆర్వీఎం ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. కొరోనా వ్యాధి సోకి, లక్షణాలు అధికంగా ఉంటే ఆసుపత్రిలో చేరాలన్నారు. లక్షణాలు తక్కువగా ఉన్నా, లక్షణాలు లేకున్నా వైద్యుల సలహా మేరకు హోమ్‌ ఐసొలేషన్‌ ఉం‌డాలన్నారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న బాధితుల అరోగ్య పరిస్థితిని ప్రతి రోజూ వైద్యులు, ఏఎన్‌ఎం‌లు విచారిస్తారన్నారు. కొరోనా  బాధితుల్లో 80 నుంచి 90 శాతం మంది ఐసొలేషన్‌లో ఉండి కొరోనాను జయిస్తున్నారనీ, మిగతా 10 మంది మాత్రమే ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకోవాల్సి వస్తుందన్నారు. ఆసుపత్రిలో చేరిన  బాధితులకు సంతులిత ఆహారం, వేడినీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. జిల్లా కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌, ‌డాక్టర్ల బృందం ప్రత్యేకంగా కోవిద్‌ ‌వాట్సాప్‌ ‌గ్రూప్‌ ఏర్పాటు చేసుకొని నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారన్నారు. ప్రభుత్వం కోవిడ్‌ ‌బాధితులకు హైదరాబాద్‌ ‌నుంచి అవసరమైన అన్ని మందులను పంపిస్తుందనీ మంత్రి తెలిపారు. హోమ్‌ ఐసొలేషన్‌లో ఉన్న వారికి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల హోమ్‌ ‌కిట్స్ ‌ప్రభుత్వం అందించిందన్నారు.
తొలి అనుమతి సిద్ధిపేట వైద్య కళాశాలకే…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు అయిన వైద్య కళశాలలో భాగంగా కొరోనా టెస్టింగ్‌ (ఆర్‌టిపిసిఆర్‌) ‌ల్యాబ్‌కు సంబంధించి తొలి అనుమతి సిద్దిపేటకు వచ్చిందనీ మంత్రి హరీష్‌రావు అన్నారు. వైద్య కళాశాలకు ఇలాంటి అనుమతులు రావాలంటే సాధారణంగా మూడేండ్ల సమయం పడుతుందన్నారు. సీఎం ఆశీస్సులు,ప్రత్యేక చొరవ వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఈ ల్యాబ్‌ ‌ద్వారా ప్రతి 8 గంటల్లోనే ఫలితం వస్తుందన్నారు. షిఫ్ట్‌కు 96 చొప్పున రెండు షిఫ్ట్‌లు నడిపి రోజుకు కనీసం 200 మందికి ఫలితాలు వచ్చేలా చూస్తామన్నారు. జిల్లా కేంద్రంతో పాటు గజ్వేల్‌ ఆర్వీఎంలో ఏర్పాటు చేసిన కొరోనా టెస్టింగ్‌ ‌ల్యాబ్‌ల ద్వారా ఒక రోజుకు 550 మందికి పరీక్షలు చేసే సామర్థ్యం చేకూరిందన్నారు. రాబోయే రోజుల్లో ఆర్‌ఎన్‌ఏ ‌డిజిటల్‌ ఎక్స్‌ట్రాక్షన్‌ ‌యంత్రాన్ని  జిల్లాకు తెప్పిస్తామనీ, తద్వారా రోజుకు 600 మందికి పరీక్షలు చేసే సౌలభ్యం చేకూరుతుందన్నారు.అలాగే జిల్లా వ్యాప్తంగా 40 కేంద్రాలలో ర్యాపిడ్‌ ‌కిట్‌ల ద్వారా ప్రతి రోజూ వెయ్యికి పైగా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కొరోనా  వ్యాధి లక్షణాలు ఉంటే ప్రజలు సమీప ప్రాథమిక అరోగ్య కేంద్రాలు, కమ్యునిటీ• హెల్త్ ‌సెంటర్‌, ‌పట్టణ అరోగ్య కేంద్రాలకు  వెంటనే వెళ్లి పరీక్షలు చేయించుకోవాలన్నారు. వ్యాధి నిర్ధారణ జరిగి స్వల్ప లక్షణాలు ఉంటే హోమ్‌ ఐసొలేషన్‌లో ఉండాలన్నారు.
ప్రభుత్వానికి హైకోర్టు, ఐసిఎంఆర్‌ ‌ప్రసంశలు…
సోషల్‌ ‌మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దు…
కొరోనాపై సోషల్‌ ‌మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దనీ మంత్రి  హరీష్‌ ‌రావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. నిర్భయంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలన్నారు. కొరోనా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వస్తే భయపడాల్సిన అవసరం లేదన్నారు.  అలాగే, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం కొరోనా మహమ్మారిని వ్యాప్తిని అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న చికిత్సలను రాష్ట్ర హైకోర్టు, ఐసిఎంఆర్‌( ఇం‌డియా కౌన్సిల్‌ ‌ఫర్‌ ‌మెడికల్‌ ‌రీసెర్చ్ ) ‌ప్రశంసించిందని మంత్రి  హరీష్‌ ‌రావు తెలిపారు. అద్భుతంగా పని చేస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు, ఐసిఎంఆర్‌ అభినందించడం రాష్ట్ర ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమన్నారు.
కంటోన్మెంట్‌ ఏరియాలో మొబైల్‌ ‌వాహనం ద్వారా పరీక్షలు…
సిద్దిపేట పట్టణంలో వ్యాధి వ్యాప్తి అధికంగా ఉన్న కంటోన్మెంట్‌ ఏరియాలో మొదట మొబైల్‌ ‌టెస్టింగ్‌ ‌బస్‌ ‌ద్వారా పరీక్షలు నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. తదనంతరం గల్లీలోకి మొబైల్‌ ‌టెస్టింగ్‌ ‌బస్‌ను పంపి పరీక్షలు చేపట్టి వ్యాధి వ్యాప్తి జరగకుండా చూస్తామన్నారు. పట్టణంలోని కౌన్సిలర్లు, మెప్మా రిసోర్స్ ‌పర్సన్లు, ఆశా వర్కర్లుల, అంగన్వాడీలు ఒక్కొక్కరు తమ పరిధిలోని 50 కుటుంబాలతో మాట్లాడి కుటుంబ సభ్యుల అరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోవాలన్నారు. ఎవరైనా వ్యాధి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే పరీక్షలు చేయించాలన్నారు.
ఫ్రంట్‌ ‌వారియర్స్‌కు సన్మానం…
కొరోనా మహమ్మారిపై సాగుతున్న పోరాటంలో ముందుండి ప్రత్యక్ష పోరాటం చేస్తున్న వైద్యులకు మంత్రి  హరీష్‌ ‌రావు ప్రభుత్వ వైద్య కళాశాలలో శాలువాతో సన్మానించారు. కనిపించే ప్రత్యక్ష దైవాలైన వైద్యులను సన్మానించుకోడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, అదనపు కలెక్టర్‌ ‌పద్మాకర్‌, ‌మున్సిపల్‌ ‌చైర్మన్‌  ‌రాజనర్సు, సుడా చైర్మన్‌  ‌రవీందర్‌ ‌రెడ్డి, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌  ‌తమిళ అరుసు, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ ‌మనోహర్‌, ‌నేతలు రాధాకృష్ణశర్మ, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి త•దితరులు పాల్గొన్నారు.
రామలింగారెడ్డి సంతాప సూచికంగా జిల్లా పరిషత్‌ ‌సమావేశం వాయిదా..
సిద్ధిపేట రెడ్డి ఫంక్షన్‌ ‌హాల్‌లో జిల్లా ప్రజా పరిషత్‌ అధ్యక్షురాలు  వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ అధ్యక్షతన జిల్లా పరిషత్‌ ‌సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు, ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి, కలెక్టర్‌ ‌పరపతి వెంకట్రామరెడ్డి, జిల్లాలోని జడ్పిటిసిలు, ఎంపిపిలు, అధికారులు హాజరయ్యారు. అయితే, ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన దివంగత దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డికి సమావేశం సంతాపం తెలిపింది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి సేవలను గుర్తు చేసుకున్న సర్వ సభ్య సమావేశం.. రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఎమ్మెల్యే రామలింగారెడ్డి సంతాప సూచకంగా సర్వ సభ్య సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు జిల్లా పరిషత్‌ అధ్యక్షురాలు రోజాశర్మ ప్రకటించారు.

Leave a Reply