Take a fresh look at your lifestyle.

డీజిల్‌, ‌పెట్రోల్‌ ‌ధరల పెంపును నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌ధర్నా

  • ‘‘అచ్చేదిన్‌’’ అం‌టే కష్టాలలో ఉన్న ప్రజలను దోచుకోవడమేనా?
  • 20 రోజుల్లో పెట్రోల్‌, ‌డిజిల్‌పై లీటరుకు రూ.10 పెంపు
  • రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్‌ ‌చార్జీలకు నేడు నిరసన : నాయిని

ఎఐసిసి/టిపిసిసి పిలుపులో భాగంగా కేంద్ర ప్రభుత్వం గత 21రోజులుగా అడ్డూ, అదుపు లేకుండా పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపును నిర• •స్తూ జిల్లా నగర కాంగ్రెస్‌ ‌కమిటీ ఆధ్వర్యంలో హన్మకొండ కాంగ్రెస్‌ ‌కార్యాలయం నుండి కలెక్టర్‌ ‌కార్యాలయం వరకు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఎద్దు ల బండి లాగుతూ వినూత్న నిరసన ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అశోక జంక్షన్లో ర్యాలీని అడ్డుకుని అరెస్టు చేశారు. అనంతరం నాయిని రాజేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ ‘‘అచ్చేదిన్‌’’ అం‌టే కష్టాలలో ఉన్న ప్రజలను మాయ మాట లతో దోచుకోవడమా మోడీ అని ప్రశ్నించారు. పెరిగిన పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల ప్రభావంతో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతాయ న్నారు. పేద మధ్య తరగతి పైన అధికభారం, ప్రజలపై భారాలు మోపి కార్పోరేట్లకు, మేలు చేస్తున్న మోదీ ప్రభుత్వం అని దుయ్యబట్టారు. కొరోనా కష్టకాలంలో ఆదుకోవల్సింది పోయి ప్రజలపై అదనపు భారం మోపుతున్నారన్నారు. లాక్‌ ‌డౌన్‌ ‌కారణంగా ఉపాధి కోల్పోయి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలు పెరగడం పేద, మధ్య తరగతి ప్రజల జీవన విధానంపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ‘‘అచ్చేదిన్‌’’ అం‌టే 20 రోజుల్లో (జూన్‌ 7 ‌నుండి 26 వరకు) పెట్రోల్‌, ‌డిజిల్‌పై లీటరుకు రూ.10పెంచడమేనా అని అన్నారు.

అంతర్జాతీ య మార్కెట్లో క్రూడ్‌ ఆయిల్‌ ‌ధరలు తగ్గుతున్నా దేశంలో ఎందుకు పెరుగుతున్నాయని ప్రశ్నించారు. దేశచరిత్రలోనే పెట్రోల్‌ ‌ధరలను మించి డీజిల్‌ ‌ధరను పెంచడంలో మోడీ ప్రభుత్వం రికార్డ్ ‌సృష్టించిందన్నారు. గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌ ‌రావు మాట్లాడుతూ దేశంలో తొలిసారి 20 రోజులు నాన్‌ ‌స్టాప్‌గా పెట్రో,డీజిల్‌ ‌ధరలు పెంచిన మోదీ సర్కార్‌, ‌పొరుగు దేశాలల్లో కన్నా మనదేశంలో ఎక్కువ ధరలకి విక్రయించడం సిగ్గుచేటు అన్నారు. మన సామర్ధ్యం కేవలం 3.9 కోట్ల బారేల్స్ ‌మాత్రమే (ఉదా: చైనా నిల్వలు 53కోట్ల బారేల్స్, ‌జపాన్‌ ‌నిల్వలు 52.5 కోట్ల బారేల్స్) ‌లీటర్‌ ‌డిజిల్‌ ‌రూ.80 చేరుకోవడం చరిత్రలో ఎన్నడు లేదని, గత 6ఏండ్లలో లీటర్‌ ‌పై దాదా పు రూ.25 పెంచారన్నారు. మోడీ నిరంకుశ దోపిడీ ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. రాబోయే రోజుల్లో మోదీ సర్కార్‌కు ప్రజలు గట్టిగా బుద్ది చెబుతారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్‌ ‌చార్జీలకు నిరసనగా నేడు నల్ల జెండాలు ఎగురవేయ్యాలని పిలుపునిచ్చారు. అనంతరం అడిషనల్‌ ‌కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు.

ఈ కార్యక్రమంలో గ్రేటర్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్‌ ‌రావు, పిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్‌ ‌రావు, ఈవి శ్రీనివాస్‌ ‌రావు, టిపిసిసి కార్యదర్శి కొత్తపల్లి శ్రీనివాస్‌, ‌మీసాల ప్రకాష్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా మైనారిటీ సెల్‌ ‌చైర్మన్‌ ‌మహమ్మద్‌ అయూబ్‌, ‌వరంగల్‌ అర్బన్‌ ‌జిల్లా ఓబిసి డిపార్ట్మెంట్‌ ‌చైర్మన్‌ ‌మడిపల్లి కృష్ణ గౌడ్‌, ‌జిల్లా కాంగ్రెస్‌ ‌నాయకుడు పోతుల శ్రీమాన్‌, ‌గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మైనారిటీ సెల్‌ ‌చైర్మన్‌ ‌మీర్జా అజీజుల్లాహ్‌ ‌బేగ్‌, ‌గ్రేటర్‌ ‌వరంగల్‌ ‌మహిళా కాంగ్రెస్‌ ‌చైర్మన్‌ ‌బంక సరళ, మాజీ కార్పొరేటర్లు తోట వెంకన్న, ఖానాపూర్‌ ‌మాజీ ఎంపిపి తక్కళ్లపల్లి రవీందర్‌ ‌రావు, అర్బన్‌ ‌జిల్లా ఐ.టి.సెల్‌ ‌కన్వినర్‌ ‌వింజమూరి లక్ష్మి ప్రసాద్‌, ‌బ్లాక్‌ ‌కాంగ్రెస్‌ అధ్యక్షులు నాయిని లక్ష్మా రెడ్డి, బంక సంపత్‌ ‌యాదవ్‌, ‌మహమ్మద్‌ అక్తర్‌, ‌డివిజన్‌ అధ్యక్షులు అంబేద్కర్‌ ‌రాజు, దాసరి రాజేష్‌, ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌బోట్ల ప్రసాద్‌, ‌నల్ల సత్యనారాయణ, టి.సుధాకర్‌, ఎన్‌ఎస్‌యుఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అలువాల కార్తీక్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లకొండ సతీష్‌, ‌యూత్‌ ‌కాంగ్రెస్‌ ‌వరంగల్‌ ‌వెస్ట్ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌తోట పవన్‌, ‌నాయకులు చేపూరి వినోద్‌, ‌మహమ్మద్‌ ‌సమద్‌, ‌సందుపట్ల ధన్రాజ్‌, ఎ‌ర్ర మహేందర్‌, ‌బొంత సారంగం, మహమ్మద్‌ ‌జమీరుద్దీన్‌, ‌గుంటి స్వప్న, మేరీ, నాగపూరి దయాకర్‌, ‌సంగీత్‌, ‌కృష్ణ, కూచన రవీందర్‌, ఆర్షం అశోక్‌, ‌జన్ను పృథ్వి తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్‌ ‌నేతల ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది. ఎడ్లబండ్లతో నిరసన చేపట్టేందుకు కాంగ్రెస్‌ ‌నేతలు ప్రయత్నించారు.

అయితే ఎద్దులు బెదరిపోయి పరుగులు తీశాయి. దీంతో పలువురికి గాయాలు అయ్యాయి. ఎడ్ల బండ్లను సిద్ధం చేసిన క్రమంలో జనాలు పెద్ద ఎత్తున రావడంతో ఎద్దులు బెదిరిపోయి రోడ్లపై పరుగులు పెట్టాయి. కొద్ది దూరం వెళ్లిన తర్వాత ఎద్దులు పడిపోగా బండి బోల్తా పడింది. ఈ ఘటనలో కొంది మంది స్వల్పంగా గాయపడ్డారు. అప్రమత్తమైన పోలీసులు పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply