పెద్దకోడూరు ఊర చెరువు మత్తడిని పరిశీలిస్తున్న కాంగ్రెస్నాయకులు కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా చెరువులను నింపింది మత్తడి కూల్చడం కోసమా అని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు జంగిటి శ్రీనివాస్ అన్నారు. చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు గ్రామంలోని ఊరచెరువు మత్తడిని బుధవారం కాంగ్రెస్ నాయకులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ…తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం లక్షల కోట్లు వెచ్చించి నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న చెరువు, కుంటలు నింపి జలహారథులు పట్టిన మంత్రి హరీష్ రావు రెండు రోజులకే పెద్దకోడూర్ ఊరచేరువు మత్తడిని ఎలాంటి ఉత్తర్వులు లేకుండా కూల్చడం ఏమిటని ప్రశ్నించారు.
వందల మంది ప్రజలు మత్య్సకారులకు అధారమైన చెరువును రియల్ భూ దందా దారుల కోసమే మత్తడిని కులుస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట నియోజకవర్గంలో హరీష్ రావుకు తెలియకుండా అడుగు కూడా బయట పెట్టని అధికారులు, కాంట్రాక్టర్లు ఆయనకు తెలియకుండానే మెగా కంపెనీ వాళ్ళు అంత దైర్యం చేసి మత్తడి కూల్చర అని మంత్రిని ప్రశ్నించారు. తక్షణమే మెగా కంపెనీపైన చర్యలు తీసుకోకుంటే మంత్రి గారి హస్తం ఉందన్న అనుమానం నిజమైతదని అన్నారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గ్రామస్తులు తదితరులున్నారు.