Take a fresh look at your lifestyle.

బస్టాండ్‌ ‌రోడ్లను సందర్శించి నిరసన తెలిపిన కాంగ్రెస్‌ ‌నాయకులు

39వ డివిజన్‌ ‌లోని గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ ‌వైస్‌ ‌ప్రెసిడెంట్‌ ‌సందుపట్ల ధన్‌ ‌రాజ్‌ ఆధ్వర్యంలో గురువారం బస్టాండ్‌ ‌పరిధిలోని రోడ్లను సందర్శించి పరిస్థితులను చూసి రోడ్లపైనే పువ్వులను చల్లుకుంటూ రోడ్లను వీలైనంత వరకు పూడ్చి నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌ ‌రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఆయ్యా ముఖ్యమంత్రి కెసిఆర్‌ ‌మీరు ఇచ్చిన మాట ప్రకారం బంగారు తెలంగాణ అంటే ఇదేనా లండన్‌ ‌మాదిరిగా, స్మార్ట్ ‌సిటీగా చేస్తాను అన్న రోడ్లు ఇలాగే ఉంటాయా అని ప్రశ్నించారు. రూ.300 కోట్ల నిధులు కార్పొరేషన్‌కి ఇస్తానన్న మాట ఎక్కడ పోయిందో గుర్తు రావడం లేదా అని ప్రశ్నించారు.

ఈ కార్యక్రమంలో యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌నగర అధ్యక్షుడు అశం కళ్యాణ్‌, ‌నగర ప్రధాన కార్యదర్శి కోడిపాక గణేష్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జనరల్‌ ‌సెక్రెటరీ వంశీకృష్ణ, రాజ్‌ ‌కుమార్‌, ‌హస్సైన్‌, ‌నాయకులు కె.భరద్వాజ్‌, ‌రాజ్‌ ‌కుమార్‌, ‌హస్సైన్‌, అఖిల్‌ , ‌ముకేష్‌ , ‌వరప్రసాద్‌ ‌మరియు కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!