Take a fresh look at your lifestyle.

పెట్రో ధరలకు పెరుగుదలపై రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్‌ ‌నిరసన

  • ఇందిరా పార్క్ ‌వద్ద ధర్నా..అడుకున్న పోలీసులు
  • ఎడ్ల బండిపై వొచ్చి నిరసన తెలిపిన నేతలు
  • ధర్నాను అడ్డుకోవడంపై మండిపాటు
  • మెదక్‌ ‌నిరసనలో అపశృతి…ఎడ్లబండిపై నుంచి జారిపడ్డ దామోదర రాజనర్సింహ

పెట్రోల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్‌ ‌పార్టీ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఇందులో భాగంగా నగరంలోని ఇందిరాపార్క్ ‌వద్ద కాంగ్రెస్‌ ‌నాయకులు ధర్నా చేపట్టారు. ఎడ్లబండి వి•ద ఇందిరాపార్క్‌కు వొచ్చారు. పెరిగిన పెట్రోల్‌ ‌ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తూ ధర్నా చేపట్టగా అందుకు అనుమతి లేదని స్పష్టం చేసిన పోలీసులు వారిని అరెస్టు చేయడానికి యత్నించారు. ఈ క్రమంలో పలువురు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ధర్నా చౌక్‌ ‌వద్దకు వొచ్చిన మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సునీత రావుతో పాటు ఇతర మహిళా నేతలను అరెస్టు చేసి బేగంపేట పోలీస్‌ ‌స్టేషన్‌కు తరలించారు. స్థానిక నాయకులు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు నిరసనల్లో పాల్గొన్నారు.

పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపును వ్యతిరేకిస్తూ ధర్నాచౌక్‌ ‌లో సైకిల్‌ ‌ర్యాలీ, ఎడ్లబండితో నిరసన తెలిపారు. పీసీసీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ అం‌జన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌, ‌గీతా రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, ‌ఫిరోజ్‌ ‌ఖాన్‌తో పాటు పలువురిని పోలీసులు చేశారు. ఇదిలావుంటే ఇందిరాపార్క్ ‌వద్ద నిరసనలకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా? అని కాంగ్రెస్‌ ‌పార్టీ సీనియర్‌ ‌నేత అంజన్‌ ‌కుమార్‌ ‌యాదవ్‌ ‌ప్రశ్నించారు. ఇందుకేనా కొట్లాడి తెలంగాణ తెచ్చుకుందని ఆయన ప్రశ్నించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమన్నారు. అధికారంలోకి వొచ్చాక సీఎం కేసీఆర్‌ ‌సంగతి చూస్తామని అంజన్‌కుమార్‌ ‌యాదవ్‌ ‌తెలిపారు. పెంచిన పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించారు.

ఎడ్లబండిపై కాంగ్రెస్‌ ‌కార్యాలయం నుంచి ధర్నాచౌక్‌ ‌వరకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ర్యాలీ నిర్వహించారు. పెంచిన పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరలకు నిరసనగా మిర్యాలగూడలో కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ ‌శంకర్‌ ‌నాయక్‌, ‌మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌ ‌పాల్గొన్నారు. ఎడ్లబండిని లాగి జగ్గారెడ్డి నిరసన తెలిపారు. వరంగల్‌లో పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరల పెంపుకు నిరసనగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.  కాజీపేట నుంచి హన్మకొండ చౌరస్తా వరకు సైకిళ్లు, ఎడ్ల బండ్లు, రిక్షాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ ‌రెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్‌ ‌నాయిని రాజేందర్‌ ‌రెడ్డి, జిల్లా కాంగ్రెస్‌ ‌శ్రేణులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. పెరిగిన పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేశారు. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు క్రూడాయిల్‌ ‌ధర  లీటర్‌కు 70 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు ఉందన్నారు. అప్పుడు లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 71రూపాయలు ఉంటే.. ఇప్పుడు అది 105 రూపాయలకు చేరిందని రాంరెడ్డి దామోదర్‌ ‌రెడ్డి అన్నారు. నాయిని రాజేందర్‌ ‌రెడ్డి మాట్లాడుతూ… పెరుగుతున్న పెట్రోల్‌, ‌డీజిల్‌, ‌గ్యాస్‌ ‌ధరలపై టీఆర్‌ఎస్‌ ఎం‌దుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రజలు కష్టాల్లో ఉంటే ప్రభుత్వానికి పట్టదా అని నిలదీశారు. టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ కుమ్మక్కయ్యాయని ఆరోపించారు.

మెదక్‌లో కాంగ్రెస్‌ ‌నిరసనలో అపశృతి…ఎడ్లబండిపై నుంచి జారిపడ్డ దామోదర రాజనర్సింహ

మెదక్‌ ‌జిల్లా కేంద్రంలో పెట్రోల్‌, ‌డీజిల్‌ ‌ధరల పెంపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ ‌పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసనలో అపశ్రుతి చోటు చేసుకుంది. ఎడ్ల బండిపై నుంచి ప్రసంగిస్తుండగా మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ జారీ కింద పడ్డారు. ఈ ఘటనలో ఆయన కాలికి స్వల్ప గాయం అయ్యింది. పెట్రో ధరల పెంపుపై స్థానిక నాయకులు, కాంగ్రెస్‌ ‌కార్యకర్తలు ఈ నిరసనల్లో పాల్గొన్నారు.

Leave a Reply