Take a fresh look at your lifestyle.

దుబ్బాక నుండి కాంగ్రెస్‌ ‌పోటీ చేస్తుంది: పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌

  • ‌టీజేఎస్‌ ‌నేత భవాని రెడ్డి కాంగ్రెస్‌లో చేరిక
  • టీఆరెస్‌ ‌పార్టీ కి చుక్కలు చూపిస్తా :భవాని రెడ్డి
  • అందరిని సమన్వయం చేసుకుంటూ పని చేయాలి…జగ్గారెడ్డి

టీజేఎస్‌ ‌నాయకురాలు  భవాని రెడ్డి కాంగ్రెస్‌ ‌పార్టీ లో చేరారు.పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి శుక్రవారం బంజారాహిల్స్‌లోని తన నివాసంలో పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించారు.టీజేఏస్‌ ‌పార్టీ తరపున పొత్తుల్లో భాగంగా సిద్దిపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి భవాని రెడ్డి  గత ఎన్నికల్లో పోటీ చేశారు.విద్యావంతులు భవాని రెడ్డి కి కాంగ్రెస్‌ ‌పార్టీ స్వాగతీస్తోందన్నారు. ఆమెకు కాంగ్రెస్‌ ‌పార్టీ నుంచి అన్ని రకాల మద్దతు ఉంటుందన్నారు .ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌ ‌కుమార్‌, ‌మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి, ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి,  పలువురు కాంగ్రెస్‌ ‌నాయకులు పాల్గొన్నారు.దుబ్బాక నుంచి కాంగ్రెస్‌ ‌పార్టీ పోటీ చేస్తుందని ఆ మేరకు పీసీసీ నిర్ణయి ంచిందన్నారు.

ఎవ్వరేమి మాట్లాడిన అది వారి వ్యక్తిగతమని డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి… మండలాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఎన్నికలకు కార్య కర్తలను సమాయత్తం చెయ్యాలని ఆ తర్వాత నియోజకవర్గ సమావేశం ఏర్పాటు చెయ్యలని ఆ కార్యక్రమంలో నేను కూడా పాల్గొంటానని అన్నారు .చిన్న రైతు నుంచి పొలం లాక్కుని నరసింహులు ఆత్మహత్య కు ప్రభుత్వం పురికొల్పిందని రాష్ట్రంలో దళితులపై దాడులు ఆగడం లేదని మం డిపడ్డారు.మంథని పోలీస్‌ ‌స్టేషన్లో ఓ దళితుడు వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నాడని దళితులు, గిరిజనులపై దాడులు జరుగుతుంటే సీఎం కేసీఆర్‌ ‌స్పందించకపోవడం దురదృష్టమన్నారు. సామాజిక న్యాయం కాంగ్రెస్‌ ‌పార్టీ మూల సిద్దాంతమని కేసీఆర్‌ ‌ప్రభుత్వంలో సామజిక న్యాయం జగరడం లేదన్నారు .కరోనతో మరణిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినట్లు యాభై లక్షల బీమా మొత్తాన్ని వైద్యులకు ఇస్తున్నట్లే కరోనతో ముందుండి పోరాడుతున్న పోలీసులు, జర్నలిస్టులకు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు మరణిస్తే రూ. 50 లక్షలు ఎక్సగ్రెసియా ఇవ్వాలని డిమాండ్‌ ‌చేశారు.

అధికార పార్టీ ని ఎదురుకునే సత్త కాంగ్రెస్‌ ‌కే ఉంది ..భవాని రెడ్డి
అధికార టీఆరెస్‌ ‌పార్టీ ని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ ‌పార్టీ కె ఉందని టీజేఎస్‌ ‌నుండి కాంగ్రెస్‌ ‌పార్టీ లో చేరిన భవాని రెడ్డి అన్నారు .సిద్దిపేట లో కాంగ్రెస్‌ ‌పార్టీ ని బలోపేతం చేస్తానని తెలిపారు .కాంగ్రెస్‌ ‌పార్టీలో ఒక సభ్యురాలిగా అందరితో కలిసిమెలిసి పని చేస్తానని అందరిని కలుపుకుని అధికార టి ఆర్‌ ఎస్‌ ‌పార్టీ కి చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!